అబ్బబ్బా రోజుకి ముప్పై బహిర్గామి, ఎనభై అంతర్గామి పిలుపుల దెబ్బకి నాచెవుల తుప్పు ఒదిలిపోయింది. అదేమిటో ఈసింగ్రౌలీలో అడుగుపెట్టిన క్షణమెలాంటిదో తెలీదుగానీ ఏప్రిల్లో ఈడకొచ్చిన కాడనుంచి ఆడ జరిగే నాటకీయపరిణామాలపై చర్చించేందుకు సరైజోడీ దొరక్క నేనుపడుతున్నపాట్లు పగోడిగ్గూడా వద్దురా నాయనా.
తెలంగాణా దాదాపూ వచ్చేసినట్లే అని డిసైడైపోతే 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' నిరూపించేంచుదుకు నాయకులంతా త్యాగాలకు రెడీ అయిపొయినారు. పర్లేదు ఆరేళ్ళుగా 'త్యాగమయి' మంచిస్పూర్తినే ఇచ్చింది. పదవుల్ని 'థూ!నాబొడ్డు' అని వదిలేస్తుంటే "పర్లేదురా మనోళ్ళు ఓటేసి గెలిపించినోళ్ళు మరీ అంత ఎదవలుకాదులే." అనుకున్నా. ఇక్కడే నాలోని అల్పజ్ఞాని బయటపడ్డాడు. ఈడ జరుగుతున్న యవ్వారాలు చూస్తే నెమ్మదిగా జ్ఞానోదయం అవుతూ ఉంది.
ఈరాష్ట్రంలో తెలంగాణా కావాలనేటోళ్ళు వద్దనేటోళ్ళు మొత్తంకలిపితే ముప్పైశాతం కూడా ఉండరు. మిగతా డెబ్బైమంది స్థితప్రజ్ఞులు( వీళ్లనే తటస్థులు అనొచ్చు). వీళ్ళకి ఎవరుచేసేది కరక్టుగా ఉంటే వాళ్లకి సపోర్ట్ ఇస్తారు. తెలంగాణాలో గొడవలు చేసినప్పుడు "ఇప్పుడింత కొట్టుకోవాల్సిన అవసరమేంది. కలిసుంటే ఏందంట ఇబ్బంది? సరే మరీ అంతలా అడుగుతుంటే ఇచ్చేస్తేపోలా." అనుకున్నోళ్ళు. తెలంగాణా ఇచ్చేయ్యండహే అనేఓడు మిగతాప్రాంతాల్లో ఉన్నారు. కలిసుంటే ఏందట ఇబ్బంది అనేఓళ్ళు తెలంగాణాలోనూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు టీవీరామాయణంలో శతృజ్ఞుడిపాత్ర. పార్టీలు, మీడియా చివరికి మిగతాజనాలుకూడా వీళ్లని పట్టించుకోరు. అంటే సగటుపౌరుడన్నమాట.
మలపత్రాష్టుడు ఆమ'రణ' దీక్షతో "పరబ్రహ్మ.."పాడటంతో నాటకానికి తెరలేచింది.
నాయకులంతా పోస్టుమ్యానుల్లాగా "నీదేఊరు?" అంటూ చిరునామా అడిగిమరీ దాడిచెయ్యటంతో ఇది కిష్కిందాకాండా? యుద్ధకాండా? అర్థంకాక తలగోక్కున్నారు జనాలు. (నాకోడౌటు. అలాకొట్టించుకుణ్ణోళ్ళలో ఒక్కడైనా రియల్టర్‌గానీ, నాయకుడుగానీ కనీసం వాళ్ళచెంచాగాళ్ళైనా ఉన్నారా?)
సీనుకట్ చేస్తే...ఓవర్‌టూ డిల్లీ.
అమ్మ లెక్కలేయటం మొదలుపెట్టింది. కోస్తే ఎంత? కోయకపోతే ఎంత? మరగుజ్జులు లెక్కలేసిచ్చారు.
చిదంబరం అర్థరాత్రి అంగళ్లన్నీ మూసేసున్నా తిరిగితిరిగి రెండు నిప్పోబాటరీలు(నెల్లూర్లో తయారుచేసినాటివి) సంపాదించి రిమోట్లోవేసి అమ్మకిచ్చాడు. అసలే త్యాగమయి కదా బక్కోడి (ముక్కోడు) త్యాగాలకి ఫ్లూయిడ్లా కరిగిపోయి మీటనొక్కింది. పాపం షార్ట్ సర్క్యూట్ కొట్టింది. డామిట్! కథ అడ్డం తిరిగింది.
ఇక్కడే ప్రేక్షకులు సారీ! ప్రతినిథులు చేంజ్ కోరుకున్నారు.
రాజీనామలిచ్చేశారు. వీళ్ల అభిప్రాయాల్ని చెప్పేసినారు
కేసీఆర్ గొడవచేస్తున్నంతసేపు "ఆడంతయెదవా. ఇంతెదవా"అంటూ అరిచినోళ్ళ బుర్రలు ఎక్కడికెళ్ళాయో అర్థంకావట్లేదు. విడిపోదాం అన్నోడు గొడవచేశాడు, ఆస్థులు తగలబెట్టాడు అంటే అర్థం ఉంది. 'సమైక్యత' అనేటోళ్లకి గొడవలుచెయ్యాల్సిన అవసరం ఏంది?ఇదిఏరకంగా తెలంగాణావాళ్లకి కలిసిబతుకుదామనే భావన కలిగేలా చేస్తుంది? అంటే వాళ్ళు ఇతరులతో కలిసేబతకాలి కానీ ఇతరులకి కష్టం కలిగించేది ఏదైనా జరిగితే అదిరించో బెదిరించొ దారిలోకి తెచ్చుకుంటాం. ఈరకమైన సందేశాన్ని తెలంగాణాప్రజలకు పంపడం ఎంతవరకు సమంజసం? రాజీనామాలివ్వడం ద్వారా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశాక ఈరాద్ధాంతం ఎందుకు?
