చెల్లెలి స్నేహం- అమ్మమ్మ నొప్పులు

మా ఇంట్లోంచి కెవ్వుమని కేక వినిపిస్తే పక్కింటోళ్లు కారణమేందో ఊహించడానికి పెద్దసమయం తీసుకోరు. తొంభైశాతం దానికి కారణం మాచెల్లి ఏపామునో తేలునో చూసుంటుంది. అదేంటోగాని పాకేజంతువులేవైనా తనని వెతుక్కొంటూ వచ్చేవి. నల్లకీచో తేలో కనీసం నెలకొకసారైనా పలకరించకపోతే మనకి వారంరోజులు కూడలిపక్క రాకపోతే ఎంత బాధపడుతామో అంతకంటే ఎక్కువ విలపిస్తాయి. పరుపుమడతల్లొనో, రోలువెనకాలో, టాయిలెట్లలోనొ హెల్లొ అనకపోతే దిగులుపడేవి. అదేంటొ మాకు ఎవ్వరికీ కనిపించమన్నా కనిపించవు.
ఒకసారి అమ్మ ఇంట్లోంచి సందులోకి వెళ్తుంటే వెనకాలే వెళ్లింది. ఉన్నట్టుండి కెవ్వ్.అమ్మకు కనిపించలేదు గానీ ఇదిమాత్రం తోకను చూసేసింది. ఈమద్యే పెల్లైంది. అత్తారింటికివెళ్లిన వారానికి అడ్రస్ వెతుక్కొంటూ వచ్చేసింది ఒకపిల్లపాము. వాళ్లకి కొత్తకదా పాపం బాగ గాబరాపడ్డారు. వెంటనే వాళ్లమామగారు "అమ్మాయీ ప్రతినెలా కాలాస్త్రికివెళ్లి పూజచెస్కొనిరా " అన్నాడు. ఇలా ఎందుకో కొంతమందిపై వాటికి అలా ప్రేమ- అభిమానం- ఆప్యాయత తన్నుకొస్తుంటాయి. ఈమద్య ఇక్కడ వర్షాలు మొదలయ్యాయి. తొలకర్లు పడేప్పుడు కలుగులో ఉక్కపోత భరించలేక బయటకి వస్తుంటాయి. ఇక్కడ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. రెగ్యులర్గా వాకింగ్ చేసే పాములు, షాపింగ్ చేసే పాముల్ని చూస్తున్నా ఇక్కడ. మూడురోజులుగా ఒకపిల్లపాము మాదగ్గరికి సాయంత్రం 7పైన వస్తుంది. పచ్చ పచ్చగా దానిపై ముక్కుపొడిరంగు టాటూలు వేస్కొని భలేముద్దొస్తోంది బుజ్జిముండ. మా వివేక్‌గాడు దానికి 'చింటూ' అనిపేరుకూడా పెట్టేశాడు.

