కలిసే ఉందాం

తెలంగాణా- హైస్కూల్లో చదువుకునే రోజుల్లో విన్నా మొదటిసారి ఈపదం. అప్పుడు మాసారు చెప్పాడు మనరాష్ట్రంలో మూడుప్రాంతలురా అబ్బయ్యా. కోస్తా, తెలంగాణా మరియు రాయలసీమ అని ఉన్నాయి అని మాపులో చూపెట్టాడు. ఆతరవాత మనం అరవోడినుంచి రాష్ట్రాన్ని ఎలా సాథించుకుంది తెలిసొచ్చింది. మనపుణ్యమాని మరిపదిభాషలకి సొంతగూళ్ళు ఏర్పడ్డాయి. ఇక్కడదాకా కథబానే ఉంది. మిగతాది మనకందరికీ తెలిసిందే. కాకపోతే నాకు చిన్న అనుమానాలున్నాయి. సందేహ నివృత్తి చెయ్యగలరా?


ప్రత్యేకరాష్ట్రం అడిగారు బానే ఉంది. మద్యలో పొట్టిశ్రీరాములు ఏమిచేశాడు? ఆయనని ఎందుకు కించపరచడం? ఆయన నిరాహారదీక్షని శాంతియుతంగానే చేశాడు. కాంగ్రెస్సువాడయినా అథిష్టానానికి భయపడలేదు. అన్నింటికీమించి తెలుగోళ్లకి ఏమికావాలో చెప్పాడే తప్ప తమిళుడిని పల్లెత్తుమాటన్న దాకలాలు లేవు. ఆయన చనిఫొయాకే గొప్పతనం తెలిసొచ్చింది జనాలకి. ఆతర్వాతే విగ్రహాలు వెలిశాయి. ఇవేవీ ఆయన బతుకున్నప్పుడు కోరుకుందికాదు. ఆయనచేసిన పోరాటం 'విశాలాంద్ర‌' కొరకే తప్ప తెలంగాణా విలీనం కోసంకాదు. ఆంద్రరాష్ట్రం ఆంద్రప్రదేశ్‌గా మారింది ఆయనపోయిన తర్వాత కొన్నేళ్ళకి. మరి ఆయనపై ఎందుకు ద్వేషం?


తెలంగాణా ఆంద్రలో విలీనంకాకముందు ఏంత అభివృద్ధిని సాథించింది? అక్కడికెళ్ళి ఇతరులు బాగుపడ్డారు. ఇదినిజం. మరీ అంత అసూయైతే ఎలా? ఏమి వేరేప్రాంతాలకి వెళ్ళినోళ్ళు బాగుపడకూడదా? తెలంగాణానుంచి నాగపూరు, ముంబాయికి వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళెంతమంది? బెంగుళూరులో ఉద్యోగాలుచేసేవాళ్లలో తెలంగాణావాళ్ళు లేరా? ఆప్రాంతం వెనకబాటుతనానికి వేరెవరోకాదు అక్కడి భూస్వామ్యవ్యవస్థే కారణం. వాళ్లు అటు మద్యతరగతివాళ్ళను ఎదగనీకుండాచేసి ఇంకోపక్క కోట్లలో పన్ను, లక్షల్లో బిల్లులు ఎగవేసి పబ్బం గడుపుకున్నారు. దానికి సామాన్యుడు బలయ్యాడు. తొంభైలకి ముందు అక్కడ సక్రమంగా బిల్లులు కట్టేవాళ్ళేంతమంది? ఇది నేను(కోస్తావాడిని) చెప్పేదికాదు. కరీంనగర్లో పుట్టిపెరిగిన నాస్నేహితుడు చెప్పిన కారణం.

.
తెలంగాణా ఎదగగలేదన్నది నిజం. కానీ దానికి ఈతరప్రాంతాలవాళ్లని బాద్యుల్ని చెయ్యడమేంటి? ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాలేదు. మనతెలుగోడని గర్వంగా చెప్పుకునే పీవీకూడా ఈప్రాంతంవాడెకదా?(ఆయన్ని కేసీఆర్ కలిసినప్పుడు అంతగా స్పందించలేదని విన్నా అప్పట్లో)


కేసీఆర్ని తిడితే తెలంగాణాని తిట్టినట్లా? వైఎస్నో, బాబునో చివరికి మన్మోహన్ని తిట్టినా ఒకరాజకీయ నాయకుడిని తిట్టినట్లు. కానీ అదేంచిత్రమో కేసీఆర్ దగ్గరికొస్తే మేటర్ మారిపోద్ది. నిజానికి ఉద్యమానికి కేసీఆర్ ఒకగుదిబండ. రాజకీయంగా నెగ్గుకురాలేక ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీచుడు. వాడివల్ల నష్టపోయినోడు తెలంగాణావిద్యార్థే కదా? అలాంటప్పుడు కనీసం మాటమాత్రానికైనా మంచిచెప్పాలి కదా? చోద్యంచూస్తూ వాళ్లని వాడుకున్నాడు. ఎవడండీ ఈరోజుల్లో చదువులు పక్కనపెట్టి ఉద్యమాలంటూ తిరిగేది? ఎవడి ఒత్తిళ్ళు వాడివి. ఎవడిపోటీ వాడిది. ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణా వేరు. కేసీఆర్ వేరు. తెలంగాణా కేసీఆర్ మీద ఆథారపడలేదు. కేసీఆరే తెలంగాణాపై ఆధారపడ్డాడు.


