ఈ టపారాయడానికి రెండుమూడూరోజులు ఆలోచించా. కారణం చదివాక మీకే తెలుస్తుంది.జరగబోయే దాడులకు మానసికంగా సిద్ధపడి ప్రచురిస్తున్నా.
కూడలిలో ఓవారం రోజులు తిరిగాడంటే నిక్కరేసుకోని పిల్లోడిక్కూడా అర్థం అయ్యే పిల్లవిషయం ఏమిటంటే- ఇక్కడ గుంపులున్నాయి. అవును గుంపులున్నాయి. ఈవిషయం అర్థం కావడానికి నాకో వారంపదిరోజులు పటింది. "అబ్బా! ఏమిటిది" అనుకునేవాణ్ణి. కానీ తర్వాత ఆలోచిస్తే ఇదేమీ తప్పుకాదు అనిపించింది. ఎందుకంటారా? ఏబ్లాగును చూసినా రెండుమూడుటపాలు చదివామంటే సదరుబ్లాగరు అభిరుచి, ఆసక్తి, అసలాబ్లాగు ఎందుకు తెరిచాడు లాంటి విషయాలన్నీ తెలిసిపోతాయి. ఓయాభైటపాలు చదివినా అసలురాసేవాడు మనిషేనా? అసలేమి చెప్పలనుకుంటున్నాడు? అనిపించే బ్లాగులూ ఉన్నాయి. అదివేరేసంగతి. అలా పదిపదిహేను చూసేప్పుడు మన అభిరుచికో, నమ్మకానికో, సిద్ధాంతానికో పోలిక ఉండేబ్లాగు కనపడడం, వ్యాఖ్యరాయడం జరుగుతుంది. ఆతర్వాత పరిచయాలు క్రమంగా స్నేహితులుగా చేస్తాయి. ఇలా స్నేహాలు కాస్తా గుంపులుగా ఎదుగుతాయి.
ఇక్కడదాకా వ్యవహారం చిరునవ్వులతో, హాయిహాయిగా చాలాహుందాగా నడుస్తుంది. మరిసమస్య ఎక్కడ అంటే- కూడలిమొత్తం మనగుంపుకు అనుగుణంగానే టపాలు వెయ్యాలి అనే హుకుం.అలారాయని బ్లాగర్లపై ఫత్వా. ఇక్కడ మొదలయ్యే రావణకాష్టాలేవీ ఇంతవరకూ ఆరలేదు. కొంతకాలం మందగించినా అవన్నీ నివురుగప్పిన నిప్పులే.
ఒకవ్యక్తి చదువుకుని కనీసం ఒకడిగ్రీపట్టా అయినా పుచ్చుకున్నాక, కొద్దోగొప్పో లోకాన్ని చూశాక, తనకంటూ కొన్నీఅలోచనలు, అభిప్రాయాలు ఏర్పడ్డాక, రాయాలనిపించి అందుకు ఒకవేదికను వెతుక్కునే సమయంలో లభించే అవకాశమే బ్లాగు. దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేదేమిటయ్యా అంటే - మనఆలోచనలతో సారూప్యత ఉన్నవాళ్లతో సహవాసం చెయ్యగలమేగానీ ఎవర్నో మన ఆలోచనలతో, సిద్ధాంతాలతో, తలాతోకాలేని వాదులాటలతో మార్చెయ్యాలి అనుకోవడం పొరబాటేకాదు అజ్ఞానమే అవుతుంది. తనఅనుభవాలతో దేవుణ్ణి నమ్మేవ్యక్తితో ఎంతవాదించినా అతనికి పరమాత్మ ఉనికి కనిపిస్తొ ఉంటుంది. అలాగే పస్తులతో కాలాన్ని ఈడ్చినవాడికి దేవుడికన్నా ముందు ఆకలే కనిపిస్తుంది. ఇది మనంకనుక్కోలేనంత చిదంబరరహస్యం ఏమీకాదు.
