“ఇంక్విలాబ్ జిందాబాద్” టపాని వేసి నా లాప్‌టాప్‌కి గొళ్ళెంపెట్టి వెళ్ళి పోయాను. ఒకగంట తరువాత కూడలికి వచ్చాను. హాచ్చీరం! పైనుంచి కిందదాకా పాకేస్తున్నారు పాకుడుబ్లాగర్లు.అన్నీ "జిందాబాద్" టపాలే. ఆదెబ్బకి కూడలిపేజీతొ బాటూ నా బ్లాగులో ఉన్న బొత్తం కూడా ఎర్రగా మారింది. అందులోని బాణంగుర్తులు మాదెబ్బకి వణికి తలోదిక్కుకి లగ్గెత్తాయి. అంతే అంతవరకు మామూలుగా ఉన్న పాకుడువాళ్ళకి ఒక్కసారిగా కదనోత్సాహం. కొండని ఢీకొట్టేందుకు సిద్దం ఐపోయారు. ఇప్పటిదాకా అసంఘటితరంగంలొ ఉన్నమేము కలిసి పోరాడేందుకు నిర్ణయించుకున్నాం. అదెంటో నేను అడక్కుండానే అందరూ నన్ను నాయకుడిని చేసేశారు.( ఇది నిజం)
సరే మన మొదటి సమావెశం ఎక్కడ? "హైదరాబాదు, విశాఖ, బెజవాడ, తిరుపతి లాటివివద్దు. అక్కడ సీనియర్‌బ్లాగర్లు ఎక్కువ. మనకు కొంచెం ఇబ్బందులు వస్తా"యని చెప్పాడు ఒకడు.అంతే నాలోనాయకుడు వెంటనె వాడిని కార్యదర్శినిచేసెయ్ అని చెప్పాడు.ఇంకొకడు "అన్నా ఎక్కడొ ఎందుకు మీ ఊర్లోనె స్వర్ణముఖిలొ పెట్టెయ్ అందులో నీళ్లు ఉండవ్ ఎప్పుడూ ఇసకే అని చెప్పవుగా" అని ఆశగా ఎదురుచూశాడు. నేనేదొ ఒకసారి నాటపాలొ అలారాసుకుంటె ఇప్పుడు అందరిముందూ దాన్నిచెప్ప్తావా. వీడు భవిష్యత్తులొ నీకు అసమ్మతిని పెడతాడు జాగ్రత్త అనిచెప్పాడు అంతర్నాయకుడు.
అందరూ నన్ను అన్నా అనిపిలుస్తుంటే తెలీని సంతోషం.నాకు నేను ఇల్లేరమ్మలో సుశీలలా పొంగిపోయాను. ఇంతకీ మనసంఘం పేరు ఎమిపెట్టాలి అని అనుకొంటున్నాం. ఎవడో ఇంతలొ "పాకుడురాజ్యం(బ్లాగేలక్ష్యం- పోస్టేమార్గం)". "వద్దన్నా ఆథీము అచ్చిరాలేదు". ఇంకొకడు"ఆఖిల భారత.." అని ఏదొ చెబితే ఇంకొకడు "అదెలా నేను ఉండేది యుఎస్‌లో, వీడు యుకేలో".మరొకడు"విశ్వ బ్లాగరు..". దానికి "మతతత్వం అని పొరబడుతారన్నా". చిర్రెత్తుకొచ్చింది. "ఏరా మీ బ్లాగులకేమో బరువైన, భావుకత ఉట్టిపడేలా ఒక్కొక్కరు విశ్వనాథగారి రేంజ్‌లొ పెట్టుకొని ఇక్కడమాత్రం పేరడీలు చేస్తారా? పాకుడు బ్లాగర్ల సంఘం. అంతే ఎక్కువ వద్దు. ముందుపని చూడండి" అన్నాను. సరే మరి మాఊర్లొనే మొదటి సమావేశం. ప్రోగ్రాం మీకు మెయిల్ చేస్తా. వచ్చేప్పుడు నేప్కీన్లు, నీళ్లసీసాలలాంటివి మర్చిపోవద్దు. ఇంకా ఏమేమి అవసరమో ఇప్పటికే ఎవరో సీనియర్ రాసేసుంటారు వెతకండి అని చెప్పా.
