మీరు సరిగానే చదివారు. అది క్లాసు కాదు గ్లాసు. ఇక అసలు విషయానికి వస్తే...
నేను ఇప్పుడు NTPC లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగ పర్వంలో భాగంగా నాకు ట్రాన్స్ఫర్ ఐంది. నోయిడా నుంచి ఒక్క సారిగా ఉత్తరప్రదేశ్- మధ్యప్రదేశ్ బోర్డర్లో సింగ్రోలి అని ఉంది అది మా మొదటి ప్లాంట్. అక్కాడ ఒక కొత్త యూనిట్ కట్టాలి అంటే పంపారు నన్ను. ఇక్కడ నాతొ పాటు మరో 20 మంది ట్రైనీలు ఉన్నారు. అందరం బ్రహ్మచారులమే. ఒక్కడు తప్ప. సుధీర్ అని వాళ్ల ఊరు ఇక్కడికి దగ్గర. దాంతో వాళ్ల ఆవిడని, ౩ నెలల బిడ్డని తీసుకొని క్వార్టర్స్లో దిగాడు. మేమంతా బ్యాచిలర్ హాస్టల్లో ఉంటాం. వాడిది ఆపరేషన్ డిపార్టుమెంటు నాది సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు. వాళ్ళ డిపార్టుమెంటులో మొత్తం ఎనిమిది మంది ఉంటారు. ఒక రోజు సాయంత్రం నేను వచ్చేసరికి మాంచి డిస్కషన్లో ఉన్నారు. విషయం నాకు చాలాసేపు చెప్పలేదు. తరువాత తెసింది ఏమిటంటే వాడు టీ పార్టీకి పిలిచాడు. కాకపొతే చిన్న కండిషన్ . ఐదుమందే రావాలి. ఎందుకంటే వాడి ఇంట్లో ఐదు గ్లాసులు, ఐదు ప్లేట్లు మాత్రమె ఉన్నాయ్. ఒకడు సెలవు మీద ఇంటికి వెళ్ళాడు. మిగిలింది ఆరు. ఎవరు వెళ్ళాలి. ఇంకా ఒకడు ఆఫీసు నుంచి రాలేదు. వాడికి చెప్పకుండా వెళ్ళలేరు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంతలొ వాడు వచ్చాడు. వాళ్ళలో ఒకడు రాయబారం నేను జరుపుతా అన్నట్లు ముందుకు వచ్చి చెప్పు విషయాన్ని. కనిశ్క్( వచ్చిన వాడు) ఒక్కసారిగా తల పైకి ఎత్తో ఆకసంలోకి చూస్తూ ఏదో ఆలోచించాడు.
సీన్ కత్తిరిస్తే వాడు కూడా టీ తాగాడు సుధీర్ వాళ్ల ఇంట్లో. ఎలా అంటే ఏముంది సింపుల్ వాడి రూంలో నుంచి గ్లాస్ తీస్కొచ్చి నేనూ వస్తా అన్నాడు. వాడ్ని చూసి అందరామ్ ఒక్కసారిగా నవ్వుకున్నాం. వాడు మాత్రం తన సమయస్ఫూర్తికి ఏదో తెనాలి రామక్రిష్నుడిలా పోజ్ ఇచి బయల్దేరాడు. అక్కడి వరకు మేము చాల నవ్వేసాం. కాని అసలు కామెడీ ముందు ఉంది అని ఊహించలేక పోయాం. అలా బయల్దేరి మా హాస్టల్ నుంచి సుధీర్ ఇంటికి దాదాపు అరమెయిలు ఉంటుంది. అదీ టౌన్ షిప్లో. అందరూ తెలిసిన వాళ్ళే. మాకు పై ఆఫీసర్లు. వీడు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్న అథ్లెట్ లాగ ఊరేగింపుచేస్కుంటూ వెళ్ళాడు. దారిలో ప్రతి ఒక్కరు వాడిని చూసి(వాళ్లు చూడక పోయినా మా వాళ్లు చేసే సైగలతో గుర్తుపట్టేస్తున్నారు.)దేనితో వాడికి ఆవేశం పెరిగి బాడిలాంగ్వేజ్ మార్చేశాడు.నన్ను పిలవక పాయిన వాళ్ల వెనకాల వెళ్లాను. వీణ్ణి చూద్దామని. రాను రాను వీడు బారిష్టరు పార్వతీశంలా, మై ఫైనాన్సియల్ కెరీర్లో వాడిలా మారిపోయాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. తరువాత కొంత సేపటికి మావాడికి సిగ్గు ఎక్కువైంది. కొంచం మెలికలు తిరుగుతూ వివిధ భంగిమల్లో నడవటం మొదలుపెట్టాడు. మమ్మల్ని దాన్ని పట్టుకోమని బతిమాలాడు, బెదిరించాడు. కాని మేము అంత కామెడీని ఎలా వడుల్తాం. చివరికి మానుంచి వాడికి సహాయ నిరాకరణ ఎదురైంది. అలానే చివరికి వాళ్ల ఇంటికి చేరుకున్నారు.
తరువాత రోజు ఆఫీసులో అందరూ వీడిని చూడటం వెంటనే గుసగుసలు. పాపం అనుకుంటున్నాం. ఇంతలో ఇంకో ఫోన్ కాల్. ఈసారి మేఇంటనన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ పిలుపు. అందరూ సాయంత్రం మా ఇంటికి రావాలోయ్. మా అబ్బాయికి ఇంజినియరింగ్ డిస్టింక్షన్ వచ్చింది. టీ పార్టీ. అలాగే ఆ ఆపరేషన్స్ వాళ్ళని కూడా పిలవండి. అంతే అందరం వాడి పక్క చూశాం. వాడేమో సీరీయస్గా మానిటర్లో తలపెట్టి నాకు ఈ రోజు ఈవ్నింగ్ షిఫ్ట్ ఉంది అన్నాడు. మాకు అసలు నవ్వు ఆగలేదు. పాపం వాడు తరువాత వారం రోజులు మాతో కలిసి టీ తాగలేదు.
బానే ఉంది కానీ, అంత ఇదేముంది అందులో? పాపం హోష్టుకి ఇబ్బంది కలక్కుండ తనగ్లాసు తనే తీస్కొచ్చుకున్నాడు. పూర్వకాలం పల్లెటూళ్ళల్లో ఏదన్నా పెళ్ళి పేరంటానికి బోయినానికి పిలిస్తే, జనులు తమ మంచినీళ్ళు తమ చెంబుతోనే తెచ్చుకునే వాళ్ళుట.
ReplyDelete:lol: that's funny!
ReplyDelete@కొత్త పాళీ : నా బ్లాగులో మొదటి కామెంట్ని పోస్ట్ చేసిన మీకు ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ కామెడీ జరిగింది వాడి ఆలోచనకి కాదు. తరువాత వాడి హావభావాలు చూస్తే ఎవరికైనా నవ్వు ఆపుకోవడం కష్టం. గ్లాసును ఏ సంచీలోనో, కవారులోనో పెట్టుకుంటే ఏ సమస్య లేదు. కానీ వాడు దానితో రకరకాల విన్యాసాలు చేయటంతో మాకు నవ్వు ఆగలేదు.మా బంధువూల్లోనే చాలా మంది మయ ఇంటికి ఏ పండగకొ, పూజకో భోజనానికో వస్తే వాళ్ళతో కూడా మరచెంబు, గ్లాసు తెచ్చుకోనే వారు. మా చిన్నప్పుడు ఆది మాకో విచిత్రం.
ReplyDelete@జీడిపప్పు: ధన్యవాదాలు