సింగీతమ్ శ్రీనివాసరావు

ఈరోజు తృష్ణ గారి టపా చూసిన తరువాత ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు రాస్తే ఇదిచూసిన వాళ్ళకి తెలియనివి ఎమైనా తెలుస్తాయి కదా అని టపా వేస్తున్నాను.

  • రామచంద్రరావు, శకుంతలాబయి ఆయన తల్లిదంద్రులు.
  • సొంతూరు ఉదయగిరి, నెల్లూరు జిల్లా
  • పుట్టింది సెప్టెంబరు 21, 1920లలో అనుకొంటా!
  • హైస్కూలు వరకు గూడూరులొ చదివి తరువాత ఇంటర్మీడియట్ నెల్లూరు వీ.ఆర్. కాలెజీలొ.డిగ్రీ చెన్నపట్నంలొని ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కాలేజీ( ఇప్పటికీ అది సైన్సు & ఆర్ట్సు లొ దేశంలోనె టొప్ 3)
  • భార్యపేరు లక్ష్మీకళ్యాణి వారికి ఇద్దరు కూతుళ్ళు
  • వారి మాతృభాష కన్నడం .( మధ్వులు అనుకొంటా)
    వాళ్ళ అమ్మగారికి సంగీతంలో చాలాప్రవేశం ఉండేదట. ఆమె వయోలిన్ చాలాబాగా వాయించేవారట. చిన్నప్పుడు సింగీతం గారికి కూడా నేర్పిచ్చి గొప్పగాయకుడిని గాని, లేక ఎదైనా వాద్యమైనా నేర్పిద్దామని ప్రయత్నించినా కుదరలేదు.నాకు ఇష్టంలేదని చెప్పాడట. తరువాత మద్రాసు గాలిసోకి సినీరంగంలోకి వచ్చారు.
  • మొదటి సినిమా: నీతి-నిజాయితీ(కాంచన )
  • తెలుగులో ముఖ్యమైనవి: తరం మారింది, పంతులమ్మ, మయూరి(9 నందులు) , బృందావనం, ఆదిత్య 369( ఎన్ని నందులొ తెలియదు) , భైరవద్వీపం( 11 నందులు)
  • కన్నడలొ ముఖ్యమైనవి : సంస్కార( రాష్ట్రపతి అవార్డ్), హాలుజేను(175రొజులు రాజకుమార్), భాగ్యద లక్ష్మి బారమ్మ,ఆనంద్,
  • తమిళంలొ ముఖ్యమైనవి: దిక్కెట్ర పార్వతి, రాజపార్వై,అపూర్వ సోదరగళ్( విచిత్ర సహొదరులు), మైఖేల్ మదన కామరాజన్ ( మైఖేల్ మదన కామరాజు) మగలిర్మత్తుం
  • పుష్పక్( పుష్పక విమానం), లిటిల్ జాన్, సన్ ఆఫ్ అల్లాద్దిన్( అంతర్జాతీయ బాలలచిత్రోత్సవం 2003) ,ప్రార్థన( 30 శ్లోకాల ఆల్బం పిలలు పాడారు)
  • మొత్తంసినిమాలు యాభైకి పైమాటే
  • పుష్పకవిమానం ప్రపంచంలొనే 100 ఉత్తమచిత్రాల్లొ ఒకటి భారతదెశంలొ టాప్ 25 లొ ఒకటి.(జెంటిల్మాన్ మగజైన్)
  • (మైఖేల్ మదనకామరాజులో మొదట ఒకాయన "కధచెబుతా ...కధచెబుతా" అంటూ బయోస్కోప్ ఎత్తుకొని ,పంచె కట్టులో వస్తాడే ఆయనే సింగీతమ్. కొన్ని సినిమాల్లో అతిధిగా కనిపించాడు.
    సింగీతంగారు తన చిత్రానికి స్క్రీన్ ప్లేను స్వయంగా రాసుకుంటారట
    ఆనిమెషన్ సినిమాకొసం 3నెలల్లొ 3డి ఆనిమేషన్ నెర్చుకొన్నారట.
    కమల్ ఫేవరెట్ డైరెక్టర్లలొ బెస్ట్
    తెలుగులోహీరోలు కొంచం నసగాళ్ళు అని ఫీలింగ్.ఇక్కడ రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉంటారు.
    బాలు, కమల్, ఇళయరాజా ఇండస్త్రీలొ ఫ్రెండ్స్
    ఆయనగురించి తెలుగువాళ్ళకంటే కన్నడిగులకు,తమిళులకు ఎక్కువ తెలుసు. కొంతమందితొ ఈయన పేరుచెబితే ఎవరు అన్నారు. ఆయన సినిమాలు, ఇంకొంత ఉపొద్ఘాతం చెబితె ఓహో ఆయనా అన్నారు.
  • కొసమెరుపు: బాలకృష్ణకే అంతపెద్దహిట్లు ఇచ్చాడు అంటే ఇక సింగీతం స్టామినా చూస్కొండి.

మీదగ్గర వేరే సమాచారం ఏమైనా ఉన్నా, లేక నేను వేసిన టపాలో ఏమైనా తప్పులున్నా తెలుపగలరు.

4 comments:

  1. కధచెబుతా ...కధచెబుతా" అంటూ బయోస్కోప్ ఎత్తుకొని పంచె కట్టులో వస్తాడే ఆయనే సింగీతమ్.

    aa paata padindi kuda aayane

    ReplyDelete
  2. "నెల్లూరు కలిపింది ఇద్దరినీ..." అన్నమాట!! బాగుందండి సమాచారం.. ఇక్కడ కూడా ఓ లుక్కెయ్యండి.. http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=21719&categoryid=11&subcatid=25
    ...అన్నట్టు ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే ధన్యులమవుతాము...

    ReplyDelete
  3. @మురళి చాలాకాలం ఆయనది నెల్లూరని తెలియదు. తెలిసిన తరువాత ఇకమామూలే అడిగినవాళ్ళకి అడగనివాళ్ళకి ఊదరగొట్టాను. ఆమాత్రం ఉండాలిగా. రాత్రికొన్ని మారుస్తూ వెరీఫికేషన్ కూడా ఏదోచేసినట్టున్నా గమనించలేదు.

    ReplyDelete