ఈనాడు.. గతం! వర్తమానం..! భవిష్యత్తు...???

మనం ఎన్నో పత్రికల్ని, తెలుగు వెబ్ సైట్లను, ఇంకా ఎన్నో తెలుగు వ్యాసాలను, కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నాం, చదువుతున్నాం. ఇందులో ఈనాడు పత్రిక అన్నా ఈటీవీ అన్నా ఒక ప్రత్యేక పాత్ర. అందులో ముఖ్యమైంది వారి భాష. ఈరోజు మనం బ్లాగులో వాడే అనేక పదప్రయోగాల్ని ఎంతోముందు మొదలు పెట్టి విజయవంతం అయింది ఈనాడు. ఇప్పటికీ ఎన్నో పత్రికలు, టీవీలు వారి కార్యక్రమాల్లో వాడే భాషను ఈనాడు నుంచి అప్పుడప్పుడు అరువుకు తెచ్చుకుంటారు అన్నది బహిరంగ రహస్యం. వార్తల హెడ్డింగ్లో వారు ఇచ్చే పంచ్లైన్ దెబ్బ తరచూ ప్రభుత్వానికి తగిలేది. పోకిరిలో షిండే చెప్పే " లారీ ఢీ..ముగ్గురు ఢా..!" తరహా హెడ్డింగ్ లను ప్రవేశ పెట్టింది ఇదే. అప్పటి వరకు సంప్రదాయ తరాహాలో సాగుతున్న తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించింది ఈనాడు. ఈనాడుకు మరో ప్రత్యేక ఆకర్షణ శ్రీధర్ కార్టూన్లు. నా చిన్నప్పుడు మా అమ్మ రోజు పేపర్ చదవటం మంచి అలవాటు అని చెప్పడంతో మొదలు పెట్టాను. మొదట్లో స్పోర్ట్స్ పేజీతో మొదలుపెట్టే వాడిని. ముందు రోజు చూసిన మాచ్‌ని మళ్లీ చదివే వాడిని. దానిలో విశ్లేషణను నేను చూసిన మ్యాచ్తో పోల్చుకొనే వాడిని. మనకు నచ్చిన షాట్ లేదా ఇన్సిడెంట్ గురించి అందులో ప్రస్తావిస్తే చాలా ఉత్సాహంగా ఉండేది. పేపర్ ముందు పేజీలోని ముఖ్యమైన వార్తలని చదువు, తరువాతే మిగతావీ అని మా నాన్న చెప్పాడు. అక్కడ శ్రీధర్ కార్టూన్లు, శీర్షికలు ఎంతో బాగా నచ్చేవి. అలా రోజు ఉదయం 30 నిముషాలు పేపర్ చదవటం అలవాటైంది. నాకు తెలుగులో మాట్లాడటం, విశ్లేషించటం ఈనాడు వల్ల, ఆంగ్లంలో ఆ పని క్రికెట్ కామెంటరీ వల్ల అలవాటు అయ్యాయి. ఆదివారం ప్రత్యేక అనుబంధంలో కవరు పేజీ కధనాలు ఎంతో బావుంటాయి. ఎన్నో విషయాలపై నాకు అవగాహన వాటివల్లే వచ్చింది.ఆదివారం ప్రత్యేక అనుబంధం,జిల్లా అనుబంధాలు, వసుంధర లాంటివి మొదలు పెట్టింది ఈనాడేనట. అప్పట్లో దాన్ని ఒక ఖరీదైన పొరబాటుగా భావించారు విమర్శకులు. కానీ ఈ ప్రయోగం వాణిజ్యపరంగా ఎంతో పెద్ద విజయం. ఈ టీవీ ప్రారంభించిన తరువాత వ్యాఖ్యాతలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ సామర్ధ్యాన్ని ఇనుమడింప చేశారు. ప్రగతి, కల్యాణి లాంటి వాళ్ళు తరువాత వేరే ఛానెళ్లకు మారినా వాళ్ళ ఉచ్చారణలో ఖచ్చితంగా ఈనాడు గొంతు వినిపిస్తుంది. ప్రతిభగలిగిన తెలుగు వారికి ఉదా:- పీవీ,వేణుగోపాల రావు, లక్ష్మణ్, హంపి, హరికృష్ణ, గోపీచంద్,రాయుడు, అజహర్ వంటి వాళ్ళకి నైతిక మద్దతు ఇచ్చింది. అలాంటి ఈనాడు ఈమధ్య మసక బారుతోంది. పోటీ ప్రపంచంలో పత్రికా రంగానికి ఎలాంటి మినహాయింపు లేదు. ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన పత్రికలు, ఛానళ్లు దీని స్తానాన్ని ఆక్రమిస్తున్నాయి. పోటీ అనేది ఈనాడుకు కొత్త కాదు. ఆది పుట్టిన సమయంలోనే ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి పత్రికలు ఉండేవి. వాటికి ధీటుగా నిలిచిన గతం దాని సొంతం. మధ్యలో వచ్చిన వార్తతో కూడా పోరాడింది. కానీ ఇప్పుడు దానికి ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి నాయకత్వంలో కొత్త రక్తం. రామోజీ రావు ఇన్నేళ్ల పోరాటంలో ఇప్పుడు అలసట, వయోభారం కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన సంపాదించుకున్న స్నేహితుల కన్నా రాజకీయ పక్షపాతంతో ఏర్పరచుకున్న శత్రువులే ఎక్కువ. పైగా ఇప్పుడు వాళ్ళే బలవంతులు. అధికారంలో ఉన్నవారు. వారితో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిష్ఠితి ఆయనది. ఇది ఈనాడు చేసుకున్న స్వయం కృతాపరాధమే. కొన్నిసార్లు అనవసరంగా వాళ్లపై అభాండాలు వేసి ఉన్నవీ లేనివీ కల్పించి రాశారు. మరొక పార్టీకి, దాని అధినేతకు అతిశయోక్తులతో పొగిడి, ప్రజలకు ఈనాడుపై విశ్వాసం సన్నగిల్లే లా చేసుకున్నారు. తన కలంలోని పదునును దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ చిత్రపటం మారింది. పదవిలో ఉన్నవారు ఈనాడుకు వ్యతిరేకంగా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకొనే ఆలోచనలో లేరు. ఈ స్థితి బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. లేకుంటే గతంలో వారిపై ఆ స్థాయిలో దాడి చేసేవారు కాదేమో. ఇప్పుడు ఆయనకు తోడు నిలిచి పోరాడాగల్గిన వారసులు లేరు.ఉన్నా వారు అజాగళస్థన్యము వంటి వాళ్లే. అందువల్లే ఇటీవలి ఎన్నికల తరువాత దాని పంధాలో మార్పు అనిపిస్తోంది. రాజీ మార్గమే మేలు అన్న భావన వాళ్ళు రాసే వార్తలు, వాటి శీర్షికలలో అనిపిస్తోంది. ఐతే ఈనాడుకు తెలుగుపై, తెలుగు వారిపై ఉన్న అభిమానం నిస్సందేహంగా మెచ్చుకోదగినదే. ఐతే అది ఎప్పుడూ హద్దుల్లోనే ఉన్నది. ప్రాంతీయ విద్వేషాల్ని, భాషా బేధాల్ని రెచ్చగొట్టలేదు. గతంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు వారికి మద్దతు తెలిపారు. కానీ ఇటీవల కొన్ని దాడులు జరిగినప్పుడు ప్రజలు అంతగా స్పందించలేదు. కారణం ప్రజల్లో ఈనాడుపై అభిప్రాయం సన్నగిల్లటమే. కొన్ని సందర్భాల్లో అది ఒక బాధ్యతాయుతమైన పత్రికలా కాక తనకి ఉన్న ఇతర సంస్థల వ్యాపారమే పరమావధిగా ఫక్తు కార్పొరేట్ సంస్థలా వ్యవహరించటమే. ఏ ఫలాన్ని ఆశించి అది అలా వ్యవహరించింది అన్నది బహిరంగ రహస్యం. కొత్తరక్తం చేరి, నైతిక విలువల్ని పెంచుకుని కాల పరీక్షకు తట్తుకొని ఈనాడు నిలబడుతుందో? లేదో?