విడిపోతాం అనుకున్నోళ్ళు విడిపోండి. దానికోసం ఇతరులపై బురదజల్లడం ఎందుకు? మద్రాసునుంచి ఇక్కడికొచ్చారు మీకోస్తావాళ్ళు అంటుంటారు కొంతమంది. అవును ఎక్కడ అవకాశాలుంటె అక్కడికొస్తాం. హైదరాబాదుకెలా వెళ్తున్నారో బెంగుళూరు, నోయిడా, గుర్గావ్ కీ అలానేవెళ్తున్నారు. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈసమస్య గురించి ఎవడు మాట్లాడినా వాళ్లవాళ్ళ లాభనష్తాలకు అనుగుణంగానే మాట్లడుతారు. కోస్తావాళ్లయినా, సీమవాళ్లైనా చివరికి తెలంగాణావాళ్ళయినా. ఎవడూ గతిలేక రావట్లేదు అక్కడికి.


అక్కడ అవకాశాలు సృష్టించిమ్దెవరు? ఇదినేను వాదించడానికో తగువులాటకో కాదు.వాదించుకునేందుకు రెండుపక్కలా బలమైన పాయింట్లు ఉంటాయి.లేకుండే ఇవ్వాలా వద్దా అన్న విషయంపై ఇంతనాన్చుడు జరగదు.
తెలంగాణా కావలనుకున్న వాళ్లకి తెలుగుతల్లి విగ్రహాలతో, గీతాలతో ఏం పని? వాటిలో ఎక్కడైనా తెలంగాణాని తక్కువచేసి చూపారా? ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి విడిపోయేప్పుడు తమిళభాషని, అక్కడి సంస్కృతిని ఎవడూ హేళనచెయ్యలేదే? మనకేమి కావాలో అడగడంలో ఒక పద్దతి ఉంటుంది. ఆపద్దతి తెలీని మూర్ఖులచేతిలోకి ఉద్యమం పోవడమే ఈవిషసంస్కృతికి మూలకారణం. వీళ్లచేతిలో తెలంగాణా ఉంటె ప్రత్యేకరాష్ట్రమైన తర్వాత దానికి ఒరిగేది శూన్యమే.




తెలంగాణాకు మించిన కరువు రాయలసీమలో ఉంది. ఉత్తరంద్రలోనూ అదేస్థితి. నెల్లూరు,ప్రకాశాలు పర్వాలేదు. అంతకుమించి కోస్తాలో ఇరగదీసేంత అభివృద్దేమీ లేదు. అసలీ గందరగోళానికి మూలకారణం కృష్ణా, గుంటూరోళ్ల నోటిజిలే కారణం. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదినిజం. ఇక తెలుగు అనే విషయానికొస్తే నిజంగా తెలంగాణావాళ్లంత భాషాభిమానులు ఉండరు. మనఊళ్ళలోకి ఇంగ్లీషుమీడియమొచ్చి ఎన్నేళ్ళయింది. ఈమద్యలో మనభాషెంత మారింది? మరి శతాబ్దాలుగా నిజాంహుకుం మద్యన ఉర్దూలోనూ చదువుతూకూడా అక్కడ తెలుగుబట్ట కడుతుందంటే ఎవడిగొప్ప.
చివరిగా- " తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."

41 comments:

  1. ఇక్కడ గుదిబండ హైదరాబాద్ నగరమే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనీ నిర్లక్ష్యం చేసి మిగుల్చుకున్న డబ్బులతో డెవెలప్ చేసిన నగరం అది. హైదరాబాద్ ని తెల్ల ఏనుగులా మేపడం పాలకవర్గం వాళ్ళ తప్పు. మరి పాలకవర్గాన్ని విమర్శించకుండా హైదరాబాద్ ని తమ రాష్ట్రానికి తీసుకుపోతున్నారంటూ తెలంగాణావాళ్ళని విమర్శించడం ఎందుకు? హైదరాబాద్ రాజధాని కాకపోతే మెజారిటీ కోస్తా ఆంధ్ర ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. శ్రీకాకుళం పట్టణంలో ఒక్క వ్యాపారి కూడా స్వచ్ఛందంగా షాపులు ముయ్యలేదు. గూండాలని చూసిన తరువాతే షాపులు మూశారు. గూండాలు వెళ్ళిపోయిన తరువాత షాపులు తెరిచారు. గూండాలతో బంద్ చెయ్యించడం ప్రజాస్వామ్యం కాదు. తెలంగాణా పై ద్వేషం లేకుండా బతుకుతున్నమాకు సమైక్యవాదం అంటూ లేనిపోని కబుర్లు చెప్పి తెలంగాణా వ్యతిరేక ప్రాంతీయ గజ్జి ఒంటబట్టించుకోండి అని చెప్పడం ఎందుకు? తెలంగాణావాళ్ళకి సొంత రాష్ట్రం ఏర్పరుచుకుని వాళ్ళ బతుకువాళ్ళు బతికే స్వేచ్ఛ ఉంది. ప్రాంతీయ గజ్జి ఒంటబట్టించుకుని ఒక ప్రాంతం వాళ్ళ స్వేచ్ఛని హరించడం ఏ తత్వవేత్త నేర్పాడు? వోల్టైర్ నేర్పాడా? టాల్స్టాయ్ నేర్పాడా?

    ReplyDelete
  2. Superb...100% agrees with you.

    ReplyDelete
  3. మరి కర్ణాటక బెంగుళూరుని, మహారాష్ట్ర ముంబాయిని ప్రమోట్ చెయ్యలేదా? ఒక్కహైదరాబాదేకాదు చరిత్రలో ఏనగరమైనా మిగతాప్రాంతాలనుంచి వచ్చిన వనరులతోనే ఎదుగుతుంది అది రోమ్ ఐనా, లండన్ ఐనా. హైదరాబాదుని పట్టించుకోనంతకాలం ఇదేనా మనరాజధాని అని విమర్శించారు. అప్పుడేమే ప్రతిచిన్న దానికీ మద్రాసుతో పోల్చేవాళ్ళు. మరి ఆఊరు ఎదిగిందేలా? తెలుగోళ్ళు, కన్నడిగులు అందులో భాగస్వాములుకాదా?
    వాళ్ళను విడిపోవద్దు అని అంటున్నానేగానీ స్వేచ్చని కోల్పోమని ఎక్కడైనా చెప్పానా? ప్రాంతీయగజ్జిగురించి నేను చెప్పిందాన్ని ఒకసారి గమనించండి

    ReplyDelete
  4. ప్రవీణ్ గారు, భాగ్యనగరమే పెద్ద సమస్య అయితే, దాన్నికూడా మూడు ముక్కలు చేస్తే సరి. ఏమంటారు? ఏ ప్రాంతమోడు అభివృద్ధి చేసుకున్న ప్రాంతాన్ని వాడు పట్టుకుపోతే సరిపోతుంది. దానికి ఇంత గొడవెందుకూ.

