నిరీక్షణ

ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. రెండుజడలు వేస్కొని ముద్దుగా వెళ్తుంటే నాకోసమే పుట్టింది అని ఫిక్స్ అయిపోయా. భలేముద్దుగా మాట్లాడేది. తనను చూసిన వాళ్లకి కూడా అదే అభిప్రాయం. వాళ్లక్కని కూడా చూశా. ఆమె కూడ చాలా బావుండేది. అదేంటో ఇద్దరూ భలే చలాకీగా ఉండేవాళ్లు. నాకు మాత్రం ఆ అమ్మాయి మాట్లాడినా, పాటపాడినా నాకోసం చేసినట్లే ఉండేది. కొంతకాలానికి ఆరిందలా ముదిమాటలు కొంచం అదనపు వ్యవహారాలు వెయ్యడం మొదలుపెట్టింది. నాకు అస్సలు నచ్చదు ఇలాంటివి. కానీ చూసేవాళ్లు మరీ చనువివ్వటంతో ఇలా తయారయ్యిందిలే అని సర్దుకొన్నా. రానురాను ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి. నాకు బాగా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఎమి చేస్తాం వాళ్ల అమ్మానాన్నలు కూడ అలా ఉండాలని కోరుకొంటున్నారు. నేను తనవంక చూడడం తగ్గించేశా. నెమ్మదిగా తను కనిపించినా పెద్దగా ఉత్సాహం రావట్లేదు మునుపటిలా. అప్పుడు అర్థం కాలేదు కానీ చాలా రోజుల తరువాత అర్ధం ఐంది తను నా మనసు దోచుకొంది అని. తరువాత కొంతకాలానికి తను, వాళ్లక్క కూడా కనిపించడం మానేశారు. వాళ్లనాన్నకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది ఏమో అనుకొన్నా. అందరూ కొంతకాలానికి మర్చిపోయారు. నాకు మాత్రం అప్పుడప్పుడూ గుర్తొచ్చేది. ఎవర్ని అయినా అడిగితే నవ్వేవాళ్లు కాని చెప్పేందుకు వాళ్లదగ్గర కూడా ఏ సమాచారం లేదు అనుకొంటా. అలానే కొంతకాలం గడిచింది. నేను నాచదువుల్లో ఆటల్లో మునిగిపోయాను. ఎప్పుడైనా గుర్తొచ్చి అమ్మను అడిగితే సీరియస్ అయ్యేది. ఎందుకంటే అమ్మకి కూడా ఆ అమ్మాయి వేసిన వేషాలు నచ్చేవికావు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. సడన్‌గా ఒకరోజు తాంబరం(చెన్నై) రైల్వెస్టేషన్‌లొ కనిపించింది. ఆ అమ్మాయికాదు. వాళ్లక్క. పక్కన ఉండే ఫ్రెండ్ చెప్పేదాకా గుర్తుపట్టలేక పోయాను. వాళ్లగురించితెలిసినా ఎందుకు చెప్పలేదు అని వాడిని తిట్టాను. నువ్వంత సీరియస్ అనుకోలేదు మామా అన్నాడు. మాట్లాడదాం అనుకొంటే కొంచెంబిజీగా కనిపించింది. మెడిసిన్ చేస్తుంది అనుకొంటా చేతిలో స్టెతస్కోపు ఉంది. కొంతకాలానికి ఆమెకూడా కనిపించటంలేదు. తరువాత ఇంకోఫ్రెండు చెప్పాడు వాళ్లక్కకి పెళ్లి అయిపోయింది అని. కాని తనగురించి మాత్రం తెలియదట. అనవసరంగా మర్చిపోయిన దాన్ని గుర్తుతెచ్చుకొని ఇప్పుడు మదనపడుతున్నాను. కొంతకాలానికి ఇంకో టెన్షన్ మొదలైంది. వాళ్లక్కకి పెళ్లిచేసేస్తే ఇక తనకు ఎక్కువ సమయంతీస్కోరుగా ఇంట్లో వాళ్లు. అలా అలోచిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు కరుణించాడు. నా ఫ్రెండ్ ఆర్కుట్ ప్రొఫైల్‌లో ఎవరో ఒక అమ్మాయి చాలా బావుంది. ఎక్కడొ చూసినట్టు అనిపిస్తోంది. కానీ గుర్తుకు రావట్లేడు. ఆ... మీకు అర్ధం ఐపోయింది అని నాకు తెలుసులేండి. ఆ అమ్మాయే అని కింద పేరు చూసినపుడే అర్ధం ఐంది. కానీ ఎందుకైనా మంచిది అని మావాడిని అడిగా అవును అన్నాడు. అంతే "ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ ... ఝుం ఝుం ఝుం ... " చిన్నప్పుడూ వాళ్లక్కకి అద్దలు ఉండేవి. నేను చెన్నైలో చూసినప్పుడు ఆమె వాడట్లేదు. తన చిన్నప్పుడు కళ్లజోడు లేదుకానీ ఇప్పుడుమాత్రం వేస్కోనుంది.