మా అమ్మమ్మ గురించి రాయాలి అంటే నేనువేరే బ్లాగు తెరిచి రోజుకో టపారాసినా రామానందసాగర్ సీరియళ్లలా సంవత్సరాల తరబడి సాగుతుంది. దాదాపు 8వతరగతి వరకు అమ్మమ్మదగ్గరే ఉన్నాను. చిన్నప్పటినుంచి తాతదగ్గరే చదువుకొన్నాను కాబట్టి తాతబడి-అమ్మమ్మ ఇళ్లు. నేను పుట్టకముందు ఆమెకి ఆరోగ్యంబాలేక చాలాకాలం అవస్థలు పడింది. తరువాత కోలుకొంది. అంతాబానే ఉంటుందికానీ మందులుమింగేది కాదు. "డాక్టరు వేస్కోమన్నాడు" అని తాత అంటే "వాడా ఆవెధవ హస్తవాసి మంచిదికాదు. నాకు ఎమిబాలేదో వాడిమొహం వాడికేమి తెలుసు." అనేది. ఎక్కువ వాదిస్తే "అసలువాడు నిజం డాక్టరుకాదు. వాడు దొంగసర్టిఫికేట్లతో వైద్యం చేస్తున్నాడు. ఏదో ఒకరోజు పోలీసులు వాడిని కటకటాల్లో(చిన్నప్పుడు ఈపదం నాకు అర్ధం అయ్యేదికాదు.) తోస్తారు" అని శపించేది. తరువాత కొంతకాలానికి మాఊరికి ప్రసన్నకుమార్ (ఈనకి 6వేళ్లు ఉండేవి ఒకచేతికి. ఆరేళ్లడాక్టరు అనిపిలిచేవాళ్లు. కొంతకాలానికి ఆర్.ఎల్ డాక్టరుగా మారిపోయింది.) అనే ఆయన వచ్చాడు. మాఊరి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి కావటంతో ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించారు మాఊరికి. ఇప్పుడు నింస్‌లో ఉన్నారు. ఇక ఆమెకి మందులు వేసుకోక తప్పేదికాదు. కొంతకాలానికి మందులషాపు మీద మొదలుఎట్టింది. "డాక్టరు మంచిమందులు రాస్తున్నాడు గాని వాడు వేరేమందులు ఇస్తున్నాడు. అవినకిలీవి. ఆడాక్టరు చేతిరాత అర్ధంకాదు వీడు ఇచ్చేవి నిజం మందులో కాదో చూద్దామంటె. కాబట్టి నేనువేస్కోను." మందులువేస్కుంటుందోలేదో చూస్తారని వాటిని ఎక్కడోదాచిపెట్టి వేస్కున్నానేది.
ఇంతజరుగుతున్నా ఒకటి మాత్రం ఒక్కరోజు మిస్సైనా ఒప్పుకోదు. ప్రతిరోజూ ఊరిప్రజలు ఆమె ఆరోగ్యంగురించి కొంచెంసేపు మాట్లడి అయ్యో సుశీలమ్మా నీకుకాకపోతే ఇన్నిబాధలు. ఎలాభరిస్తున్నావమ్మా అంటూ ఆదరించి పోవాలి. ఎవడైనా కొంతకాలం రాలేదంటే తరువాత చిక్కినప్పుడు అయిపోయాడే. నేను ఎప్పుడైనా ఆమెదగ్గరికి వెళ్లి మాట్లాడకపోతే అమ్మ దగ్గర "వాడిని నేను ఎలా చూసుకొన్నాను. ఎలా సాకాను. ఇదానాకు మిగిలింది." అంటూ పాపం అమ్మ బుక్కైపోయేది.
ఇంతమందిలో చెంచయ్య అనే వ్యక్తి ఉండేవాడూ. " అమ్మా! ఈఊరినిండా ఇంత మంది ముదనష్టపు ముండాకొడుకులు ఉంటె ఆదిక్కుమాలిన జబ్బులు నీకేరావాలా. అన్నపూర్ణమ్మ తల్లిలాంటివి నీకేందమ్మా ఇన్ని కష్టాలు. అయ్యో! ఇంకెందుకు నేపోతా. కొంచేం నెయ్యి ఉంటే పెట్టుతల్లీ." ఈమెదగ్గర్నించి అలాంటివి వసూలుచేస్కోవటం ఎంతకష్టమో అందరికీ తెలుసు. అప్పటిదాకా పరవసించి వింటున్నామెకాస్తా అటుతిరిగి ఏదొ పనిచేస్తున్నట్టు నటించేది. "అమ్మగారి మనసు నాకు తెలుసు. ఆచేతితో ఎంతమంది అన్నదానం చేసిందో నేనెలా మర్చిపోగలనూ...." ఇలా మొత్తానికి నెయ్యితో మొదలుపెట్టి పచ్చడి, సాంబారు అలా అలా గిన్నెనింపుకు వెళ్లేవాడూ. నాకు తెలిసి మా అమ్మమ్మదగ్గర తీసుకెళ్లేసత్తా ఇతనికి ఒక్కడికే ఉంది. పాపం మాట్లాడుతూనే మారామమందిరం వాకిట్లోనే చనిపోయాడు. ఈవిషయం ఇక్కడ టపా పెట్టానని తెలిస్తే ఇంట్లోవాళ్ళు ఎగరేసి ఎగరేసి తంతారు.

