వాఖ్య- నిజజీవితంలో మనమేదైనా మాట్లాడినప్పుడు ఇది ఎదురైతే రగిలిపోతాం. కానీ బ్లాగుల్లో పరిస్థితి పూర్తిగా విరుద్ధం. టపారాశాక అరగంటకొకసారి పేజీతెరిచి కొత్తవ్యాఖ్యలేమైనా వచ్చాయా అని చూసుకోను రోజంతా గడిచిపోతుంది. ఇక్కడ వ్యాఖ్యలే ఇంధనం. రోజూ వచ్చేదానికన్నా రెండుమూడు వ్యాఖ్యలెక్కువొచ్చినా తక్కువొచ్చినా బహుశా ఆరోజంతా చుట్టుపక్కల పరిసరాలతో సంబంధబాంధవ్యాలు తెగిపోతాయనుకుంటా. కొత్తబ్లాగు కనిపిస్తే బ్లాగు గురించేకాక, సదరుబ్లాగరు గురించికూడా ఓ అవగాహన కల్పించేదీ వ్యాఖ్యలే. అంతేకాదు ఆబ్లాగరుకి బ్లాగ్మిత్రులెవరు? వ్యక్తిత్వం ఎలాంటిది అన్న సున్నిత విషయాలు వ్యాఖ్యలు చెప్పకనే చెబుతాయి. ఒకరకంగా చెప్పాలంటే బ్లాగుకి టీఆర్‌పీ రేటింగులు నిర్ణయించేది వ్యాఖ్యలే. వీటిగురించి విపరీతంగా ఆలోచించేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బ్లాగర్లూ ఉన్నారు.కొన్నివిషయాల గురించి రాసినప్పుడు వ్యాఖ్యలరూపంలో జరిగే చర్చలు మంచిసమాచారాన్ని అందజేస్తాయి. మాలాంటి కుర్రబ్లాగర్లు ఎవరైనా కొంతకాలం తర్వాత చూసినప్పుడు అక్కడి చర్చ ఎంతోఉపయోగకరంగా కనిపిస్తుంది.
పోయినవారం "ఏరా కూడలి ఎలాఉంది?" అని నాబ్లాగ్మిత్రుడిని అడిగితే లింకులు పంపాడు. వాటిని చూశాక కూడలి రగులుతుందని అర్థం అయ్యింది. ఇదిమామూలే కదా? అనుకుందామంటే రగులుతున్న విషయం ఆసక్తికరంగా కనిపించి ఇంకొన్నిలింకులు తెరిచి చూశా. విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే 'ఫోర్జరీ వ్యాఖ్యలు'.
ఎలా జరిగాయి? ఎవరుచేశారు? ఇలాంటివి నాకు తెలీదు. కానీ జరిగింది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ వారంరోజులుగా నాకు ఖండించేందుకు వీలుచిక్కలా. అందుకే ఇప్పుడు ఖండిస్తున్నా. ఇప్పటిదాకా వ్యాఖ్యల్లో మనంచూసిన అత్యంత అనాగరికచర్య అజ్ఞాతరూపంలో వచ్చి తిట్టడం. కానీ ఇది అస్సలు ఊహించని పరిణామం. నామిత్రుడు విషయం చెప్పకుండా ఒకలింకు పంపాడు. అక్కడి వ్యాఖ్యను చూసి నమ్మలేక పోయాను. ఏంటిబాబూ ఇలారాశాడు కామెంటు అనుకుని జుట్టుపట్టుకున్నా. ఆతర్వాత పంపినలింకు చూశాక అర్థం అయ్యింది. ఆఒక్కబ్లాగరునేకాక ఇంకొంతమంది పేరుమోసిన బ్లాగర్లుకూడా ఈ-పేర్ల కుట్రలో బాధితులు అని తెలిసింది. ఇక్కడ జరిగింది ఏమాత్రం సమర్థించకూడదు. నాకు తెలిసీ ఎవరూ సమర్థించలేదనుకుంటా. ఈపని చేసినవాడికి పిరికిపంద, మానసికరోగి లాంటిపదాలు సరిపడవు.
ఇలాంటివి జరిగిన వెంటనే అనుమానితుల జాబితా ఒకటి తయారుచేసుకుని ఉంటారు ఎవరికివాళ్ళు. ఈజాబితాకి మూలం గతంలో తమని కెలికిన బ్లాగర్లు. ఈవిషయంలో నా అభిప్రాయం- మనజాబితాలేవీ కరెక్టుకాదు. ఎందుకంటే పిల్లచేష్టలు, వెకిలివేషాలు వేస్తారు అనుకుని మనం అనుమానిమ్చేవాళ్ళంతా గతంలో తమపేరుమీదే చేశారు అవన్నీ. మరి ఇలా వేరేవాళ్ళపేర్లు పెట్టుకుని చెయ్యాల్సిన అవసరంలేదు. కాలేజీపిల్లలతో ఇంకొకజాబితా ఉంది. వాళ్ళేదో వాళ్ల ఆనందాన్ని పంచుకోవటం తప్ప ఇంత కుట్రలు పన్నడానికి ఇళ్ళల్లో డైలీసీరియళ్లు చూడరు. కాబట్టి అయ్యా సీనియర్ బ్లాగర్లూ కొద్దిగా ఓపికవహించండి. అనవసరంగా ఆవేశపడి నిందించొద్దు. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవరూ సమర్థించడంలేదు.
కొందరి తోకలకు నిప్పంటించాలంటే ముసుగు తప్పదు కదా!! ఐతే తెగేదాకా లాగటం అనవసరం అని మదీయ అభిప్రాయం
ReplyDeleteఈ టపాకు కూడా నకిలీ వ్యాఖ్యలు రాగలవు జాగ్రత్త. ;-). :))
ReplyDeleteఉబుంటు సర్వర్ వాడటం ద్వారా బ్లాగుల్లో నకిలీ వ్యాఖ్యలు రాకుండా చెయ్యొచ్చు.
ReplyDeletePraveen
ReplyDeleteHow?
Explain.
ha ha haaaaaaaa...If everything is fake why not comments??---Siva Kumar.K
ReplyDeleteబ్లాగుల్లో రాసుకునేవి వ్యక్తిగత అభిప్రాయాలైనా అవి ఒక ప్రచురించబడిన కథ లేక వ్యాసం వంటివి. దానిని బ్లాగ్మిత్రులంతా చదిని స్ఫందించాలనుకోవడం సహజం. మనం రాసిన విషయం అందరి మన్ననలు పొందాలని మన కోరిక. కానీ కొన్ని సందర్భాలలో మన అభిప్రాయాలు ఇతరులకు నచ్చకపోవచ్చు, లేదా వారి మనసుని గాయపరచవచ్చు. అటువంటప్పుడు వీలైనంత వరకు మన అభిప్రాయాన్ని వివరించేప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఎవరైనా బాధపడ్డారని తెలిసినప్పుడు క్షమాపణలు చెప్పడం మన కనీస ధర్మం. మన బ్లాగులో కామెంట్ల రూపంలో ఎవరైనా మోతాదుకు మించి కఠిన భాషను ఉపయోగించినప్పుడు తొడగొట్టి తగాదాకు దిగకుండా వారు మన బ్లాగు వీక్షించి తమ విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు చెప్పడం మంచిదని నా అభిప్రాయం.
ReplyDelete