కానీ సమస్య ఏమిటంటే- మనసిద్ధాంతాలపై మనకున్న నమ్మకంలో వెయ్యోవంతు గౌరవం ఎదుటివాళ్ళ నమ్మకాలపై ఉండదు. తనురాసేది కొందరిని ఇబ్బందిపెడుతుందని తనకు తెలుసు.వాళ్ళు రాసింది చూసినవాళ్ళు అనుకున్న బ్లాగుగురించి కాకపోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే నేనన్నది ఒకరిని ఉద్దేశించికాదు అనొచ్చు. కానీ టపాశీర్షికలో-బ్లాగుస్వాములు అన్నారు అంటే అది తోటిబ్లాగరు గురించేకదా? కూడలిలో ఉన్నబ్లాగులు లాగితంతే ఐదొందలు. అందులో భక్తిబ్లాగులు పదిపదిహేను. మహాఅయితే ఇరవై. ఇందులో తరచుగా రాసేబ్లాగర్లు పదిమంది. అంటే ఆబ్లాగు శీర్షిక ఈపదిమందిలొ ఎవరినో ఉద్దేశించి అన్నదేకదా? ఆపదిమంది బ్లాగుల్ని చూద్దాం.
ఇప్పుడు ఆటపాలో ఉన్న విషయం టూకీగా- పరీక్షలప్పుడు పూజలు. ఈవిషయంపై రాసిందెవరో చూసేందుకు మనమేమీ షెర్లాక్‌హోమ్స్ కానక్కర్లా. వారాంతంలో ఓసారి కూడలితెరిచినా ఈరకమైన టపారాసే బ్లాగరెవరోమనకు తెలుస్తుంది. సరే ఆయన్నికాదనుకుందాం. మరి ఆపదిమందిలో ఎవర్నో? లేదా భక్తిబ్లాగులగుంపునో లేక అందులో ఒకఉపగుంపునో. ఇలాంటి దాడి భావప్రకటనకు వ్యతిరేకంకాదా?
నాకు తెలీక అడుగుతా? ఎదుటివాడి మంచికోసం మనం ఐదునిముషాలు అలోచించడం నేరమా? అదితప్పని ఏసిద్ధాంతం చెప్పిందో? పరీక్షలకు వెళ్ళె పిల్లలకు వయసులోపెద్దాయనగా అలాకోరడంలో తప్పేమిటో? పోనీ ఎదుటోడికే చెప్పిఊరుకున్నాడా? ఆయనకూడా వీలైనంతలొ ఆచరిస్తున్నాడుగా? తనూఅచరించిందే చెప్తునాడుగా? అక్కడ పిల్లలకేమి చెప్పాడు? పరీక్షలప్పుడు ధైర్యంగా ఉండేందుకు పరిష్కారం ఇచ్చాడు. అందులో సమాజాన్ని చెడగొట్టేంత విషం ఏముందో? మీకోసం పూజచేస్తా అన్నాడు. వాళ్లమంచికోసం ఆలోచించడం తప్పా? అందుకేమీ ఆయన డబ్బుతీసుకోవట్లేదే? అంటే మనసమాజంలో పెద్దలు పిల్లల మంచికోరడం, పిల్లలు పెద్దలకు నమస్కారం చెయ్యడంవంటివి అభిజాత్యానికి నిదర్శనమా? తాయెత్తులు కట్టేది స్వామీజీలేకాదు పకీర్లు, ఇతరమతాల్లోని సాధువులుకూడా అన్నసంగతి వాళ్ళకి ఎందుకుతెలీదో?
ఇలాదాడులుచేసే బ్లాగర్లకు సమాజంలోని కొన్నిసమస్యలే, వాటిలోని తమకుకావల్సిన పార్శ్వాలే కనిపిస్తాయని, వాటిపైనే రాస్తారని, పోనీతనబ్లాగులో చర్చలకు సరైనదిశలో స్పందించరని చెప్పేహక్కు నాకులేదు. ఎందుకంటె అవి వాళ్ళబ్లాగులు. వాళ్లవాళ్ల ఇష్టానుసారం, వారు స్పందించగలిగే అంశాలపైనే వాళ్ళురాస్తారు. వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేదు. మరివాళ్ళూ మిగిలినబ్లాగుల గురించి అలానే అనుకోవలన్నదిమాత్రం తోటిబ్లాగరుగా నాకోరిక.
