యజుర్వేదంలో చెప్పబడిన ప్రకారం:
ఆకాశాత్పతితంతోయం యధాగచ్ఛతి సాగరం
సర్వదేవనమస్కారహ కేశవం ప్రతిగచ్చతి
దీనిభావం: అకాశమ్నుంచి వర్షించే ప్రతినీటిచుక్క ఎలాగైతే వివిధమార్గాలగుండా ప్రయాణించి చివరికి సాగరాన్ని చేరుతుందో మనం ఏరూపాన్ని ధ్యానంచేస్తూ నమస్కరించినా అది ఆకేశవునికే చెందుతుంది.
భూమిపైన వర్షించేనీరు మేఘాలు సాగరానమునుంచి స్వీకరిస్తుంది. ఆనీటిలో కొంతభాగం నదుల ఉపరితలంలో ప్రవహిస్తే, మరికొంతభాగం అంతర్వాహినిగా తనగమనాన్ని కొనసాగిస్తుంది. ఇంకొంతభాగం భూగర్భంలో నిలువ ఉన్నప్పటికీ ఆస్థితి శాశ్వతంకాదు. కొంతకాలానికి నెమ్మదిగా భూగర్భంగుండా సాగరాన్ని చేరుకోవలసిందే. ఉపరితలంలో ఉన్ననీటిలో కొంతభాగం ఆవిరైనప్పటికీ అది తిరిగి ద్రవీభవించి కిందైనా పడాలి లేదా మేఘాలలో ఐనా కలవాలి. అంటే భూమిపై ఆవరించి ఉన్న వాతావరణాన్ని ఒక వ్యవస్థ పరిగణిస్తే అందులో ఉన్న నీటిపరిమాణం స్థిరం.
ద్రవ్యనిత్యత్వ నియమము:
ఒకవ్యవస్థలోని ద్రవ్యరాశి, అందులో చోటుచేసుకొనే చర్యలతో నిమిత్తంలేకుండా, స్థిరము. దానిని ఒకస్థానమునుంచి మరొకస్థానికి, ఒకరూపమునుంచి మరొకరూపానికి మార్చగలమే కానీ నాశనంచేయటంకానీ సృష్టించటంకానీ చెయ్యలేము. కానీ ఈనియమాన్ని నిర్వచించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా సాపేక్షసిద్ధాంతంపై, క్వాంటంసిద్ధాంతంపై పరిశొధనచేసేవారు, వ్యతిరేకించారు. ద్రవ్యరాశి -పదార్ధం మద్య కొంత సంఘర్షణ చోటుచేసుకొంది. ఎలక్ట్రాన్ వంటి భారరహిత పదార్ధాలు వ్యవస్థకు శక్తితోపాటు కొంత ద్రవ్యరాశిని కూడ అందజేస్తాయి అన్నది వీళ్లవాదన. ఈవివాదానికి కారణం వాళ్లు ద్రవ్య్రాశిని శక్తిని విడివిడిగా, పరస్పరం ఎలాంటి సంబంధంలేని రాశులుగా పరిగణించారు.
ఈసమస్యను పైన చెప్పిన శ్లోకంలోని రెండవ వాక్యం పూర్తిచేస్తుంది. అంటే నమస్కారం అనేది శక్తికి ప్రతిరూపంగా భావించి, ద్రవ్యరాశితోపాటుగా శక్తికిగల సంబంధాన్ని వివరించారు.
Very good analogy. Please do post more.
ReplyDeleteచాలా బాగా వివరించారు. నిన్న కూడా ఇలాంటిదే ఒక పోస్టు వేశారు. అయితే వీటిని మీరు ఇలా కాకుండా ఒక సపరేటు బ్లాగు ఓపెన్ చేసి అందులో కేవలం ఇటువంటి విషయాలనే అంటే సనాతన ధర్మం-సైన్సుకు సంబంధించిన విషయాలనే ఉంచండి.
ReplyDeleteYo man yo .. Whataru talking ..chill up.. could not understand anything .. yo yo..
ReplyDelete@ అజ్ఞాత: ధన్యవాదాలు. పేరురాస్తే సంతోషిస్తాం.
ReplyDelete@ నాగప్రసాద్: విడిగా బ్లాగు అంటే కష్టం నాగ. ఆవిషయాలపై రోజూ ఎంతోకొంత సేకరించాలి. మనం ఇప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో ఈవిషయాలపై పూర్తిగా అధ్యయనం చెయ్యలేం కదా. నాకు తెలిసిన కొన్ని మాత్రం టపావేస్తాను.
@సాన్: ఒరెయ్ శనిగా నిన్నుసూడమంది ఇదికాదహే. ఎనకమాల పాతపోస్టుల్లో నీకు నచ్చే సరుకుంది. అదిసూస్కోమంటే ఇక్కడికొచ్చావ్.
సైతన్య గారూ
ReplyDeleteమహబాగా సెప్పారు.
>>ఒరెయ్ శనిగా నిన్నుసూడమంది ఇదికాదహే
??
vAmmO mI dhaggara chaalaa samaachaaraM uMdhi...
ReplyDelete@ భాస్కర్ రామరాజు: అన్నా నమస్తే. ఉదయం నుంచి నీగురించే. నేనే నీ బాబయ్యలోకి వద్దాం అనుకొన్నా. నువ్వే నాకాడికి వచ్చావ్. ఆ శనిగాడు నా ఫ్రెండేలే. ఎంసేత్తున్నవ్ రా ఒక్కడివే అంటే ఈడసూస్కో శానా ఇషయాలుంటాయ్ అన్నా. కొంచెం చమత్కారాలు ఎక్కువలే నాయాల్కి. ఇసుమోటివి పడవ్.
ReplyDelete@ వికాసం: ధన్యవాదములు.
Dude, simply superb!! You have vast knowledge. Please do keep posting. But as nagaprasad said, post them with a separate label.
ReplyDeleteNice one :) I'l give my interpretation
ReplyDeleteఎదురుచూస్తుంటా
ReplyDelete