నేను ఈ కంపెనీలో చేరకముందు ఏన్.ఐ.టీ. త్రిచిలో ఏం.టెక్. చేశాను. దాదాపు అన్ని ఐ.ఐ.టీ., ఏన్.ఐ.టీ.ల్లానే మాకాంపస్‌లో కూడా తెలుగువాళ్లం ఎక్కువ. ఎంత అంటే కొన్ని స్పెషలైజేషన్‌లలో 16మందిలో 12-13మంది మనవాళ్లే ఉండే వాళ్లం. మొదటి సంవత్సరం అందరం ఒకే హాస్టల్, బెరిల్ అని, రూంకి ఇద్దరు షేర్‌చేసుకొంటారు . ఆకాంపస్‌లో హాస్టళ్లపేర్లు అన్నీ నవరత్నాలు అన్నమాట, అంటే డైమండ్, జేడ్, అలా అన్నమాట. రెండొసంవత్సరం బ్రాంచిలనుబట్టి హొస్టళ్లు ఉంటాయి, కానీ సింగిల్‌రూంలు. మేము సఫైర్ అంటే నీలమణిలో ఉన్నాం. ఐతే పేరుకే సింగిల్‌రూంలు కానీ అందరం ఎప్పుడూ ఎదో ఒకరూంలోనే ఉండేవాళ్లం, మామూలేకదా. విభాగాడి రూంలో సిస్టం ఉందికాబట్టి అందరికీ అదే కామన్‌రూం.
తమిళనాడు వాతావరణం గురించి చెప్పనక్ఖర్లేదు అనుకొంటా. అక్కడ ఋతుచక్రం అంటూ ఎమీ ఉండదు. ఆచక్రం మద్యలో ఇరుసు ఇరుక్కుపోయి ఎప్పుడో చాలా శతాబ్ధాల క్రితం ఆగిపోయింది. మన ఖర్మకొద్దీ ఆగినప్పుడు అది గ్రీష్మఋతువు. "పాపం అరవోడు" అనుకొంటా అప్పుడప్పుడు. నాకు మా ఇంట్లో నవంబరు వరకు వాకిట్లోనే టేబుల్‌ఫాన్ పెట్టుకొని నిద్రపోవటం అలవాటు. అలాంటిది అక్కడ మిద్దెపైకివెళ్లి పడుకొందాం అనుకొన్నా ఎప్పుడూ వాయిదాపడేది. మొదటి సంవత్సరంలో హాస్టల్ వార్డన్ని అడిగితె "వాండాసామీ. కంట్రొల్ సెయ్యడం రొంబాకష్టం." అని అప్పుడె సాంబరు తాగాడు అనుకొంటా త్రేపుకొంటూ రూంలోకి వెళ్లిపోయాడు.
రెండొ సంవత్సరంలో మెట్లు పైకి వెళ్లిచూశా. ద్వారములు తెరిచియే ఉన్నవి. కాదుకాదు అసలు ద్వారములు లేనేలేవు. పైకివెళ్లి చూసి అహా! ఎమినా భాగ్యము అని అనుకొంటే మిగతా వాళ్లు కదిలితే కదా. అందరూ ఇళ్లదగ్గర మిద్దెపైకి వెళ్లేవాళ్లే. యెదవలు నా ప్రాణనికి ఎక్కడ దొరికారురా అనుకొంటూ నేను ఒక్కడినే వెళ్లి పడుకొన్నా. ఇంతలో ఒక పెద్దగుడ్లగూబ నాకు ఎదురుగా ఉంది. మొదటిసారి దాన్ని అంతదగ్గరగా చూడడం. దాదాపు నా మోకాలు ఎత్తుంది. దాన్ని చూసి గుండె హడల్. అసలుదాన్ని ఎప్పుడు చూశానో ఎంతసేపు చూశానో కూడా గుర్తులేదు. దాని ఆకారం మెదడులోకి సంకేతాలు వెళ్లిన తరువాత తేరుకొని చూస్తే నారూంలో పడుకొని ఉన్నా. అంటే దాన్ని చూసిన వెంటనే అసంకల్పిత ప్రతీకారచర్య అని అంటారు తెలుసా అలాంటిది జరిగింది అన్నమాట. ఆప్రతయ్నాన్ని విరమించుకొని ఇక నారాత ఇంతే అనుకొని కిందే సెటిల్ అయిపోయా.