8 comments:

  1. This article is in similar lines of the article written by Mr. Yarnagula Sudhakar Rao at www.topandhra.com

    ReplyDelete
  2. may be but I didnt see that. now Im trying to get it. can u send me the URL

    ReplyDelete
  3. eenadu is excellent no doubtfor that. in the mean while ramojirao sir live the public opinion and intrusened his opinion.and he is one side to tdp according to same he creates many alley's againest govt without any ground work. what ever it may be eenadu group is best in telugu. when ever eenadu step down in the market that is only
    failure of sri ramoji rao.

    ReplyDelete
  4. తప్పులు చేసుండొచ్చు కానీ ఈనాడు లేకుంటే గత ఐదేళ్లలో పాలకపక్షానికి పట్టపగ్గాలు లేకుండా పోయేవి.

    ReplyDelete
  5. ఈనాడు గురించి మీరు పడుతున్న ఆవేదన అర్థం చేసుకోదగిందే. కాని, కొన్ని కొన్ని విషయాలు తెలుగు సమాజంలో అలాఅలాఅలా పాతుకుపోయి నెమ్మదిగా అబద్దాలే నిజమనేలా ప్రచారంలోకొచ్చాయి. నిజానికి ఈనాడుకు ఏ మంచి సంప్రదాయాన్ని ప్రారంభించిన చరిత్ర లేదు. జిల్లా అనుబంధాలు గాని, ప్రత్యేక మహిళా పేజీగాని, ఆదివారం అనుబంధం గాని తెలుగు దినపత్రికల్లో మొదట పరిచయం చేసింది ఈనాడు కాదు. వేరే పత్రికలు ప్రవేశపెట్టాయి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్లి ఎ.బి.కె ప్రసాద్ గారి వ్యాసాలు చదవగలిగితే ఈనాడు తెలుగు పత్రికల రచనల్లో ప్రవేశపెట్టిన దుష్ట సంప్రదాయాలు ఎన్నో, ఎన్నెన్నో తెలుస్తాయి. తెలుగులో మేధావి వర్గం అనదగ్గవారంతా ఈనాడులో రకరకాల కారణాల వల్ల కొద్దికాలమో, హెచ్చుకాలమో పనిచేయడం వల్ల మాత్రమే ఆ పత్రికలో భాషా, శైలులు మనకి నచ్చడానికి కారణం. రామోజీరావు స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారడానికి వెనుకాడరని ఈనాడు పాఠకులకు అందరికీ తెలిసిన విషయమే.

    ReplyDelete
  6. @duppalavari:ప్రసాద్ గారి వ్యాసాల లింకులు పంపుతారా మీరు. ఈనాడు అనుబంధాలు మొదలు పెట్టింది అన్నది 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రత్యేక అనుబంధంలో రామోజీ రాసిన వ్యాసంలో చదివాను. భాష విషయంలో ఈనాడు కొందరు మేధావివర్గం వల్ల మెరుగుపడింది అన్నది వాస్తవమే. ప్రతి శీర్షికని ఎడిటర్ ఇన్ చీఫ్ చదవలేడు కదా. కానీ వారు నచ్చిన విధంగా కొన్ని శీర్షికలు(కొన్ని మాత్రమే )రాసే వేదికగా ఈనాడు ఉపయోగ పడింది కదా. పత్రికల విషయంలోనే కాదు కొన్ని నవలా రచయితల నుంచి కాపీరైట్ కొనుగోలులో కూడా ఆయన ఆక్రమాలకు పాల్పడ్డాడు.

    ReplyDelete
  7. mutyala veerendranaath19 October 2009 at 10:16

    py vyasam bavunna topandrhalo yarnagula sudhkararao raasina eenadu story ikkada ivvavalsindi aalage eesitelo yarnagulatho rayinchalsindi

    veerendranaath mutyala

    ReplyDelete
  8. యర్నాగుల సుధాకర్ ఎవరో నాకు తెలియదండీ. ఆలశ్యమైనందుకు క్షమించగలరు.

    ReplyDelete