ఆత్మ-శక్తి

అలవాటు ప్రకారం ఈరోజు కూడలిలో ఉన్న టపాలను చూస్తున్నాను. అందులో ఒకటి కొంత ఇబ్బంది పెట్టింది. వాళ్లను వ్యక్తిగతంగా ప్రశ్నించే హక్కునాకు లేదు. ఎందుకంటే అదివాళ్ల బ్లాగు. పూర్తిగా వాళ్లకు సొంతం. అక్కడ అనవసరమైన వ్యాఖ్యలు రాయటం వాళ్లతో వ్యక్తిగతంగా ఘర్షణకు దారితీస్తుంది అని భావించి అక్కడ రాయలేదు. ఇది నాబ్లాగు కాబట్టి నా అభిప్రాయాలను రాస్తున్నాను.

భగవద్గీత

అధ్యాయం 2: సాంఖ్యయోగము 22వ శ్లోకం

వాసాంసి జీర్ణాని యథా విహాయనవాణి గృహ్ణాతి నరోపరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సమ్యాతి నవాని దేహి


అధ్యాయం 2: సాంఖ్యయోగము 23వ శ్లోకం

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః

పైరెండింటి అర్ధాలు చాలా మందికి తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే " ఆత్మను సృష్టించలేము. నాశనము చెయ్యలేము. అది ఒక రూపమును వదిలి మరొక రూపమునకు మారుతూ ఉంటుంది."


ఆధునిక శాస్త్రాలను అనుసరించి:


శక్తినిత్యత్వ నియమము:

ఒక వ్యవస్థలోని శక్థి స్థిరం.దానిని సృష్టించలేము. నాశనము చేయలేము. అది ఒక రూపము నుంచి మరొక రూపానికి మారుతూ ఉంటుంది.

పైరెంటిలోని సారూప్యతను అర్థం చేసుకొనేందుకు పెద్దగా కష్టంకాదు అనుకొంటా.

ఏమతం గుడ్డిగా తనధర్మాన్ని పాటించండి అని చెప్పదు. సైన్సులో ఎంత తర్కం ఉందొ దానిలో అంతకుమించిన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. దాన్ని అర్ధం చేసుకోలేకపొతే మనలోపమే. అందుకు మతాన్ని తక్కువచేయటం ఎందుకు? ఇప్పుడు మనం సైన్సు అని పిలుచుకుంటూ చదువుకొంటున్న సైన్సు పుట్టి మహా అయితే 800 సంవత్సరాలు. మరి అంతకుముందు మనిషి జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలులేవా ?

6 comments:

 1. సరియైన ఉదాహరణ కోట్ చేసారు.

  ReplyDelete
 2. Dude, could you pl. point me to the blog that has inspired you to write this.

  ReplyDelete
 3. "ఏమతం గుడ్డిగా తనధర్మాన్ని పాటించండి అని చెప్పదు."
  మీరు చెప్పిన మిగతా విషయాలు OK గానీ, పైన చెప్పిన స్టేట్మెంట్ శుద్ధ తప్పు. ముఖ్యంగా క్రైస్తవమతం సైన్సుకి వ్యతిరేకంగా జరిపిన కుట్రలూ,రక్తపాతం తెలిసిన ఏ వ్యక్తీ మీరు చెప్పిన మాటని అంగీకరించలేదు. ఇప్పటికీ ఇస్లాం చాలా విషయాలలో ఈ మొండిపట్టుదలనే చూపిస్తుంది.

  ReplyDelete
 4. మిగతా మతాల సంగతేమో కాని, హిందూ ధర్మంలో సైన్సు ఒక అంతర్భాగం. నిజానికి సైన్సునే మనవాళ్ళు పామరులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో కథలుగా చెప్పారు. ఆ జ్ఞానం మనకు పూర్తిగా అందకుండా పోయింది.

  ReplyDelete
 5. @ బృహస్పతి, గణేష్ : ధన్యవాదములు
  @ మహేష్: సైన్సుపైన ప్రాశ్చాత్యుల కుట్రలకు మూలం వ్యక్తిగత స్వార్థమే కానీ మతంకాదు. కాకపోతే వాళ్లుచేసిన దుర్మార్గాలకు చర్చిని వేదిక చేసుకొన్నారు కాబట్టి ఆమకిలి క్రైస్తవానికి అంటుకొంది. నిర్గుణాకారుడైన దేవునికొలవమనే ఉన్నతమైన ఆదార్శం ఇస్లాంకి పునాది. కానీ ఇక్కడకూడా వ్యక్తుల స్వార్ధానికి అది తీవ్రవాదానికి పర్యాయపదం ఐంది.
  @ నాగప్రసాద్: మీరుచెప్పింది నిజం. ఇదికేవలం భారతదేశంలోనే కాదు చైనా, గ్రీస్, ఈజిప్ట్, మద్యప్రాచ్యం లాంటి అనేక ప్రాంతాల్లో జరిగింది. వారిముందు తరాల పరిజ్ఞానానికి వారసులు కాలేకపోయారు.

  ReplyDelete
 6. I agree with Nagaprasad. Actually, they formed god/goddess for different forms of energy. Also, they told stories so that all the people can understand. But as the time proceeded every body has their own interpretation of stories and the actual essence/intent was lost. Also, now a days people are always depending on logic rather than intuition. If we keep on going in logic there will be end less questions.

  ReplyDelete