మసక వెలుతురు. ఇసుకతిన్నెలు.( ఇంతకంటే ఎక్కువ వర్ణిస్తే మరీ రొమాంటగ్గా ఉండి అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది అందికే రాయట్లేదు.) దూరంగా లాంతర్లు ఎత్తుకొని వరుసలో పాకుతున్నారు. ఆ లాంతర్లు ఎప్పుడో 'అక్షరదీపం' అప్పుడు ఇచ్చినవి అనుకొంటా. సమావేశం మొదలైంది. పది కమిటీలు వేసేశాం. ఒక వారం రోజులు పాలపీకలు నోట్లో వెస్కోని అన్ని కమిటీలు పనిచేసాయి.
కుర్రెదవలం. ఎవడికమిటీలోనిపని వాడు చెయ్కుండా పక్కనోళ్లని గిల్లేటోళ్లే. "ఏరా! మీపని ఎంతవరకు "వచ్చింది అంటే "వాడునాబలపం తీస్కొన్నాడు, వీడునాపలక మీదా "ఏదోపోశాడు అని చెప్పేటోళ్లే. అమ్మాయిలు ఎవరూలేరు కాబట్టి సరిపొయింది అనుకొంటే ఒకడొచ్చి కూడలి చూపెట్టాడు. అంతా 'జిందాబాద్‌లు' ఉన్నాయి. ఒక్కటితప్ప. ఎవడో మా ఏట్లో మనసుపారేసుకొన్నాడు. వాడి ప్రేమలేఖ ఒకటపా వేసేశాడు. వీళ్లందిరినీ ఎలాగోలా సర్దిచెప్పి పనిపూర్తిచేసి రిపోర్టుతో వచ్చేసరికి నా పరిస్థితి శ్రీదేవి పెళ్ళికి పెద్దరికం ఒప్పుకొన్న రావుగోపాలరావులా అయ్యింది.(అసలు దానిపై ఒక టపా పెట్టాల.)
ముందు చర్చించిన విషయం వర్గీకరణ. ఇప్పటిదాకా మాకుమేము 'పాకెటోల్లం' అని పిలుచుకోవటమే గాని ఇది అధికారికంగా ధృవీకరించలేదు.
1. పాకుడు బ్లాగర్లు- 30కంటే తక్కువ టపాలు వేసినోళ్లు. వీళ్లకి అన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. వీళ్లు ఎమి రాసినా అందరూ "అబ్బో! అద్భుతం!" అంటూ పొగడాలి. ఏమైనా అచ్చుతప్పులున్నా కామెంటులో రాయకూడదు. ఎవరైనా వీధిలొ కనిపిస్తే వీళ్లగురించే చెప్పాలి. వీళ్లకు ఎప్పుడైనా టపా వెయ్యటానికి ఎమీ దొరక్కపొతే మీరే ఎదైన విషయానికి లింకులు పంపాలి. అంటె వీళ్లది రాజవాసం అన్నమాట.
2. దోగాడే బ్లాగర్లు- 30-60 టపాలు వేసినోళ్లు. వీళ్లకి పర్లేదు అప్పుడప్పుడూ "శభాష్" అంటూ, ఎమైనా విషయం కావాలంటే ఎక్కడుందో రిఫరెన్సు ఇస్తే చాలు. అచ్చుతప్పుల్ని మాత్రం క్షమించనక్కర్లేదు. అయితే దానికి మరీ కఠినంగా చెప్పకూడదు.
3.నడిచే బ్లాగర్లు- 60-100టపాలు వేసినోళ్లు. వీళ్లకి మాత్రం కొంచెం బంధాలు పెంచాలి. ఆవేశం పెరిగి అప్పుడప్పుడూ వీధిలోకి పరిగెత్తేస్తారు. వీళ్లు పాకుడుబ్లాగర్లని తమ సొంతతమ్ముళ్లలాగా భావించాలి. ఎవరైనా ఎమైనా ఇస్తే వాళ్లకికూడా పంచాలి.