కొన్ని నెలలకి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. పార్టీలు చేసుకొనేందుకు అదేమంచి స్పాట్ అయింది. అప్పుడె నాబుర్రలో ఒకస్పార్క్ వచ్చింది. ఎలాగు నాకు మందు, మాంసం రాతలేదు కాబట్టి నాకు తెచ్చే పనీరో, మంచూరియనో గబగబా లాగించేసి నాపడకను అక్కడకే తెచ్చి వేసుకొన్నా. అదేంటి బావా అన్నారు మావాళ్లు. ఇకనుంచి నా పడక ఇక్కడే అని ప్రకటించేసరికి వాళ్లు ముందు మందుపని పడదాం తరువాత అలోచిద్దాం అనుకొన్నారు. నాకోటా ఒక కూల్డ్రింక్ ఇచ్చేసారు. వాళ్లు కూర్చుని బీర్ వేస్తుంటే నేను విష్ణుమూర్తి పోజులో స్ప్రైట్. అలా మొత్తానికి అందరినీ డాబామీదకి తెచ్చేశా.ఇక ఫిబ్రవరినుంచి దాదాపు జూన్ మద్యవరకు ఎంతహాయిగా గడిచిపోయింది అంటే అస్సలు ప్రాజెక్ట్ గురించిగానీ మరేటెన్షన్‌గానీ వచ్చేదికాదు మనసులోకి.
ఇక్కడ మాగుంపుసభ్యులు ఎవరు అంటే నేను, విభాగాడు, ప్రాజెక్ట్ పవన్, సిగరెట్ సురేష్, మధుభాయ్, అరవింద్ ( వీడు ఎం.బీ.ఏ. ఐనా మతో ఉంటాడు. చిన్న ప్రాబ్లెం ఏమిటంటే వీళ్లు బేసిగ్గా తమిళియన్ అయ్యరు. తరువాత కర్ణాటకలో సెటిల్ అయ్యి, అనంతపుర్ మీదుగా హైదరాబద్ వచ్చేశారు. అప్పుడప్పుడు వాడు ఏభాషలో మాట్లాడాలొ కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటాడు.ఇక ఐ.పీ.ఎల్ అప్పుడు ఐతే ఏ టీంకి చప్పట్లుకొట్టాలో అర్ధంకాలేదు. వీదికి క్లారిటీ వచ్చేప్పటికి అదికూడా ఐపోయింది.) ఇంకో అరవింద్ ఉన్నాడు. వీడిది కర్ణాటక. అయినా తెలుగుబాగా వచ్చు. ఇక పక్కహాస్టళ్లనుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితుడు మునికుమార్. వీడిదికూడా కర్ణాటాక, కానీ ఆంధ్రనుంచి వలస వెళ్లిపోయారు. చివర్లో ఒక డేంజర్ అపాయం. పేరు జనార్ధన్. వీడువస్తే అందరం నిద్రపోతాం అది డిఫాల్ట్. మా దుప్పట్లకు ప్రోగ్రాం అలా సెట్‌చేశాం.
ఇలా హాయిగా (అంటే జనార్ధన్ రానప్పుడు) రోజులు గడిచిపోతున్నాయి. చిరంజీవికొత్త పార్టీపెట్టినా, బాలకృష్ణ సినిమా వచ్చినా, కే.సీ.ఆర్. రాజీనామాచేసినా, కరుణానిధి కళ్లజోడు మార్చినా, జయలలిత డైటింగ్ చేస్తునా అన్ని విషయాలు అక్కడే. అందులో స్టైపెండ్ వచ్చిన వారంలో డిస్కషన్లు ఉధృతంగా సాగేవి. ఎవడైనా ఆరోజు గైడ్ తిడితె అక్కడికి వచ్చి మాదగ్గర గోడు వెళ్లబోసుకొనేవారు. ఎదవలు అప్పుడుకూడా వాళ్లకి మావాళ్లే మందుపోయాలి పాపం.