అడుగడుగునా బాద్యతారాహిత్యం. కేసీఆర్ గొడవచేస్తే తెలంగాణా ఇస్తాం అని, అటుపై ఆంద్ర-సీమవాళ్లు గొడవచేస్తే గమ్ముగాఉండిపోవడం. అంటే కేసీఆర్ గొడవలేపకుంటే తెలంగాణా ఎంత వెనకబడిపోయినా పట్టించుకోనవసరంలేదు. నాయకులనుంచి వ్యతిరేకత రాకుండా ఉండుంటే ఆఆలోచన ఎంతక్రూరమైనదైనా ఒప్పుకోనుండేవాళ్ళు. అంటే ప్రజలకు ఏదిమంచో-ఏదిచెడొ చెప్పలేని స్థితిలో ఉన్నదా డిల్లీప్రభుత్వం? ప్రజలకేది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాద్యతలేదా? పార్టీకి-ప్రభుత్వానికి మద్యన సన్నని విభజనరేఖ ఉంటుంది. ఇదేమైనా పార్టీ అంతర్గతవ్యవహారమా ప్రభుత్వంలో ఎలాంటి పదవిలోనూ లేనివ్యక్తి చేత వ్యవహారం నడిపించేందుకు. కనీసం అందుకు ఎన్నుకున్నతను తటస్తుడా అంటే కాదు. నాకేమిటట అనుకునేరకం. కోతులకు పిల్లి మద్యస్థంలా జరిపించాడు.
నాటకానికి ఇంటర్వెల్ పడేసమయానికి క్లైమాక్స్ తెలిసిపోయింది.
ఈప్రజాప్రతినిథులంతా ఎవరికి ప్రాతినిద్యం వహిస్తున్నారంటారు.
రోశయ్య- బిళ్లలేని బంట్రోతుగా అమ్మకి ప్రతినిథి. ఆయనేమీ మాట్లాడకుండా గుట్టుగా కూర్చున్నా బావుండేది. ఏదోపెద్దాయన అనుకునేవాళ్లం. 'నిమిత్తమాత్రుణ్ణి' అనటమెందుకు.
కేసీఆర్- రాజకీయ నిరుద్యోగులకు ప్రతినిథి.
లగడపాటి- పెట్టుబడిదారులకు ప్రతినిథి.
వాళ్లవాళ్ల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకి ప్రజలమద్య చిచ్చుపెడుతున్నారు. సంబంధాలు చెడిన తర్వాత కలిసిబతకడంలో అర్థమేమిటి? అంటే డిల్లీవాళ్లకి (కాంగ్రెస్సేకాదు. ఏప్రభుత్వమైనా) విడగొడితేనే రాజకీయభవిష్యత్తు అనుకున్నరోజు ఏకేసీఆరూ అవసరంలేదు. కేక్ కోసేస్తారు. వీళ్లని నమ్ముకుని కలసుండటం అంటే కుక్కతోక- గోదారే. ఒక్కటిమాత్రం నిజం. వ్యక్తులస్వార్థానికి ప్రాంతాలమద్య అగాథాలు ఏర్పడ్డాయి. ఇప్పట్లో ఆఅగాథంపూడే అవకాశాలు మృగ్యం.
ఇప్పటికీ నేచెప్పేదొకటే -" తెలుగోడా కలిసే ఉందాం. కారణాలు అడగొద్దు. నేచెప్పలేను."
సోదరా, Here are un-answered questions:
ReplyDelete1. What these Andhra Politicians are doing while KCR is on fast for more than 10 days?
2. What is TDP's stand on Telangana?
3. What is Central Government stand?
ప్రజల భావోద్వేగాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. విద్యార్ధులను సమిధలను చేస్తున్నారు. చివారాకరకు, విషయం భాగ్యనగరం కోసమే అని తేటతెల్లమైపోతోంది.
ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏమిటంటే, గత రెండు రోజులుగా, "ఓయి తెలుగువాడా" అనే Advt అన్ని చానెల్స్ లోను ప్రసారం అవుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఆ ప్రకటన అనవసరం అని నా అభిప్రాయం. డబ్బుల కోసం ఏ ప్రకటనైనా ప్రాసారం చెయ్యడం మన చానల్స్ దివాలాకోరుతనానికి నిదర్సనం.
౧. అప్పట్లో వాళ్లంతా వాళ్ళవాళ్ల నియోజకవర్గ అభివృద్ధిలో తలమునకలై ఉన్నారు.
ReplyDelete౨. చంద్రబాబు- గోడమీది పిల్లులకు ప్రతినిథి. అమ్మఒడిభాషలో చెప్పలంటే నకిలీకణికుడు.
౩. పైనే చెప్పాగా
భాగ్యనగరంకోసంకాక వీళ్లుకొట్టుకునేది పోచంపల్లి, కొండపల్లి కోసమనుకుంటున్నావా
బాసూ మీడియాగురించి ఇంకాఎందుకుచెప్పు మాట్లాడాటం. మసాలాకోసం తెలంగాణా ఇచ్చేస్తున్నట్టు వీళ్లకివీళ్ళె ఊహించేసుకుని రాసేసుకున్నారు. పోస్టరుచూపెడితే చాలు సినిమాస్టోరీవాళ్ళే రాసేస్కుంటారు.
__________________________
ReplyDeleteపోస్టరుచూపెడితే చాలు సినిమాస్టోరీవాళ్ళే రాసేస్కుంటారు.
__________________________
:)