నెమలికన్ను అలిగింది

ఎందుకో తెలీదు ఇప్పటిదాకా మనల్ని అలరించిన నెమలికన్ను ఒక్కసారిగా అలకచెట్టు ఎక్కి కూర్చుంది. అదీ వంశీగారితో ఫోనుకలిపాక గోపి గోపిక గోదావరిపై టపా వేసి మనల్ని ఊరించి, ఇప్పుడు అందర్నీ గుమ్మం దగ్గరే ఆపేస్తూంది. మరి ఈ అలక ఎందుకో ఏమిటో ఎవరిమీదో తెలియటం లేదు. ముందు నామీద అనుకొన్నా. తరవాత తెలిసింది అందరి మీదా అని. అయ్యా! మురళిగారు ఇక్కడ మీ టపాని చదివేందుకు మేము ఎదురుచూస్తున్నాం. త్వరగా ఆ సెట్టింగులు మార్చి మాకు వీసా ఇవ్వండి. ఉంగరంలేని శ్రీదేవిలా ఉంది మా పరిస్థితి.

9 comments:

  1. very nice.chAlA bAgA rAsAru.

    ReplyDelete
  2. తృష్ణ గారు నాకు ఇప్పుడే అర్థం ఐంది. మురళిగారి టపాలు 100 దాటాయి. మా పా.బ్లా.సం. వాళ్ల అనుమతి లేకుండా తపా వేశారు. అందుకే ఇలా.hahaha

    ReplyDelete
  3. మురళి గారు, ఎందుకు ఇలా అర్దాంతరంగా మీ బ్లాగు అపేశారు? ఒకవేళ మీకు కొద్దిమందికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని నా నమ్మకం. సిల్లి విషయాలు పట్టించుకుని మీరు బ్లాగుని ఇలా చేయ్యరు. ఇదివరకు కూడా నేను ఎంతో ఇష్టంగా చదివే కొన్ని బ్లాగులు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాయి. మీది అలా కాకూడదని ఆశిస్తున్నాను. మీలాంటి బ్లాగ్మిత్రుడను వదులుకోడానికి మేం సిద్దంగా లేము. మిమ్మల్ని సంప్రదించే అవకాశం లేక ఇక్కడ కామెంట్ పెడుతున్నాను.
    @చైతన్య గారు, మీ బ్లాగుని ఇలా ఉపయోగించినందుకు క్షమించాలి. వేరే అవకాశం లేక ఇలా చెయ్యవలసివచ్చింది. సహృదయంతో అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

    ReplyDelete
  4. @ నేనూ చూశా ! ఎందుకిలా ?
    మురళి అలిగితే రాగాల తోట చిన్నబోదా ?

    ReplyDelete
  5. అలగలేదండీ.. చిన్న ఇబ్బంది.. త్వరలోనే మీ అందరూ రావొచ్చు.. అక్కడే వివరంగా చెబుతాను.. అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మీరు ఎంతత్వరగా సరిచేస్తే మాకు అంత సంతోషం

    ReplyDelete
  7. Did u watch jagadEka veeruDu atilOka sundari. In that she can't enter into heaven as she lost her ring.

    ReplyDelete
  8. నెమలి అలకను తీర్చిన నిశ్శబ్ద విప్లవ విధానం బాగుంది... చెప్పడం మరచాను నేను కూడా నెమలికన్ను follower నే....

    ReplyDelete