ఒకరోజు మాకు మాట్లాడేందుకు ఏవిషయం దొరకలేదు. అందరూ పడుకొన్నారు కానీ నిద్రరావట్లేదు. నేను చెవులో ఇయర్ఫోన్ పెట్టుకొంటున్నా పాటలు విందామని సెట్ చేసుకుంటున్నా. ఇంతలో పవన్‌గాడికి ఒక డౌట్ వచ్చింది. "బావా! చచ్చిపోయినోళ్లు పైన చుక్కలు అవుతారా?" అని. అవుతారేమోరా నాకు పెద్దగా ఐడియాలేదు అని చెప్పా. వెంటనే మునిగాడు "బావా! ఆపైన ఒకటిబాగా మెరుస్తుందే అది మా అవ్వ." అని ఒక పెద్దచుక్కని చూపెట్టాడు. ఒక్కసారిగా అందరికీ నిద్రమత్తు వదిలింది. ఆచుక్కను చూడడం గట్టిగా నవ్వుకోవడం. ఇలా ఒక అరగంట సాగింది. తరువాతరోజు రెండు పెద్దచుక్కలు పక్కపక్కనే ఉన్నాయి. వెంటనే పవన్‌గాడు "బావ! మునిగాడి తాతకూడ చుక్కల్లో కలిసిపోయాడు. వాళ్లవ్వ పక్కకి వెళ్లిపోయాడు." అని అన్నాడు. అందరం నవ్వుతూ ఉన్నాం గానీ వీడుమాత్రం ఏదో అలోచిస్తూ ఉన్నాడు. కొంచెం సేపటితర్వాత "బావా! మాతాత ఇంకా బతికే ఉన్నాడు" అంటూనే ఆరెండోచుక్కకేసి సీరియస్‌గా చూస్తున్నాడు. అప్పుడు వాడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నాకు ఇంకాగుర్తే. ఇలాంటివి చాలా జరిగాయి. గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కటి రాస్తుంటా.
హ హ హ. :)
ReplyDeleteమాకు B.Tech లో ఇటువంటి సరదాలు, డిస్కషన్లూ, వాదనలూ ఉండేవి.
M.Tech కోసం ఐ.ఐ.టి.మద్రాసులో చేరాక, కొంచెం తగ్గాయి. ఏం చేద్దాం, ఇక్కడ ఎవడి రూమ్ వాడిది, ఎవడి కంప్యూటర్ వాడిది, మళ్ళీ దానికో ఇంటర్నెట్ కనెక్షనూ.
మా కాలేజీలో కూడా కొన్ని స్పెషలైజేషన్‌లలో 20 మందిలో 16 మంది తెలుగువాళ్ళే ఉంటారు.
మా కాలేజీలో జరిగే "సారంగ్" Choreo nite లో NIT Trichi వాళ్ళు చేసే Choreo బాగుంటుంది.
అన్నట్టు, చివర్లో మరో చుక్క రావటం బాగుంది. :). నువ్వు వస్తానంటే నేనొద్దంటానా... సినిమాలో కూడా ఇలా చుక్కల బాగోతం ఉంటుంది.
బాసూ, ఏ బాచ్? శేషు మాధవ్(నెల్లూరే, NITT 2004-06 బాచ్) తెలుసా మీకు?
ReplyDeleteBy the way మొదటి చుక్కకే నాకు మతిపోయింది, రెండో చుక్క కేక.
:-)
-యువ
ఇందుగలడందులేడన్నట్లు ప్రపంచంలో ఏ కాలేజీలో చూసినా తెలుగు విద్యార్థే.