వారంరోజులుగా ఇంతమంది స్వామీజీలను అరెస్టు చేస్తుంటే సగటుహిందువు సమర్థించాడేతప్ప నిరశనలు, రాస్తారోకోలు చెయ్యలేదు. నిజస్వరూపాలు బయటపడ్డాక ఆఆశ్రమాలపై దాడిచేసినవారిలో ఆస్తికులు, దైవచింతనలో గడిపేవారు, మద్యతరగతి హిందువులు( ఈమాట ఎందుకువాడుతున్నాను అంటే వీళ్లదృష్టిలో దొంగస్వాములు హిందూమతంలోనే ఉంటారు.) ఉన్నారు. ఇలాంటిసంఘటన మరేమతపెద్ద విషయంలో జరిగినా వీడియోలు బయటికిరావు. వచ్చినా మీడియాకి అంతదమ్ములేదు. అసలింతమందిని అరెస్టుచేసే అవకాశమే ఉండదు.
చివరగా ఒక్కమాట- మనదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడ్డాక ఎన్నోసార్లు మోసగాళ్ళు తప్పించుకున్నారు. హత్యలుచేసినవాళ్ళు రాజ్యాన్నేలుతున్నారు. కులంగజ్జితో కుంచించుకుపోతున్నాం. ప్రజలకు తమఓటు ఎంతవిలువైనదో తెలీని స్థితిలో ఓటేస్తున్నారు. స్వార్థప్రయోజనాలకోసం అసమర్థులను ఎన్నుకుంటున్నారు. పాలితులు-పాలకులు ఎవరికి వీలైనస్థాయిలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మరి ఈతప్పు ప్రజాస్వామ్యానిదా? ప్రజలదా? ఇక్కడ హైందవంపై జరుగుతున్నది కూడా అలాంటిదే. కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్కుని అరాచకాలు చేస్తుంటే ఆమకిలి హైందవానికి అంటుకుంటుంది. కానీ ఇదితాత్కాలికం. కారణం నాధర్మం అజరామరం. స్వయంప్రకాశం. ధర్మోరక్షతి రక్షితః
quite well said!, even we share the same pain as readers to see these unnecessary fights and groups, but, don't be one sided please, while accepting mentioned blog's or blogger's mistake would like to remind you gently, many times, he was pulled and pushed in mud for the simple fact that he blogs what he believes, why don't we leave him? why do we provoke him with comments? and do you remember last this this indirectly mentioned blog swami brought the other blogger's son (mukunda) masking as hiranyakasyapa story, why should he pull family in this, atleast we should appreciate the decency of this blogger for not using unparliamentary words or not talking about anyone's family, i am not sure whether you publish this comment or not, but this is my humble opinion
ReplyDeletegood one!
ReplyDeletehttp://durgeswara.blogspot.com/2010/02/blog-post_18.html
ReplyDeleteనన్ను ఖండించడానికి, నిందించడానికీ టపా రాయాలంటే ఇంత మానసిక సంసిద్ధత అవసరం లేదు. ఎందుకంటే నాదనుకునే గుంపులోని పాఠకులకు/బ్లాగర్లకు అలా దాడిచేసే అలవాటు లేదు.
ReplyDeleteబ్లాగుల్లోకి ఇప్పుడేవచ్చానంటున్నావు. కాబట్టి చరిత్ర తెలీదు. ఎవరు ఎవరి నమ్మకాల్ని ఎద్దేవాచేసి కసితీరా సంస్కరిస్తారో మీకింకా తెలీదు. బహుశా తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చెయ్యలేదు. ఒకవేళ తెలిసినా మీ అభిప్రాయం మారదు. ఎందుకంటే you just seem to belief in a blind faith not reason.
అయ్యో కత్తీ
ReplyDeleteనీలా తిక్కల టపాలు రాయటానికీ ఆలోసించాల్సిన పనిలేదు...
>>బహుశా తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చెయ్యలేదు. ఒకవేళ తెలిసినా మీ అభిప్రాయం మారదు.
నీకు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా మారావా?
బాసూ చైతన్య -
కుక్కతోక వంకర.
>>you just seem to belief in a blind faith not reason.
Dont you think this applies to you too Katti!!
Well said! I uncoditionally agree with you!
ReplyDeleteI appreciate one thing - You have guts to accept 'Anonymous', while majority allow YES-people! They want only appreciation , no criticism. They want to listen 'only pleasing comments' :))
దొ౦గ సాముల మాటలైనా వినొచ్చు గని ఈ పిచ్చి ము౦డాకొడుకు మాటలు వింటే మతి చలి౦చి పోవడ౦ ఖాయ౦. ఈడికి మి౦చిన వాళ్ళు లేరని, ఈ పెప౦చ౦లో తను తప్ప మిగిలిన్ వాళ్ళా౦దరూ వట్టి ఎదవాయిలని వీడికో గాట్టి నమ్మక౦. ఏమైనా అ౦టే మీరెవరూ నేను రాసి౦ది చదవక్కరలేద౦టాడు. నేను పరపెక్టు నేను మారన౦టాడు, పెప౦చ౦ మొత్త౦ మారిపోవాల౦టాడు.