చాలారోజుల తరువాత ఈరోజే చూశాను షామిలిపాప ఫోటో. ఓయ్ సినిమా గురించి విన్నాను గానీ ఫోటోలు గానీ వీడియోగానీ చూడలేదు ఇంతకాలం. ఈరోజే ఒక ఫ్రెండ్ ఆల్బంలో పెట్టాడు. అబ్బా! ఎంతబావుందో.

10 comments:

  1. మంచి రొమాంటిక్‌ స్టొరి.....మరి ఏమైనా మాట కలిపావా...

    ReplyDelete
  2. మురళి:ధన్యవదాలు
    నాగార్జున చారి: ఇప్పటిదాకా కళ్లతోనే. మరి ఇకముందు చూడాలి

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. నాకు కూడా ఇలాంటి అనుభవమే ... నా ప్రేమ పురాణం Inter mediate లో మొదలు ..తన కోసం classes skip చేసేవాడిని ... .... అ అమ్మాయి కళ్ళు చాలా బాగుంటాయి... మూతి విరుపుడు అబ్బో కేక... ప్రతి రోజు తన దర్శనం కోసం ఎదురు చూసేవాడిని.... కొన్ని సార్లు ఆటంకాలు కానీ ఏమి చెయ్యగలం... తనకు ఒక boy friend కూడా వున్నాడని తెలుసు ... కానీ ఎక్కడో ఒక ఆశ... అమ్మ నాన్న గమనించారు అక్షింతలు మామూలే.......తెలుసు కున్నాచిన్నగా .... విడిచి పెట్టేశా ..హిట్టు కొట్టా.... ఇనా ఇప్పుడు చూసినా అదే ఫీలింగ్... నా పెళ్ళాం తో చెప్పవద్దు సుమా తను JASMINE అని ...(Alladin tales -Jasmine)
    ---Your narration is superb...!!! Keep Rocking.

    ReplyDelete
  5. శివన్న: ఈపోస్ట్ మా చెల్లెలికి చూపించాను. సగం చదివి ఆవేశంలో ఊగొపోయింది. అమ్మకు చెప్తాను అంది. చిన్నప్పటినుంచి మావీధిలో ఉన్న అమాయిలపేర్లు చదివింది. చివర్లొ ఏమీ మాట్లాడలా.హహహ

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. hey idi sakhi cinemalo scene la undi,,aina parledu meeru chepte bagane undi

    ReplyDelete
  8. nenu cheppindi shaamili akka shaalinigurimchi kaabatte madyalO sakhi kalipaanu. mottam adikaadu.

    ReplyDelete
  9. For most up-to-date information you have to pay a quick
    visit the web and on web I found this web page
    as a best site for newest updates.

    Here is my webpage; Zahngold Wert

    ReplyDelete