గృహప్రవేశం

పైన పేరుచూసి జయసుధ చక్రాలకుర్చీలో, లెజెండ్ మోహన్‌బాబు దాన్నితోసుకుంటూ "దారిచూపిన దేవతా" అంటూ పాడేస్కోకండి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకవారంక్రితం మా మానవవనరుల విభాగంనుంచి ఒకలేఖ. దానిసారాంశం "వచ్చేనెలలో కొత్తబాచ్ అంటే ఈసంవత్సరంలో చేరినోళ్లు ట్రైనింగ్‌కోసం వస్తున్నారు. ఇప్పటిదాకా మీసేవలో తరించాము. ఇక మీవారసులకి సేవచేస్కొనే అవకాశం ఇవ్వండి. 17వతేదీలోపు ట్రైనీహాస్టలు ఖాళీచేసి క్వార్టర్లలోకి మారిపోండి" అని. ఈరోజువెళ్లి అక్కడ ఖాళీగా ఉండే ఇళ్లుచూస్కొని నచ్చిన నంబర్లను రాసేసి వచ్చాం. పర్లేదు బానే ఉన్నాయి. అన్ని వసతులూ చూస్తూ సరిలేనివి నోట్ చెస్కుంటున్నాం. అదిచూపిస్తే సరిచేసి ఇస్తారు. అలా చూస్తూ ఉన్నట్టుండి అంతా కలియచూశాను. కెవ్వ్..ఇక్కడ నెట్‌సౌకర్యంలేదు. అడిగితే మేము ఇవ్వం. మీరు బీ.ఎస్.ఎన్.ఎల్.కి వెళ్లండి అని సెలవిచ్చాడు. అక్కడవాళ్లని అడిగితే ముందుఫోన్‌కి అర్జీపెట్టండి. తరువాత బ్రాడ్‌బాండ్ అని సెలవిచ్చాడు. కనీసం 20రోజులు పడుతుందని నా అనుమానం. మరి ఇన్నిరోజులు నాచేతి దూల అణుచుకోవటం ఎలా?

10 comments:

 1. ఏముంది.... ఎడమ చేత్తో కుడి చేయి, కుడిచేత్తో ఎడమచేయి గోక్కోండి..
  అంతకీ తగ్గక పోతే జాలింలోషన్ వుండనే వుంది కదండీ!!!

  ReplyDelete
 2. @Padmarpita .. ha ha ha.

  @caitanya .. govt job? wat's with this quarters business?

  ReplyDelete
 3. హ్మ్మ్ ఏంచేద్దాం! తప్పదు.

  ReplyDelete
 4. @పద్మార్పిత: ఇది అలా తీరేదైతే ఇక సమస్య ఏముంటుంది చెప్పండి.
  @కొత్త పాళీ : గవర్నమెంటు కాదుగానీ అలాటిదే. పీ.ఎస్.యు. NTPC
  @ మహేష్: అంతేగా

  ReplyDelete
 5. 'లెజెండ్' మోహన్ బాబు!!
  ...మనసుంటే మార్గం ఉంటుంది... ప్రయత్నించండి..

  ReplyDelete
 6. అరే దీన్కి సోచాయిస్తావేంది సింపుల్....మీ జూనియర్లకి కంపెనీ ఇచ్చే ట్రైనింగు మెటీరియల్ల బ్లాగు పోస్ట్లు కలిపెయ్‌. దూలకి దూల తీర్తది, పేరుకి పేరు వస్తది.

  ReplyDelete
 7. మరీ దురద ఎక్కువైతే...ఉన్నాయి కదా నెట్ సెంటర్లు..మొన్న నాల్గురోజుల అనుభవంతో చెప్తున్నా...అది కుదరకపోతే స్నేహితులకో మెయిలు పడేయ్..నీ పేరొతో పబ్లిష్ చేసేయమని!!

  ReplyDelete
 8. నాబాధను అర్ధంచేస్కొని తోచిన సలహాలు ఇచ్చిన మీకందరికీ పేరుపేరునా మంగిడీలు

  ReplyDelete
 9. ఇంకా బి.యస్.యన్.యల్ఉఉఉ ఫోనూ, అర్జీలూ ఏంటండి ......
  రిలయన్సో లేకపోతే టాటా నో మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడండి...

  ReplyDelete
 10. ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు క్షమించగలరు.
  @ చారి: సూపర్ ఐడియా అండొయ్. కాకపోతే వాళ్లజీవితాలతొ ఎందుకు ఆటలు అని ఆలోచిస్తున్నా.
  @ విశ్వక్శేనుడు: ఇక్కడ కేవలం బీ. ఎస్. ఎన్ ఎల్. మాత్రమే వస్తుంది. వేరేనెట్‌వొర్క్ ఏదీ లేదు.

  ReplyDelete