పిచ్చోళ్ళు

మోన్న మాఅమ్మ ఫోను. ఏ పెళ్లిసంబంధమో అనుకొన్నా. కాదు. హమ్మయ్య కొంచం ప్రాణం లేచొచ్చింది. కొంచం సేపటికీ "అసలు అక్కడ ఎలా ఉంటున్నావురాఆఆఆ" అని పెద్దాదీర్ఘం మాయాసలో. "అసలే నీనోరు నిద్దట్లోకూడా గుట్టుగుండదు.(అంటే కొంచెం కలవరింతలు ఎక్కువ.చిన్నప్పుడు ఐతె నిద్దట్లో ఎవడో క్యాచ్ పట్టలేదని పక్కన నిద్రపొతున్న మా అత్తకొడుకుని ఎగిసితన్నాను. తరువాత అమ్మాయిలు కలలోకి రావటం మొదలైన తరువాత కలలు ఎక్కువై కలవరింతలు తగ్గాయి.) అక్కడ ఎవరైనా తగిలారా?" అని అడిగింది. మనకు ఎక్కడకు పోయినా ఎవడో ఒకడు తగుల్తారని తెలుసు. ఎంతైనా తల్లిగుండె. "పాత ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తగులుతున్నారు మా చాటింగ్లో" అనిచెప్పా. ( చాటింగ్ అంటే అమ్మకి తెలుసు. పాప(చెల్లి) బావను అందులొంచే రెండునెలలు కంట్రొల్ చెసింది.అందుకే నాకు పెళ్ళి ఇప్పట్లో మంచిది కాదు అని అనుకొన్నా. చూశారా మన ఇంట్లోనే మనకు ఎందరొ జీవితానికి సరిపడా గురువులు ఉంటారు.) "మరీ నీ విశ్వరూపం చూపేవు మళ్ళీ పింగరు" అని జాగ్రత్త చెప్పింది. ఐనా మన సంగతి తెలిసి వాళ్ళూ పింగటం ఎప్పుడో ఆపేశారు అని తెలియదు.పిచ్చి అమ్మ.(దీన్ని చదివే అమ్మలు క్షమించేశారుపో!)

తరవాతరోజు అశోకుడు ( వీడు చెట్లు నాటించలేదు కాని చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాడు) "ఎమిరా అసలు కాల్ చెయ్టం మానెసావే". వాడిదీ అదే దిగులు. పాపం ఒకవారమునుంచి చెయ్యాలి అనుకొవటం కాని బిల్లుకు జడిసి వాయిదావెయ్యటం. అదీ వాడి పరిస్తితి. అసలే చైతుగాడు మనుషులు దొరక్క ఆకలిమీద ఉంటాడు ఇప్పుడు కదిలిస్తే బిల్లు కట్టేందుకు ఉన్నసెల్లు తాకట్టూపెట్టాలి అని వాడిభయం. ఐనా ఒక ఫొన్ చేసి కుశలప్రశ్నలడిగి అసలు విషయాలకి వచ్చేసరికే హలో..హలో అంటూ ఫొన్ పెట్టేసాడు. వాడిది చిన్నారి స్నేహం. పిచ్చి స్నేహం.

మరోకరోజు గిరి గాడు, శాన్ గాడు "బుద్దిలెకుండా అంత దూరంలొ ఉండే ప్లాంట్ పోస్టింగు అడిగి మరీతీస్కున్నావ్ అనుభవించు... " అంటూనె హేడ్ సెట్ కొన్న తరువాత స్కైపుకొ, జీటాకుకో కలుపుదాం అని పెట్టేశారు. వీళ్ళది మనతొ ఋణాణుబంధం.కాబట్టి ఎక్కడున్నా వదలరు.

"హలో బావా!" అంటూ విభాగాడు. దొరికాడురా ఒకడు అనుకొంటె "మన మధుభాయిపెళ్ళి " అని చెప్పి ఆ షాకునుంచి తేరుకొనేలోపే పెట్టేశాడు.( షాకు ఎందుకు అంటే ఆయన పెళ్ళిప్రయత్నాలు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్వర్ణచతుర్భుజికిముందు కొట్టారు టెంకాయి.)అన్నట్లు చెప్పడం మరిచా నా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ సుబ్బూ అని,ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ నన్ను బావా అని పిలుస్తారు.

చంద్రా గాడిని గోకితె "సుబ్బూ అప్రైసల్ టైం. మనసుబాలేదు" అన్నాడు. (ఇప్పుడు మీకందరికీ ఒక ప్రశ్న ఈ చంద్రా ఎవడు? జవాబు చెప్పి నా శిష్యకోటిలో మొదిటివారయ్యే అవకాశం దక్కించుకోండి.) మరికొంతమందీ అంతే. బయటిపరిస్థితి బాలేదు కదా!ఐనా అందరిలొనూ ఒకే .ఆలోచన అసలు వీడు( అంటే నేను) ఎలాఉంటున్నాడా అని? అమ్మతో సహా ఎవరూ అన్నం ఎలాఉంది అని అడిగిన వాళ్ళే లేరు. వాళ్ళా ఆలోచన అంతా నా వాగుడు గురించే.




హ్హి హ్హి హ్హి హ్హీ పిచ్చొళ్ళు నేను ఇంతకాలం ఎలాగుట్టుగా ఉంటాను. మిమ్మల్ని గోకటంలేదూ?

8 comments:

  1. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు :-) (అప్పుడింక నోరెత్తే పని ఉండదండీ.. మౌనమే నీ భాష అని పాడుకోడమే..)

    ReplyDelete
  2. @మురళి: ఇలాంటివాతలు పెట్టారంటే మళ్లీసెట్టింగ్స్ మారుస్తా. మిమ్మల్ని వాతలు పెట్టమన్నాను గాని శపించమన్నానా? అంతేలేండి మేము సుఖపడిపోతుంటే మీపెద్దోళ్ళకికుళ్ళు.

    ReplyDelete
  3. అనుభవించురాజా.. ఇవే వాగుడుకు ఆఖరి రోజలు లేదా సంవత్సరాలు.. పెళ్లైతే అన్నీ కట్.. మురళిగారిని అనడం ఎందుకు? నాదీ డిటో దీవెన.. తప్పకుండా ఫలిస్తుంది.. :))

    ReplyDelete
  4. మురళి, జ్యోతి
    ఏదో చిన్న కుర్రాడు కొత్తగా బ్లాగు పెట్టి అద్భుతంగా రాస్తుంటే ఇలాగా దీవించడం! కొన్నేళ్ళయినా హాపీగా మాట్లాడనివ్వండి. తరవాత ఈదుతాడు భవసాగరాలు కనీసం చెంచాడు.
    ఆల్ ద బెస్ట్ చైతన్యా,,,,గుడ్ గోయింగ్!

    ReplyDelete
  5. @జ్యొతి: కొంచం మీవారి ఫొన్నంబర్ ఇస్తారా
    @హరే కృష్ణ:థాంక్స్
    @సుజాత: హైదరాబాదువాళ్లు అందునా నరసరావుపేట నుంచి వెళ్లినోళ్లు చాలా మంచొళ్లని విన్నా. నిజమే.

    ReplyDelete
  6. ఇప్పటి నుండే ఎందుకులెండి ఆ ఆలోచన....ముందుంది ముసళ్ళ పండగ!!

    ReplyDelete
  7. పద్మార్పిత: నేను చెప్పింది కూడ అదేనండీ.అందరూ కలిసి టాపిక్ మార్చేసారు.

    ReplyDelete