    పాతబస్తీని తెలంగాణ వాళ్ళకు,
    హైటెక్ సిటీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని రాయలసీమవాళ్ళకు,
    మిగిలినదంతా అంటే ట్యాంకుబండు, ఐమాక్స్, అట్టాగే రామోజీ ఫిల్మ్ సిటీ దాకా కోస్తావాళ్ళ కిచ్చేస్తే సరిపోతోంది.

    అప్పుడు ఎవడి భాగం వాడు పంచుకున్నట్టు అవుతుంది. హ్యాపీగా అన్నదమ్ముల్లా ఒకే చోట ఉంటూ, విడివిడిగా ఉండొచ్చు. :) :) :)

    ReplyDelete
  5. బ్రిటన్, ఇటలీ ఇప్పుడు కూడా సామ్రాజ్యవాద దేశాలే. ఆ దేశాలలోని నగరాలు పేద దేశాలని దోచుకున్న డబ్బుతో డెవెలప్ అయ్యాయి. ఉత్తర అమెరికా (USA & కెనడా)లోని నగరాలు లాటిన్ అమెరికా (దక్షిణ అమెరికా దేశాలు & మెక్సికో)ని దోచుకోవడం వల్ల వచ్చిన డబ్బుతో డెవెలప్ అయ్యాయి. సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాలని దోచుకోవడం వల్ల వచ్చిన డబ్బుతో నగరాలని డెవెలప్ చేసుకుంటాయి. సెమి-ఫ్యూడల్ దేశాలు పల్లె ప్రాంతాలూ, చిన్న పట్టణాలని దోచుకోవడం వల్ల వచ్చిన డబ్బుతో నగరాలని డెవెలప్ చేసుకుంటాయి. USAలో 98% మంది పట్టణ ప్రాంతాలలో ఉంటున్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ఇప్పటికీ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్నారు.

    ReplyDelete
  6. కదా? మరి ఈప్రపంచం ఎలాసాగుతుందో తెలిసీ నువ్వు ఇదేదో ఒక్క హైదరాబాదులోనే జరుగుతున్నట్టు మాట్లాడతావేమిటి? వీటన్నికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఉత్పత్తి. దాన్ని కేంద్రీకరించటమో లేక ఉత్పత్తిచెమ్దిన వస్తువును అమ్మటంలో కేంద్రీకరణో జరిగినప్పుడే ఈనగరాలు పుట్టుకొస్తాయి. ఈ ఉత్పత్తి పెంచేక్రమంలొ జరిగేవే ఇవన్నీ. నేనేమీ అర్థశాస్త్ర మేథావినికాదు. ఈవిషయంలో వాదిమ్చలేను.

    ReplyDelete
  7. @ప్రవీణ్: ఇప్పుడు తెలంగాణా నాయకులు భాగ్యనగరాన్ని దోచుకోవాలనుకుంటున్నారు. ఈ వ్యాక్యాన్ని చేర్చడం మర్చిపోయినట్లున్నారు. గమనించుకోండి.

    ReplyDelete
  8. మన రాష్ట్రంలో ఉత్పత్తి ఎందులో పెరిగింది? ఐ.టి. & టూరిజంలో మాత్రమే కదా. 1975లో జలగం వెంగళరావు గ్రామీణ ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు పెట్టించాడు. 1990 తరువాత అవి మూతపడ్డాయి. 1999 తరువాత కార్పరేట్ ఐ.టి. కంపెనీలు వచ్చాయి. అవి కూడా హైదరాబాద్ ని మాత్రమే అభివృద్ధి చేశాయి. హైదరాబాద్ ఐ.టి. అభివృద్ధిని చూసి నల్లమల అడవులలోని చెంచులూ, ఆదిలాబాద్ అడవులలోని గోండులూ, కిన్నెరసాని అడవులలోని కోయలూ, ఎలుకలు పట్టుకుని తినే యానాదులూ, పందులు పెంచే ఎరుకలోళ్ళూ కూడా మురిసిపోతారు కదా!

    ReplyDelete
  9. ## తెలంగాణా కావలనుకున్న వాళ్లకి తెలుగుతల్లి విగ్రహాలతో, గీతాలతో ఏం పని? ##

    అవును, తెలంగాణా కావలనుకున్న వాళ్లకి తెలుగుతల్లి విగ్రహాలతో, పొట్టి శ్రీరాములు విగ్రహాలతో , గీతాలతో ఏం పని లేదు.
    ఆ విగ్రహాలను తెలంగాణా లో నెలకొల్పడం లోనే వుంది కుట్ర.
    మద్రాసు రాష్ట్రం నుంచి ఆంద్ర రాష్ట్రం ను విడదీసిన పొట్టి శ్రీరాములు మీద మీకు అభిమానం వుంటుంది కానీ మాకెలా వుంటుంది ?
    తెలుగు తల్లి విగ్రహాలను కోస్త ఆంధ్ర జిల్లాల్లో ఒక్కటైనా లేదేమి? మీకు అక్కరలేదా?
    సమైక్యతా విషాన్ని మాకు ఇంజెక్ట్ చేసేందుకే, మీ మోసాలను మేము గమనికాకుండా మా కళ్ళకు గంటలు కట్టేందుకే కదా వాటిని కావాలని తెలంగాణా లో నెలకొల్పింది. మాకు కోపం విగ్రహాల మీద కాదు దాని వెనకున్న కపటం మీద.

