అబ్బా! ఇదీ పోరాటం అంటే. ఎన్నికలకి సంవత్సరం ముందు నుంచి మొదలెట్టెశారు పోరాటాన్నీ. కొంతకాలం ముఖ్యమంత్రి మీద.అది మామూలే అనుకొన్నా. గతంలో ఈయన చేసిన మాగొప్పపనుల్ని మర్చిపొయాడు అనుకొంటా. మారవయ్యా 'బాబూ' అంటే మారాడు. కాని తనకి ఇష్టంవచ్చినట్లే గాని పార్టీకి జనాలకి అవసరమైనట్లుగాదు. అప్పటిదాకా జరిపిన పోరాటాన్ని ఇతర పార్టీలపై మొదలెట్టాడు. మీరు ఎదవలు అంటే మీరు ఎదవన్నర ఎదవలు అంటూ అబ్బో అప్పట్లో రాష్ట్రం దద్ధరిల్లింది. మొత్తానికి అందరం ఎదవలమేనండొయ్ అంటూ పళ్లికిలించుకొంటూ కనిపించారు. తీరాచూస్తే అదొక మహాపొత్తు. పొత్తులో మళ్లీ పోరాటం. సీట్లకి. ఎవరికి ఎంతబలంకాదు ఎవడైతే అక్కడ డబ్బుపోస్తాడు అని. ఒక సోఫాలొ నలుగురుకూర్చున్నారు. అది సరిపోక అందరూ సర్దుకొంటున్నారు. కాని ఎవరికీ పక్క వాళ్ల చొక్కామడతైనా తగలటం ఇష్టంలేదు. కానీ మళ్లీ పళ్లికిలించారు. ఇక పోరాటం ఐపొయిందిలే అనుకొంటే మళ్లీమొదలు. మొన్నామద్యదాకా అంతాకొట్టుకొంటూ ఇప్పుడు పొత్తు అంటే ఉన్నపళంగా పోరాటస్పూర్తి ఆగిపోదు కదా. మళ్లీ ప్రచారాల్లొ పోరాటం.(ఇంకా పొత్తు ఉందట!) ఫలితాలు వచ్చేశాయ్. మళ్లీపోరాటం. నీవల్ల అంటే నీయబ్బ నీవల్లే అంటూ. ఆయన బాధ ఏంటి అంటే ఎవరో పార్టీలు పెట్టారంట అందుకు ఈనకి కుర్చీ మిస్‌కొట్టేసింది. మళ్లీపోరాటం. ఈసారి ఎన్నికలకమీషన్ మీద. ఒకప్పుడు నావల్లే దెశంలొ కంప్యూటర్లు ఉన్నాయ్ అంటూ అమెరికా దొరల దగ్గర చెప్పి జబ్బలు చరుచుకొన్నయనకి ఇప్పుడు పేపరుమీద గుద్దితెనే ఓటు అంటున్నాడు. ఈ.వీ.యంలో ఈన చెప్పినవి సాధ్యం ఐతె 2004లో జరిగింది ఏందట? ఇంకనైనా ఊరుకొంటాడులే అనుకొంటే ఇంతలో మిగిలిన పార్టీలని మీరు నన్ను ఎందుకు కుర్చీ ఎక్కనివ్వలేదు అని దెప్పిపొడుపులు. ఇంతలొ నల్లప్రసన్న రెడ్డి(మా పక్కూరే) మారు 'బాబూ' అని మళ్లీ. అరెరే! పోరాటం మొదటికి వచ్చిందే అనుకొన్నా. అమెరికాపొయ్యాడంట. కోడలుపిల్ల దగ్గరికి వియ్యంకుడితొ కలిసి. ఇక్కడ ఎండలు ఎక్కువ కదా. చంద్రగిరిలో ఉంటే ఎండాకాలం మదనపల్లి పొయ్యుండేవాడు. హైదరాబాదులో ఉన్నప్పుడు కనీసం అంతదూరం పోకపోతే పీనాసోడు అంటారు కదా. ప్రిస్టేజి.అందులో తొడలు కొట్టె వంశానికి అల్లుడు కం వియ్యంకుడు కం మామ కదా. కోడలుపిల్ల డిగ్రీకూడ చేతికి వచ్చేసింది, ఆమె చేతివంటతిని కొంచెం చల్లబడి వస్తాడులే అనుకొన్నా. ఐనా ఆపట్లేదు పోరాటం. ఎంతైనా సీమనెత్తురు కదా. ఈసారి పోరాడడానికి ఎవరూ దొరకట్లేదు. ఎప్పుడో మామకి పీ.ఏ.గా పనిచేసినాయన గుర్తొచ్చాడు సడన్‌గా. అంతే మళ్ళీ పోరాటం. నువ్వుకూడా ఎదవవే అని చెప్పాడు. పాపం ఈన పొత్తుపెట్టుకొని కొట్టుకొనేరకం కాదు. ఆలాంటొడైతే ఆ మామతోనో లేక ఈనతోనో పెత్తుపెట్టుకొని ఒకేసమస్తరంలో డబలు ప్రమోషను కొట్టి హాయిగా కాలుమీదకాలు ఏస్కొని దర్జా అనుభవించుండేవాడు. ఐనా మా పోరాటం మాదే.
ఇంతకీ నేను చెప్పాలి అనుకొనేది ఎమిటంటే అసలు ఈసారి ప్రతిపక్షంలో ఉన్నవాళ్లని ఎవరైనా ప్రజలు, ముఖ్యంగా మద్యతరగతి వాళ్లు నమ్మగలారా? దీనికి అనేక కారణాలు. ప్రతిపక్షాల్లో మొదట చంద్రబాబు విషయానికివస్తే గత ఐదేళ్లుగా పూర్తివిఫలం. ఎన్నిసార్లు రెడ్డిగారితొ మాచ్‌ఫిక్స్ చేశాడో అందరూ చూశారు. ఇక చిరంజీవికి అసెంబ్లీలో ఎక్కడకూర్చోవాలోకూడా అర్ధంకాక తికమక. ఆయన ఇంటిసమస్యలు, ఒంటిసమస్యలు ఆయనవి. పాపం మనల్ని చూసే తీరిక ఏది. మరీ ఎదైనా చెప్పుకోవాలంటే బామ్మర్దికి టపాకొట్టాలి. కమ్యూనిస్ట్ సోదరులు ఒకడు సుత్తి ఇంకొకడు కొడవలి ఎత్తుకొని సింద్ధాంతాలపై సిద్ధాంతాలతో సిద్ధాంతాల కొరకు పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. మిగతా పార్టీలగురించి రాస్తే మీరు ఈ కిటికీ మూసేస్తారు. మిగిలింది ఒక్కడు. అవును ఆ ఒక్కడే. నా మట్టుకు నాకు వచ్చే ఐదేళ్లలో ప్రతిపక్షమైనా ప్రజలపక్షమైనా ఒక్కడే. నేను గానీ ఒక ఈల గానీ వేశానంటే...
Just now in Eenadu, I have seen a news about blast in "Singrowli". I hope you are safe. What happened there?
ReplyDeleteno problem. that location is approx 20km from my place. its not a militanat attack. some fire accident in a factory
ReplyDelete