ReplyDeleteనాగప్రసాద్: ధన్యవాదాలు. మీరు అక్కడ ఏసంవత్సరం చెశారు. బ్రాంచ్ ఏది? మా కాంపస్‌లో రూంకి నెట్‌లేదు. అందరం సి.సికి పోవాలి. నేను సారంగ్ చూద్దామన్నా కుదర్లేదు. అంతరాగ్నిమాత్రం వెళ్లాను కాన్‌పూర్‌లో.ధన్యవాదాలు
ReplyDeleteఅజ్ఞాతగారు: నేను 2006-08 బాచ్ అండీ. అతను ఇంజెనీరింగ్ ఎక్కడచేశాడూ? విద్యానగరా?
చిలమకూరు విజయమోహన్: ఒకసత్యం. ధన్యవాదాలు
సుబ్రహ్మణ్య ఛైతన్య గారు, నాది కూడా 2006-08 బ్యాచేనండి. నా బ్రాంచు మెకానికల్ ఇంజనీరింగ్. M.Tech లో specialization Manufacturing.
ReplyDeleteమీది ఏ ఊరు. ఇంజినీరింగ్ ఎక్కడ చెశారు? మా బాచ్‌లో దాదాపు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. అందుకని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చుగా
ReplyDeleteనేను B.Tech J.N.T.U.Anantapur లో చేశాను. నాకు తెలిసి మా కాలేజీ నుంచి 2006 బ్యాచ్‌లో NIT త్రిచిలో ఎవరూ లేరనుకుంటా.
ReplyDeleteమీ సీనియర్లు హరికృష్ణ, కెమికల్ రాకేష్ గుర్తున్నారా? వాళ్లు నాకు చాలామంచి ఫ్రెండ్స్. నా పక్క రూం మొదటి సంవత్సరంలో.
ReplyDeleteఊహు..గుర్తు రావడం లేదు. B.Tech లో నాకు మా సీనియర్లతో పెద్దగా పరిచయం లేదు. పక్క బ్రాంచు వాళ్ళైతే అస్సలు లేదు. నాదంతా సపరేటు లోకం.
ReplyDeleteనాగప్రసాద్ :నదీం తెలుసా. మా జూనియర్‌గా వచ్చాడు. 2006 బాచ్ అనుకొంటా.
ReplyDeletebagundhi
ReplyDeleteసుబ్రహ్మణ్య చైతన్య గారు, నా ప్రపంచం చాలా చిన్నది మరియు విశాలమైనది. :) ఒకరో ఇద్దరో తప్ప, నాకు మా జూనియర్లు కూడా తెలియదు. :(
ReplyDeleteబాగుంది చైతన్య గారు చుక్కల కథ.. 'ఒకరికి ఒకరు' సినిమా లో కూడా ఈ చుక్కల గొడవ ఉంటుంది. అన్నట్టు 'నెమలికన్ను' కి పునస్స్వాగతం.. అంగుళీయకము అవసరం లేదు.
ReplyDeletecan u plz wrte in short paras ? very hard to read continously. good story.
ReplyDeleteనాగప్రసాద్ :నా ప్రపంచం విశాలమైనది, కానీ దాని కెపాసిటీమించి పాత్రలు వచ్చేసి ఇరుకైపోయింది. :-)
ReplyDeleteమురళిగారు: అబ్బా ప్రాణంలేచొచ్చింది అండీ
అజ్ఞాత: నేను మొదట రాసేటాప్పుడు అలానే రాశాను. కానీ అక్కాడ అంటించటంలో మారిపోయింది. మార్చాను.
సుక్క(లు) - చుక్క(లు) .... బాగుంటుందేమో title గా ఆలోచించు... ఒక మాట , comparision బాగుంటుందో లేదో తేలీదు కానీ ... గొల్ల పూడి గారి రచనలను తలపిస్తున్నాయి... సుక్కేస్కో sorry చుక్కేస్కో రాజా ......
ReplyDeleteశివన్న: నేను ఇలాంటియాస ముందు ఒకచోట (సింగ్రోలి సినుకులు) వాడాను అన్నా. రొటీన్‌గా ఉంటుందేమో అని ఆపేశా
ReplyDeleteచాలా బాగుంది. నేను ఇన్ని రోజులు ఎందుకు చూదలేదు చెప్మా ఈ బ్లాగు
ReplyDelete