    ReplyDelete
  10. రాజన్నగారూ! గాంధీవిగ్రహాలు సబర్మతీ ఆశ్రమంలోనే, దండిగ్రామంలోనే ఉండాలి అంటే ఎలాఉంటుంది? మీరే ఆలొచించండి. అలానే పొట్టిశ్రీరాములుగారు కూడా. ఆయనవల్ల కేవలం అంధ్రులకే కాదు ఎన్నోభాషలవాళ్లకి మేలు జరిగింది. నిజానికి ఆయనవల్ల రాష్ట్రాలను ఎలా విభజించాలి అనే సమస్యకు పరిష్కారం లభించింది. అలాంటాయన విగ్రహం తెలంగాణాలో ఉండకూడదా? నెల్లూరుకి ఆయనకి పెద్దగాబంధుత్వం లేకపోయినా మాజిల్లాకి ఆయనపేరు పెట్టారుగా? అందుకు మేము సమ్మతించాముగా? తెలుగుతల్లి విగ్రహాలు కోస్తా, తెలంగాణలలోనే కాదు సీమలోకూడా ఉన్నాయికదా. ఇటీవలి కాలంలో తెలంగాణాలో పెరగడం నిజమే. సమైఖ్యతను కోరుకునే వాళ్ళె ఇందుకు ప్రయత్నించుంటారు. హైదరాబాదు రాజధాని అయినప్పుడు అక్కడ పొట్టిశ్రీరాములు, తెలుగుతల్లీ ఉండడం తప్పా?

    ReplyDelete
  11. ప్రత్యేక తెలంగాణా వద్దు అనే విషయంలో మీతో నేను విభేదిస్తున్నా కూడా, మీ వ్యాసం చాలా బాగుంది అని చెప్పకుండా ఉండలేకపోతున్నా.

    ReplyDelete
  12. ______________________
    తెలంగాణా వేరు. కేసీఆర్ వేరు. తెలంగాణా కేసీఆర్ మీద ఆథారపడలేదు. కేసీఆరే తెలంగాణాపై ఆధారపడ్డాడు.
    ______________________

    _______________________
    విడిపోతాం అనుకున్నోళ్ళు విడిపోండి. దానికోసం ఇతరులపై బురదజల్లడం ఎందుకు?
    _______________________

    నువ్వు చెప్పినవి అక్షర సత్యాలు సోదరా.

    ReplyDelete
  13. తెలంగాణావాళ్ళు విడిపోతాం అంటే వద్దు మాతో కలిసి ఉండండి అని బలవంతం చెయ్యడం ఎందుకు? 1983 టైమ్ లో కూడా హైదరాబాద్ లో కోస్తా ఆంధ్ర ఉద్యోగులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తాగు నీళ్ళు కూడా సరిగా దొరకని తెలంగాణా పల్లెలలో వ్యవసాయం కష్టం. వ్యవసాయం సరిగా లేని తెలంగాణాలో అక్కడి పల్లె ప్రజలకి వచ్చే ఆదాయంతో చదువులు కష్టం. అంతంతమాత్రం చదువులతో ఉద్యోగాలు దొరకడం కష్టం. తెలంగాణాలో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెయ్యరు, అక్కడ విద్య వికసించదు, తెలంగాణా విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు పెరగవు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టకుండా హైదరాబాద్ షోకులకే డబ్బులు తగలేస్తారు.

    ReplyDelete
  14. బలవంతం చెయ్యడంకాదు. నచ్చచెప్పేందుకు చూశారు. పక్కనున్న కర్నాతకలో కన్నడిగులేకాదు దాని పశ్చిమతీరం వెంబడి తుళుభాషను మాట్లాడేవారున్నారు. అయినా వారిమద్య ఎప్పుడు వేర్పడాలన్న ఆలోచన రాలేదు. ఇక్కడ కలిసుండటం ఎందుకు అంటే
    ౧. రాజకీయకారణాలు- ముప్పైఏళ్లక్రితం మనమాటవినేనాథుడేలేడు. డిల్లెవాళ్లకి దక్షిణాది అంటే కేవలం తమిళ్నాడు మాత్రమే. అందువల్ల మనంఎంతోకోల్పోయాము. ఇప్పుడు మనమాట వింటిన్నారు అంటే తెలుగువాళ్ళంతా ఒకరాష్ట్రం అన్నదానివల్లే. మనకు ఐఐటీ రావడానికి ఎంతకష్తపడాల్సి వచ్చింది? అదే తమిళ్నాడులో ఎన్నిసంస్థలు, కర్మాగారాలు ఉన్నాయి? ఆఐఐటీకోసం తిరిగినవాళ్లలో రాష్ట్రంలోని అన్నిప్రాంతాలవాళ్ళూ ఉన్నారు. ఇప్పటికే ఎన్.ఐటీ వరంగల్లో ఉన్నా ఐఐఅటీని తెలంగాణాలోనే ప్రతిపాదిమ్చాంకదా? బీహెచ్‌ఈఎల్, ఆయుథాలఫాక్టరీ ఉన్నవి అక్కడేకదా? మరి ఇలాంటిసంస్థలను మనంవిడిపోయాక సంపాదిమ్చుకోగలమా?
    ఆమిగిలినవాటిని జవురుకునేందుకు తమిళ్నాడువాళ్లు ప్రయత్నిస్తున్నారు. నేను అక్కడా ఉన్నప్పుడు ఒకపత్రికలో వచ్చిన వ్యాసం సారాంశం: "మనకు దక్షిణాదిలో పోటీఇచ్చే రాష్ట్రం ఆంద్రా. తెలంగాణా విడిపోతే అది బలహీన పడుతుంది. మనకు మేలుజరుగుతుంది." నాఅనుమానం చిదంబరం ఈకారణం వల్లే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టున్నాడు.
    ౨. నదీజలాల సమస్యలు: కృష్ణ, గోదావరులే కాక రెండుప్రాంతాలగుండా ప్రవహించేనదులు ఇంకా చాలా ఉన్నాయి. వీటిపంపిణీలో వచ్చే రాజకీయ ఇబ్బందులు నాయకులు పబ్బంగడుప్పుకునేందుకే తప్ప జనాలు బాగుపడేందుకుకాదు.
    మీరంటున్న తాగునీటి, సాగునీటి ఎద్దడి తెలంగాణాతో ఎలా సాద్యపడుతాయో అర్థం కావట్లేదు. చూడండి నదులు ప్రవహించేదిశ, సాగుబడికి అనుకూల పరిస్థితులు ఆప్రాంతపు నైసర్గికస్వరూపాన్ని బట్టి ఉంటుంది, నిజానికి ఈవిషయంలో తెలంగాణావాసులేకాదు, దేశంలో ఎంతోమంది దురదృష్టవంతులు.(సీమప్రజలుకూడా). ఇప్పటికే ప్రత్యామ్న్యాయంగా ప్రాజెక్టులు కడుతున్నారుగా?
    హైదరాబాదు షోకులకి పెట్టినడబ్బు ప్రభుత్వ ఆదాయంకాదు. అప్పుచేసినవి. అవి వచ్చిచేరిమ్ది కోస్తావాళ్ల జేబులోకికాదు. విదేశీకంపెనీలకి. ఇది ఒక్కభాగ్యనగరమేకాదు దేశంలోని అన్నిమెట్రోనగరాల్లో జరుగుతున్నదే.ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యప్రమాణాలు అలా ఉన్నాయి. మనఖర్మ. ఈసమస్యలలో పరిష్కరించ గలిగేవి కలిసున్నప్పుడే పరిష్కరించగలం. పరిష్కారంలేనివి విడిపోయిన తర్వాత పరిష్కరించలేము.