ReplyDeleteముస్లి౦ వోల్లు పత్వాజారీ చేయడ౦ తప్ప౦టాడు కానీ సార్వజనీక౦గా కొన్ని పత్వాలు జారీ చేస్తు౦టాడు. అట్లా౦టిదే ఇదీను. మీరు నోర్మూసుకొని చదవ౦డి. కత్తి సాములోర్ని పల్లెత్తు మాటన్నార౦టే మీ కుత్తుకలు౦డవు. అన్నట్టు, మరో సార్వజనీక పత్వా జారీ చేసాడ౦డోయ్....చిత్తగి౦చవలయును.
గమనిక: ఇది నేనెవరిమీదా వ్యక్తిగత కక్షలతో రాయడ౦లేదు. సదరు వ్యక్తి/వ్యక్తుల తో నాకు ప్రత్యక్ష్య పరోక్ష వ్యాపార, బా౦ధవ్య స౦భ౦దాలు లేవు.
చైతన్య చాల చక్కగా రాసారు ! "ధర్మోరక్షతి రక్షితః " ఇది నిజం .
ReplyDelete"వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేదు. మరివాళ్ళూ మిగిలినబ్లాగుల గురించి అలానే అనుకోవలన్నదిమాత్రం తోటిబ్లాగరుగా నాకోరిక." Well said
ReplyDelete----కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్కుని అరాచకాలు చేస్తుంటే ఆమకిలి హైందవానికి అంటుకుంటుంది. కానీ ఇదితాత్కాలికం. కారణం నాధర్మం అజరామరం. స్వయంప్రకాశం. ధర్మోరక్షతి రక్షితః-------------
ReplyDeleteఅయ్యా !
లక్షల వరహాల విలువయిన మాట చెప్పారు. పది తల ల రావణాసురుడే హిందూ సంస్కృతి ని ఏమీ చెయ్యలేకపోయాడు. హైందవం పైన కత్తి విసిరి నానా భీభత్సం సృష్టించిన ముష్కరమ్లేచ్చులే ఎదురొడ్దలేక తోక ముడిచారు. ఈ వరాహాలు ఒక లెక్కా?
ఎవడో దారిన పోయే దానయ్య ఏదో అంటే ఆరిపోయే వెలుగు కాదు. ఎవడో వచ్చి చేతులడ్దం పెడితే కానీ బ్రతకలేని దీపమూ కాదు. మన ధర్మం నిరంతరం. అమలిన, స్వచ్చమయిన గంగా ప్రవాహం. అందులో ఎంతటి మహామహులయినా కొట్టుకు పోవలసిందే కానీ. ఎదురీది బ్రతకలేరు..
Contnd....
ReplyDeleteకాని....
ఇప్పుడే ఆ నగ్న చిత్రాల గురించి బ్లాగు చూసి బాధనిపించింది.
ఏమిటిది? మనం ఎటు పయనిస్తున్నాం. ? మనం మనుషులన్న విషయాన్ని విస్మరిస్తున్నామా? మన తల్లి తండ్రి ని ఒక్క మాట పడనివ్వమే ? మన కులాన్ని ఒక్క మాట అననివ్వం... అన్నారంటే కేసులేస్తాం. మరి అలాంటిది మన సంస్కృతి అంటే అంత చిన్న చూపెందుకు? మన సంస్కృతి లో ప్రతిది తప్పుగానే కనిపిస్తుందా?మన హైందవ సంస్కృతి లో పాసిటివ్ అంశం ఒక్కటి కూడా లేదా? లేక కామెర్ల కళ్ళ చందమా? లేక మానసిక జాడ్యమా? పని గట్టుకొని, విలువయిన సమయాన్ని ఈ ఫొటొస్ వెతకడం లో వేస్ట్ చేసారంటేనే తెలుస్తోంది. తన వాదన నిరూపించుకోవడానికి ఏదయినా చేస్తారని.
ఛ..ఛ. బ్లాగులంటేనే అసహ్యం పుడుతోంది.