4. సీనియర్ బ్లాగర్లు- 100కుపైన టపాలు వేసినోళ్లు. వీళ్లు ఎవరు ఏదీడిగినా కాదు,లేదు అనకూడదు.
అప్పుడుపూరించాం సమరశంకాల్ని.మాకు శంకువు ఊదటంరాదుగా అందుకే మొన్న కనుపూరు జాతర్లో కొనుక్కొన్న బూరల్ని ఊదాం. ఇవేమా డిమాండ్లు.
- మీరు పాకేటొళ్లని ఇంట్లొ ఉండె పసిబిడ్డల్లా చూస్కోవాలి. రోజూ కనీసం ముగ్గురు పాకేటోళ్లని పొగడాలి.
- మీరు ఎదైనా కొత్తవిషయం మీద రాయాలి అనుకొంటే ముందుగా పా.బా.సం. దగ్గర చూపించాలి. ఇదిమేము రాయలేము అనుకోంటే అప్పుడు మీ ఇష్టం.
- సినిమాలమీద ఎదైనా రాస్కోండి కాని అవి ఏమిస్సమ్మొ, గుండమ్మకథో ఐతే పర్లేదు. కొత్తసినిమాల మీద పూర్తిహక్కులు మావే. మద్యలొ వచ్చిన సోభన్‌బాబు, కృష్ణలైతే ఒకసారి చూసిచెప్తాం.
- క్రీడలగురించి మీఇష్టం. ఐతె మీరు సీ.కే.నాయుడు, ధ్యాన్‌చంద్, పటౌడీ గురించి ఐతే సరే. టీ20, ఐ.పీ.ఎల్ పూర్తిగా మావే.
- ఆడసీనియర్లు మీ స్త్రీవాద బ్లాగుల్లో మాగురించి గొప్పగా రాయాలి. (అప్పుడే కొత్తగా వచ్చే ఆడబ్లాగర్లు మాబ్లాగులు చూస్తారు.) అలాగే అప్పుడప్పుడూ బ్రహ్మచారులు ఒండుకోగల్గిన కూరల్ని గురించి రాయాలి.
ఇంకా మా పా.బా.సంలో ఆడబ్లాగర్లు చేరలేదు. వాళ్లు చేరిన తరువాత, సినీనటి రోజాకుగాని, రావులమ్మకు గాని అభిమాని కాదు అని నిర్ణయించుకొంటే(ఎందుకంటే ఇది తెలుగు బ్లాగర్లకు మత్రమె. వాళ్లువస్తే సంస్కృతం పెరుగుతుంది.) ఆడసీనియర్లకు నిబంధనలు చెప్తాం.
ఇప్పుడు కూడలికికొన్ని మార్గదర్శకాలు.
- కూడలి హోంపేజిపై మాకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. అది కష్టం అనుకొంటె మామూలు వరుసలోనే ఉంచి మా టపాలనెత్తిపై కొత్తది అని మెరుస్తూ(యు.పి.ఎస్.సి. వెబ్‌సైట్లొల) కనిపించాలి. కనీసం 50 మంది చూసేదాకా పట్టీనుంచి తీయకూడదు.
- మాకు కామెంట్లురాయని సీనియర్లపై క్రమశిక్షణాచర్యలు తీస్కోవాలి.
- మా ధృవీకరణ లేకుండ మీరు సీనియర్ల టపాలు చూపించకూడదు.
ఇంతలో మా సెగట్రీ వచ్చి "మరీ అంత కఠినంగా చెప్పొద్దు అన్నా. రేపోమాపో మనమూ సీనియర్లమి అవుతాం." అన్నాడు. "అప్పుడు రాజ్యాంగసవరణ తెచ్చి ఈసదుపాయాల్ని సీనీయర్లకు మార్చొచ్చులేరా యెదవా. మరీ అవసరం ఐతే అప్పుడు సీనియర్లకు వీటో అధికారం కల్పించుకొందాం." అని చెప్పా.