    ReplyDelete
  15. దక్షిణ ఒరిస్సాతో పోలిస్తే తెలంగాణాలో కొండలు తక్కువే. దక్షిణ ఒరిస్సాలో కూడా ఇరిగేషన్ ప్రోజెక్టులు కట్టగా లేనిది తెలంగాణాలో ఇరిగేషన్ ప్రోజెక్టులు కట్టడం కష్టమా? విజయవాడ-కాజీపేట రైల్వే లైన్ పక్కన ఉన్న ప్రాంతం, వరంగల్-కరీంనగర్ రోడ్డు పక్కన ఉన్న ప్రాంతం నాకు బాగా పరిచితమే. తెలంగాణాలో ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు కూడా చూశాను. ఈ జిల్లాలలో సాగు నీటి సౌకర్యాలు పెంచడం సాధ్యమైనా పెంచలేదు. తెలంగాణా ఇరిగేషన్ ప్రోజెక్టులకి డబ్బులు ఖర్చు పెడితే హైదరాబాద్ షోకులకి డబ్బులు రావు.

    ReplyDelete
  16. చూడబ్బాయ్ నీకు ప్రాజెక్టులు గురించి కొంచెంవివరంగా చెప్పాలి. ముందుగా డ్యాంలు ఎప్పుడైనా కొండలు ఎక్కువగా ఉన్నప్రంతాల్లోనే కడుతారు. శ్రీశైలంలాగా. అర్థం అయ్యిందా. మరొక ముఖ్యమైన అంశం భూగర్భం. ఇంకాకొన్ని సాంకేతిక అంశాలున్నాయి. నేను చెప్పలనుకున్నది ఏమిటమ్టే నీళ్ళున్న ప్రతిచొటా ప్రాజెక్టులు కట్టలేం. అలాగయితే గంగానదిమీద ఎన్నిప్రాజెక్టులు కట్టొచ్చు? మరి అంతపెద్దనదిపైన ఎందుకుకట్టలేదు?
    ఆప్రాంతాల్లో సాగునీటి సదుపాయలను అభివృద్ధి చెయ్యకుండా అడ్డూకుంది అక్కడి భూస్వాములే తప్ప ఇతరులుకాదు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎక్కువభాగం తెలంగాణాకి రాకుండా అడ్డుకుంది అప్పటి దొరలే. అక్కడకి నీళ్ళొస్తే జనాలేక్కడా ఎదిగిపోతారో అని వాళ్ళె ఆపించారు. ఆప్రాంతం ఎదగలేదు. నిజమే అందుకు ఇతరుల్నెందుకు విమర్శించడం?
    హైదరాబాదుకి సోకులెక్కువ చేశాడానేగా బాబుని పీకేసింది జనాలు.

    ReplyDelete
  17. హిల్లీ టెర్రెయిన్స్ లో డ్యామ్ లు కట్టడం సులభమే కానీ ఇరిగేషన్ కాలువలు తవ్వడం సులభం కాదు. తెలంగాణాలో ప్లెయిన్ టెర్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం, మడ్డువలస ప్రోజెక్టులు ఉన్నవి కూడా ప్లెయిన్ టెర్రెయిన్స్ లోనే.

    ReplyDelete
  18. బ్రదరూ.. సూపర్బ్.. ఈ మద్యకాలం లొ ఈ టాపిక్ మీద ఎవిధమయిన వెటకారాలు లేకుండా మనస్పూర్తిగా , కాస్త అర్ధవంతం గా రాసిన పొస్ట్ ఇదే...