8 comments:

  1. chalabagundi mana nellore yasalo,simly sooper

    ReplyDelete
  2. >>మనకి వారంరూజులు
    Typo.

    >> "అమ్మాయీ ప్రతినెలా కాలాస్త్రికివెళ్లి పూజచెస్కొనిరా "
    Not Kalasthri. It is Kalahasthi.

    >>ఈవిషయం ఇక్కడ తపాపెట్టాను
    Tapa.

    Seems that your quillpad has some issues. :)

    ReplyDelete
  3. మా బామ్మేదో స్పెషలు మనిషనుకుంటున్నా ఇన్నాళ్ళూ.. కాదని నిరూపించేశారు.. ఒకటే తేడా.. అలా ఎవరైనా ఆప్యాయంగా పలకరించి ఏమైనా అడిగితే, ఈవిడ ఇంట్లో వాళ్లకి మానేసి అయినా పెట్టేసేది.. ఓపిక ఉంటే రామానంద సాగర్ సీరియల్ రాసేయండి.. చదవడానికి మేము సిద్ధం..

    ReplyDelete
  4. @అజ్ఞాత: మీరూ నెల్లూరేనా. పేరురాసుంటే బావుండేదికదా.
    @గణేష్: మొదటిది, మూడోది సరిచేశా. కాపీచేసేప్పుడు తప్పుపడిందనుకొంటా. ఇక మద్యలోది నేనురాసింది కరెక్తే. నీకుతెలీదనుకొంటా కాళహస్తి అని మీరూంటారు. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అలానే పిలుస్తారు. నీకుతెలీదనుకొంటా.
    @మురళి: మా అమ్మమ్మ కూడా అడిగినవాళ్లకి పెడుతుంది కానీ ఇలా సోపు వేసేవాళ్లని దూరం పెడూతుంది. అంత వీజీగా దొరకదు.

    ReplyDelete
  5. బాగున్నాయి మీ అమ్మమ్మగారి ముచ్చట్లు. మా నాయనమ్మ కూడా ఇంతే. కాకపోతే ఆవిడకు ప్రాణానికి ప్రమాదం లేకుండా జనమందరూ అయ్యో! నీకెంతకష్టమొచ్చిందమ్మా అని సానుభూతి చూపే జబ్బు రావాలని వచ్చిందని చాలా తీవ్రంగా నమ్మిచడానికి ట్రై చేసేది.

    ReplyDelete
  6. మా మామ్మగారి లాగే ఉన్నారు మీ అమ్మమ్మగారు కూడా.పెద్దవాళ్ళంతా అంతే నేమో అసలు.
    బాగున్నాయి కబుర్లు.ముందరే చదివినా వ్యాఖ్య రాయటం ఆలస్యమైంది.. మీ అమ్మమ్మగారి కబుర్లు ఇంకా ఉంటే రాయి చైతన్యా.

    ReplyDelete
  7. ఇది చదివితే నాకు ప్రతి ఆదివారం సాక్షి అనుబంధంలో వచ్చే 'మా తిరపతి కొండ కధలు' గుర్తుకొచ్చింది. :)మొదట్లో ఆ రచనలపై ఎవరీ కొత్తపూజారి అని అనుమానప్పడినా రాను రాను అవి బాగానే అలవాటయ్యాయి.

    మీరు కూడా బ్లాగుల్లో ఒక మాల్గుడి డేస్ సృష్టించటానికి ప్రయత్నించరాధూ?

    ReplyDelete
  8. hi iam himaja
    nannama gurinchi inka pettu bagundhi
    amey use chese words pettu

    ReplyDelete