దూరంగా కాగడాలు. బోయీలు పల్లకీలని మోసుకుంటూ వస్తున్నారు. అందులో అల్లసాని పెద్దన, శ్రీనాధుడు లాంటి గెటప్పులో సీనియర్లు. దెబ్బకి మా నాప్కీన్లు తడిసిపోయాయి.
ధగ్గునలేచి చూస్కుంటే రూంలో పడకపై ఉన్నాను. అంతా కల. అప్పుడే అబ్రకదబ్ర 'గడియారం' గుర్తొచ్చింది. ఏమో కలనిజం అవుతుందేమో అని ఆశగా లాప్‌టాప్ తెరిచాను. ప్చ్చ్. ఆ కూడలిలొ పెట్టిన టపా ఎప్పటిలాగే జర్రున జారుకుంటూ వెళ్లిపోయింది. సర్లే వాతలు చూద్దాం ఎవడైనా పెట్టాడేమోనని. ఒకరిద్దరు పెట్టారు గాని జిందాబాద్ అనలేదు. నెమ్మదిగా కూడలిలో ఎరుపురంగు పోయింది. కొంచంసేపు శాంతంగ ఆలోచిస్తే అనిపించింది "నిజమేమనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ పార్టీలుపెట్టి ఎమైనా చెయ్యొచ్చుగాని సంఘాలు పెడితే సుద్దదండగ." బ్లాగులు తెరిచిచూస్తే మాకు సీనియర్లనుంచి కొన్ని ప్రశంసలు, సలహాలు. మరదే మనమంటే. కొత్తతరానికి చేయూతనివ్వడం మన రక్తంలోనే ఉంది. దీనికి ఏ విప్లవాలు, సమరాలు అవసరంలేదు.
అర్థం కావడానికి అరగంట పట్టింది...
ReplyDeleteఅర్థం అయినాక నవ్వు ఆగనంటుంది...
you're good!
ReplyDeleteమరీ వంద టపాలకే సీనియారిటీ ఇచ్చేయడం ఏమీ బాలేదు.. ఈసారి కలగన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేయండేం.. బాగుంది టపా...
ReplyDeleteSimply superb!!
ReplyDeleteBTW, I need your jelp in setting up one Telugu Blog. I have installed Baraha also. It will be good if you can help me out. My mail id is:"meet.the.ganesh@gmail.com". Pl. send me an e-mail so that we can take it off line.
Simply superb !!
ReplyDeleteBTW, I need your help in setting up a blog in Telugu. Initially, I am so much excited about setting this up, but after seeing reservations, cast related posts etc..; My interest got lost. However after seeing your posts my interest is growing up. My mail id is :"meet.the.ganesh@gmail.com". Please send me out details.
బ్లాగులు, తెలుగుకు సంబంధించి ఎటువంటి సమస్య, సలహాలకైనా బ్లాగర్ల గుంపు ఉందిగా.. అక్కడ అడగండి. ఎవరో ఒకరు సహాయం చేస్తారు..
ReplyDeleteఅడగంది అమ్మైనా పెట్టదు..
@srujana :ధన్యవాదాలు
ReplyDelete@కొత్త పాళీ :ధన్యవాదాలు
@మురళి :ధన్యవాదాలు
@జ్యోతి :ధన్యవాదాలు
srujanagAru cheppindE nEnu..:))
ReplyDelete"నిజమేమనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ పార్టీలుపెట్టి ఎమైనా చెయ్యొచ్చుగాని సంఘాలు పెడితే సుద్దదండగ."
ReplyDelete:):)
బ్లాగులు తెరిచిచూస్తే మాకు సీనియర్లనుంచి కొన్ని ప్రశంసలు, సలహాలు.
సూసావా!! సూసావా చిన్నోడా...పెద్దలంటే అంతే.