    ReplyDelete
  19. అయ్యా ప్రవీణ్! నాదురదృష్టం కొద్దీ నేను సివిల్ ఇంజనీరుని.కొద్దిగా నాబాధనుకూడా విను. తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టేందుకు అనుకూలమైన ప్రాంతల్లో ప్రతిపాదనలు ఎప్పుడొ జరిగాయి. అలా వచ్చినవే శ్రీరాంసాగర్ మొదలైనవి. సాంకేతిక అంశాలపై అవగాహన్లేని మీడియా లాగా మాట్లాడకు. టెర్రైన్ అనే పదాన్ని పట్టుకుని స్టేట్‌మెంట్లు ఇవ్వకు. అంతకుమించిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోకకుండా ప్రాజెక్టుకడితే పదేళ్ళకి జిల్లాలు తుడిచిపెట్టుకు పోతాయి. ఇంకో విషయం- ఇరిగేషన్ కాలువలకు టెర్రైన్తో సంబంధంలేదు. కావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవచ్చు. రిజర్వాయరుకి క్కొండలుకావాలి. లేదంటే జిల్లాలు మునిగిపోతాయి. ఇక ఆపు. నేణువాదించేందుకు కాదు అని ముందేచెప్పా. నాబ్లాగులో ఎప్పుడూ వాదనలు జరగలేదు. నాకు హిట్లతో, కామెంట్లతో కడుపునిండదు.

    ReplyDelete
  20. కొండ ప్రాంతాలలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్టులు కట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. తెలంగాణాలో నేను తిరిగిన మైదాన ప్రాంతాలలో కూడా కాలువలు ఎక్కువ కనిపించలేదు. తెలంగాణా మైదానాలలో ఉన్న భౌగోళిక పరిస్థితులే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూరిజ మండలాలలో ఉన్నాయి. బూరిజ మండలంలో నారాయణపురం ప్రొజెక్ట్ కాలువలు ఎలా కట్టారు? రైల్వే లైన్ వేసేటప్పుడు కూడా భౌగోళిక పరిస్థితుల మార్పుల వల్ల ఖర్చులో తేడా వస్తుంది. రిజర్వాయర్ కి కొండలు కావాలంటున్నావు. మరి కొండ ప్రాంతాలలో కూడా ఇరిగేషన్ ప్రోజెక్టులు ఎందుకు కట్టలేదు? బ్యారేజ్ లైనా కట్టొచ్చు కదా? UP, బీహార్, పంజాబ్ లలో ప్లెయిన్ టెర్రెయిన్స్ లో బ్యారేజిలు లేవా?

    ReplyDelete
  21. Excellent post.I do agree.

    ReplyDelete
  22. మీరెంత సివిల్ ఇంజనీరింగ్ చదివితే మాత్రం, గట్టిగా నాలుగో గలాసు కూడా చదవని మా ప్రవీణ్ అన్నయ్ కంటే మీకెక్కువ తెలుసంటార? తెలిసి తెలిసి .....మీద రాయివెస్తారా? ఎంతయినా మీ నెల్లూరోళ్లకి ధైర్యమెక్కువ అని feel అవుతుంటారంటే ఎదో అనుకొన్నా? :)

    సెటైర్లు పక్కన పెడితే , టపా బాగా వ్రాశారు .

    ReplyDelete
  23. చైతన్య గారూ మీ వ్యాసం బావుంది.


    అయ్యా ప్రవీణూ మరి మీరు చెబుతున్న అన్ని కండీషన్లు దారిద్ర్యం పరంగా మాకూ వర్తిస్తాయి. మేము ప్రత్యేక రాయలసీమ కోరవచ్చా? మీ అభిప్రాయం సెలవిస్తారా?

    ReplyDelete
  24. ఉత్తరాంధ్ర బాషలో చెపుతున్నాను "ఐదవ తరగతి గుంటల చేత సమైక్యాంధ్ర అనిపించిన బడి పంతులుకి రాజకీయాలు తెలుసా?"

    ReplyDelete
  25. చైతన్య గారి స్పేస్ ను అడ్డదిడ్డంగా వ్యక్తిగతంగా వాడే కుసంస్కారం నాకు లేదు. మీ తలతిక్క సమాధానాలు డొంకతిరుగుడు కాదు. సూటిగా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. పిచిపిచ్చి జవాబులకు ఇది నా ప్రపంచం కాదు. వెర్రి వాదనలు వద్దని చైతన్య ముందే చెప్పారు. మీరింకా ఐదవతరగతి పిల్లల భ్రాంతి లోంచి బయటపడలేదు. అవి చెప్పించిన మాటలు కాదు. మీలాగా వోలు మొత్తం నాలెడ్జి ఈ పెపంచికంలో ఏ ఎదవకు ఉంటుందిలే.

    chitanuya gaaroo sorry....

    ReplyDelete
  26. చూడు ప్రవీణ్ తెలంగాణా మైదానంకాదు. పీఠభూమి. అందువల్ల అక్కడ ప్రభావితం చేసే అంశాలువేరే. ఎక్కడ డ్యాం కట్టాలో బారేజీలు కట్టాలో నిర్ణయించేది కేంద్రీయ జలవనురుల సంస్థ. వాళ్లకు తెలుసు ఎక్కడ ఏదికట్టాలో. ఇది కోస్తావాళ్ళచేతిలోనో, తెలంగాణావాళ్లచేతిలోనో కాదు ఉండేది. అర్థం అయిందా.
    చిన్న ఉదాహరణ- మాఊరుండేది స్వర్ణముఖి ఒడ్డున. రెండేళ్ళకిందటివరకు వానాకాలంవస్తే వారంరోజులు మాఊరులంక గ్రామం. 'నేదురుమల్లి' పేరు వినేఉంటావు. ఆయనది మాఊరే . ఇరవైయేళ్ళు పోరాడి (తన పదవిపోగొట్టుకున్నా సరే) మాఊరికి బారేజీ కట్టించాడు. అలా సొంతూరికోసం తిరిగే నాయకులు తెలంగాణాలో ఉంటే ఇప్పటికి దాని పరిస్థితి వేరేలా ఉండేది.

    ReplyDelete
  27. మరాఠ్వాడా కూడా పీఠ భూమే. మరాఠ్వాడాలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ బ్యారేజిలు కూడా కడుతోంది కానీ ఇక్కడ ప్రభుత్వం సక్రమ బ్యారేజిలు కూడా కట్టడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న చోట్ల భారీ డ్యాములు కట్టింది. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణాలో భూకంప అవకాశాలు తక్కువే.

    ReplyDelete
  28. అయ్యాబాబూ ప్రవీణ్ నువ్వువిన్న ఈరెమ్డూమూడు అంశాలే మొత్తంకాదయ్యా. బొచ్చాబోలెడు ఉన్నాయి. అవన్నీ టపాల్లో చర్చించేందుకు మనం విశ్వేశ్వరయ్యలో కేఎల్‌రావులమోకాదు. ఈఅంశాలన్నీ ఒక్కోప్రాజెక్టుపై ఒక్కోస్థాయిలో ప్రభావాన్ని చూపుతాయి. అవన్నీ కలిపిచూస్తేకానీ అంచనావెయ్యలేం.
    నీతో కొద్దిగా కాలక్షేపం చేద్దాం అని ఇప్పటిదాకా ఊరుకున్నా. ఇన్ని ప్రశ్నలేశావుగా? ఒకప్రశ్న అడుగుతా. జలయజ్ఞంలో తెలంగాణాలో వస్తున్న ప్రాజెక్టులెన్ని?
    జనాలకోసం- మనదేశంలో ప్రాజెక్టులు అత్యధికంగా ఉన్నరాష్ట్రం మహారాష్ట్ర. దాదాపు పదిహేడువందలున్నాయి అక్కడ!!! దానికికారణం అక్కడిభూగర్భం. ఆప్రాంతం,మద్యప్రదేశ్ మరియు ఇతరప్రాంతాలుకొన్ని కలిపితే వచ్చేదాన్ని పెనిన్సులర్ రీజియన్ అంటారు. ఇది ఉపఖండంలోకెల్లా అత్యంత స్థిరమైన ప్రాంతం. కాబట్టే ఇక్కడ జరిపే భౌగోళికసర్వేలకు మూలస్థానంగా పెట్టె బెంచ్‌మార్కులు ఈప్రంతంలో ఎక్కువగా ఏర్పాటు చేశారు.

    చూడుప్రవీణ్ ఇదినాబ్లాగు. నాఇష్టం వ్చ్చిందిరాస్తా. నువ్వెవరివి? మరోసారి వ్యాఖ్యానంచావంటే బాగోదు. వెళ్ళి నీబ్లాగులో తెలంగాణా-సమైక్యాంద్ర మద్యన నలిగిపోయేవాళ్లపై ***కథలురాసుకో.

    ReplyDelete
  29. @ అజ్ఞాత ౧,
    @కొండముది సాయికిరణ్,
    @గణేష్,
    @మంచుపల్లకీ,
    @అజ్ఞాత ౨,
    @ అజ్ఞాత ౩,
    @ జీవని
    అందరికీ పేరుపేరునా దన్యవాదాలు. ఇంత సున్నితమైన అంశంపై రాసేందుకు చాలాకాలం ఆలోచించాను. మీరిచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  30. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  31. యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
    see this link for answer

    http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html

    ReplyDelete
  32. అది ఇప్పుడు చర్చించాల్సిన విషయంకాదు కదండీ.
    నాకో ఆలోచన వచ్చింది.
    ఇప్పుడు ఉత్తరకోస్తా వాళ్లకి మందుకావాలంటే యానాం వెళ్తారు. దక్షిణకోస్తా, రాయలసీమవాళ్లకి పుదుచ్చేరి, బెంగుళూరు ఉన్నాయి. మరి తెలంగాణావాళ్ళకి ఆసదుపాయంకూడా లేకపోతే ఎలా? కాబట్టి హైదరాబదుని కేం.పా.ప్రాం. చేస్తే వాళ్ళకి ఆసదుపాయం కలుగుతుంది కదా. కేసీఆర్కి కూడా ఇదిచాలా ఆనందాన్ని కలిగిస్తుందనుకుంటా.

    ReplyDelete
  33. >>ఇటలీ ఇప్పుడు కూడా సామ్రాజ్యవాద దేశాలే. ఆ దేశాలలోని నగరాలు పేద దేశాలని దోచుకున్న డబ్బుతో డెవెలప్ అయ్యాయి
    praveen!! you are awesome.

    ReplyDelete
  34. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
    ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
    1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
    1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
    1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
    1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
    1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
    1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
    1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
    1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
    1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
    1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
    1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
    1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
    1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
    1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
    1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
    1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
    1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
    1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
    1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
    1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
    1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
    1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
    1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
    విశేషాలు

    * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ

    ReplyDelete
  35. బాబాగారూ
    మీరిచ్చిన సమాచారం బాగుంది.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.మీరు చెప్పినట్లు యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ReplyDelete
  36. Posted January 14, 2010 at 5:17 AM | Permalink

    మన తెలుగు యానాం పర్యాటక కేంద్రంగా అభివృధ్ధీ చెందుతోంది.45 కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో ఈఫిల్ టవర్ కట్టబోతున్నారు.http://epaper.sakshi.com/Details.aspx?id=355564&boxid=28742358

    ReplyDelete
  37. How I missed your blog all these days!!? You have not linked to Koodali! or still I missed!!

    "...మనకేమి కావాలో అడగడంలో ఒక పద్దతి ఉంటుంది. ఆపద్దతి తెలీని మూర్ఖులచేతిలోకి ఉద్యమం పోవడమే ఈవిషసంస్కృతికి మూలకారణం. వీళ్లచేతిలో తెలంగాణా ఉంటె ప్రత్యేకరాష్ట్రమైన తర్వాత దానికి ఒరిగేది శూన్యమే..."

    100% correct.

    ReplyDelete
  38. నాబ్లాగు కూడలిలో మూడున్నరేళ్ళుగా ఉందండి. ఈమద్య చాలాకాలంగా రాయట్లేదు. అందుకే మీరు తెలిసుండక పోవచ్చు. ధన్యవాదాలు.

    ReplyDelete
  39. " ఎవడండీ ఈరోజుల్లో చదువులు పక్కనపెట్టి ఉద్యమాలంటూ తిరిగేది? ఎవడి ఒత్తిళ్ళు వాడివి. ఎవడిపోటీ వాడిది."

    ఈ దృక్పథమే ...స్పష్టమైన తేడా......మీ వైపు ఇలానే ఆలోచిస్తారు,కాని మా వైపు ఇంకా ఉద్యమాలు అని తిరిగే వారు ఉన్నారు,అందుకే ఈన్నేళ్ళైనా ఉద్యమం ఆగలేదు-ఆగదు.కాని ఈ విషయం పై కాస్త మర్యాదగా,విశదీకరిస్తున్నట్లుగా రాసిన టపా ఇదొక్కటే అనిపించింది.


    తెలుగు భాష గురించి "ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదినిజం. ఇక తెలుగు అనే విషయానికొస్తే నిజంగా తెలంగాణావాళ్లంత భాషాభిమానులు ఉండరు. మనఊళ్ళలోకి ఇంగ్లీషుమీడియమొచ్చి ఎన్నేళ్ళయింది. ఈమద్యలో మనభాషెంత మారింది? మరి శతాబ్దాలుగా నిజాంహుకుం మద్యన ఉర్దూలోనూ చదువుతూకూడా అక్కడ తెలుగుబట్ట కడుతుందంటే ఎవడిగొప్ప." (ఇందులో ఆంధ్రా వారి గొప్ప లేదు అని నా మాటా ఉదహ్:సకలముక్లం అనే పదం ఆంధ్రా లో వాడరు అది ఎక్కువ వాడేది మా తెలంగాణా లో సకలం -ముకులం అని గ్రాంధిక టచ్ ఉన్న పదం )ఇక్కడ మాత్రం మీకు థ్యాంక్స్.

    చాలా మంది బ్లాగుల్లో రాసేటప్పుడు సమైక్యాంధ్ర అని ఆంధ్ర నేకేంధ్రీకరించి మాట్లాడుతారు,సమైక్యాంధ్రా లో తెలంగాణా భాగం అని మర్చి మొండి వాదనలు చేస్తారు....కానీ మీ టపా కాస్త న్యాయమైన విధంగా ఉంది.


    అయినా కలిసిన నాటినుండే విడిపోదాం అంటున్న వారిని ఇన్నేళ్ళు సాగదీసిన ఘనత ఆంధ్రా వారిదే కదా..... (1956 కలిస్తే.....1965,1969ఆంధ్ర ఉద్యమం మీదే...1972.....మద్యలోఅ ఎన్నో సార్లు వచ్చినా ఇప్పటిదే ఫేమస్ అయింది కనుక 2009...ఇకా సాగ దీస్తే సాగుతూనే ఉంటుంది కదా....)


    ReplyDelete
  40. నరసింహా గారి కామెంట్ చూసి ఈ పాత టపా ..చూసా...

    @కొండముది సాయికిరణ్ కుమార్11 December 2009 23:17
    ప్రత్యేక తెలంగాణా వద్దు అనే విషయంలో మీతో నేను విభేదిస్తున్నా కూడా, మీ వ్యాసం చాలా బాగుంది అని చెప్పకుండా ఉండలేకపోతున్నా.

    నాది కూడా సేమ్ ఒపీనియన్.....

    @కేసీఆర్ని తిడితే తెలంగాణాని తిట్టినట్లా? వైఎస్నో, బాబునో చివరికి మన్మోహన్ని తిట్టినా ఒకరాజకీయ నాయకుడిని తిట్టినట్లు. కానీ అదేంచిత్రమో కేసీఆర్ దగ్గరికొస్తే మేటర్ మారిపోద్ది....

    ఈ విషయం లో ఇప్పటికీ మార్పు లేదు...చాలా ముందు చూపుతో వ్రాశారు...

    ReplyDelete
  41. "మనకేమి కావాలో అడగడంలో ఒక పద్దతి ఉంటుంది. ఆపద్దతి తెలీని మూర్ఖులచేతిలోకి ఉద్యమం పోవడమే ఈవిషసంస్కృతికి మూలకారణం. వీళ్లచేతిలో తెలంగాణా ఉంటె ప్రత్యేకరాష్ట్రమైన తర్వాత దానికి ఒరిగేది శూన్యమే."

    ఆ తెలివి వుంటే ఈపాటికి నాలుగు తెలంగాణా రాష్ట్రాలు వచ్చేవి. అది లేకనే కదా ఈ గుంజులాట. కచరాకి కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం కాదు, వసూళ్ళు చేసుకుంటూ చలికాచుకునేందుకు రావణ కాష్టం అని తెలంగాణ ప్రాంతంలో మేధావులు అంటుంటారు. మొదలెట్టిందే అమ్మనాబూతులతో, పైగా మాకు మద్దతియ్యకపోతే తిరగనియ్యం అని. అలా బెదిరిస్తే ముష్టెత్తుకునేవాడు కూడా ఈరోజుల్లో బెదరరని కడుపుకు అన్నం తినే ఏ జంతువుకైనా తెలియాలని బ్లాగులు నడుపుకునే కొన్ని జంతువులకు ఇప్పటికీ తెలియక పోవడం ఆశ్చర్యకరం.

    పైన ప్రవీణ్ గారి సొల్యూషన్ సింపుల్‌గా వుంది. ఆయన చెప్పినట్టు ఓ ఓవర్ హెడ్ టాంకు కట్టించి పంపు చేస్తే తెలంగాణా "టెర్రయిన్"ని సస్యశ్యామలం చేయొచ్చు. హీ హి.

    ReplyDelete