లిఫ్టాట

చైతన్యా! ఓసారి ఆఫోటొగ్రాఫర్ వచ్చాడేమో చూసి, వాడిని వెంటేసుకెళ్ళి స్టోర్స్, స్టీల్‌యార్డ్, ఫాబ్రికేషన్‌యార్డ్ మొత్తం ఫోటోలు తీయించు.
అలాగేసార్
****
సార్ ఫోటొలు తీయించాను.
సరే ఓసారి డైక్ దగ్గర పనెలా జరుగుతుందో చూడవయ్యా.
ఉదయమే చూసొచ్చా సార్.
ఇందాక ఏదోప్రాబ్లెం అని రాంజీ పరిగెత్తుకెళ్ళాడు ఓసారి చూసిరా.
(ఎన్నిసార్లెళ్ళాలిరా నాయనా. కాళ్లుపీకేస్తున్నాయి.)
****
చాంబర్లోంచి బయటికొచ్చి మెట్లదగ్గరకు వెళ్తుంటే ఎదురుగా లిఫ్ట్ 'ఆఆఆ..' అని నోరు తెరుచుక్కూర్చోనుంది.
ఇంతకాలానికి చిక్కావే. నేపైకెళ్లాలి అంటె బాణం కిందకి ఉంటుంది. కిందకెళ్ళాలి అంటే పైకి చూస్తుంటావ్. నీకు నార్త్ ఇండియన్ ఫీలింగెక్కువయ్యిందే. నేను తెలుగోడిని ద్రావిడుణ్ణి అని నీ రొట్టెముక్కల బుద్దిని చూపిస్తావ్. ఈరోజు నాసేవలో తరించాల్సిందే. చచ్చినట్టు నన్ను కిందకి దింపాల్సిందే అన్నానో లేదో "స్వామిరారా!" అనిపాడింది.
లోపలికెళ్ళి 'జీ'(గ్రౌండ్ ఫ్లోర్) నొక్కానో లేదో జుయ్‌మని రెండంగుళాలు కిందకి దిగింది.
నేను "ఆ.."అంటూ పైన నెంబర్లవంక చూస్తున్నా సున్నా ఎప్పుడొస్తాదా అని.
కాళ్ళుపీకట్లేదు. (ఇదేంటి కిందకి పోతుంటే కొద్దిగా పీకాలిగా)
రెండునిముషాలైనా అది రెండేచూపిస్తోంది.
అప్పుడర్థమైంది లిఫ్ట్ చెడిందని.
కెవ్వ్... కెవ్వ్... ఒసేయ్ నామీద కసి ఇలాతీర్చుకుంటావా. ఒక్కసారి బయటకి రానీ నీపన్జెప్తా.
ఒకట్రెండుసార్లు బటన్లు నొక్కా. ప్చ్
అలారం నొక్కా..లాభంలేదు.
ఇక ఇలాకాదని సెల్ తీసి బాసుకి కొట్టా.
"ఆచైతన్యా! పనెలా సాగుతుంది? అంతాఓకేనా."
నువ్వేడ దొరికావయ్యా బాబూ. త్రిలింగదేశం నుంచొచ్చి త్రిశంకుస్వర్గంలో చిక్కుకుంటే.
"సార్! లిఫ్ట్ ఆగిపోయింది. నేలోపలిరుక్కుపోయా. ఆపరేటర్కి చెప్పండి."
ఇంతలో బిపిన్ ఫోను. "చైతన్యా! లిఫ్ట్ ఇరుక్కుపోయిందా? ఇంతకీ నువ్వు లోపలున్నావా? బయటా?"
హ్మ్. టైంస్. ఇలాంటి ప్రశ్నలు మనం వేరేవాళ్లకేస్తే ఓకే. కానీ మనకేసినప్పుడే నషాలానికంటేది.
"ఒక్కనిముషం ఆగు."
పక్కన్నుంచి బాసుగొంతు." ఈడెక్కడికిపోతే వెనకాలే నేనూ పరిగెత్తాలి. ఎవడికీరాని సమస్యలు, డౌట్లు వీడికే వస్తాయి. పాతికేళ్ళుగా వాడుతున్నాం ఆలిఫ్ట్. ఎప్పుడైనా జరిగిందా."
నాటైమ్ బాబూ. ఏంచేస్తాం.
ఓపదినిముషాల్లో తలుపుబయట గొంతులినిపిస్తునాయ్.
హమ్మయ జనాలొచ్చేశారు. ఇకటెన్షన్ వాళ్ళది. వాళ్ళచావేదోవాళ్ళు చచ్చి తలుపుతీస్తారు. ఇప్పుడు గాకపోతే మరోఅరగంటకి. మరీఆలశ్యం అయితే సైటుకెళ్ళేపని తప్పిపోతుంది. అయినా ఇలాంటప్పుడుకూడా ఒక్కడినే కాకపోతే ఎవరైనా తోడుంటే ఎంతబావుండేదో."
ఇంతలో అంతరాత్మ పైన ఎక్సాస్ట్ ఫానుమీద కూర్చుని "నోర్ముసుకోరా వెథవా. లిఫ్టాట ఆడుకోను నువ్వేమైనా డెహ్రడూన్లో ట్రైనింగ్ చేశావా? నువ్వుకొడితే మైండుబ్లాక్ అవుతుందా?" అన్నాడు.
సర్లే మరీ ఊహించుకోవడకూడా తప్పేనా.
ఇంతలో ఫోను.
"మీరు ఎక్కడ ఉన్నారుసార్?"
"లిఫ్ట్లో నాయనా. ఇంతకీ నువ్వెవరు?"
"ఆపరేటర్ని సార్. మీరు ఎక్సాట్ గా ఎక్కడున్నరో చెప్పగలరా?"
"రెండో అంతస్థు"
"అక్కడీనుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లెఫ్ట్ ఎందుకెక్కారు సార్?మెట్లమీద వెళ్ళిపోవచ్చుగా."
" నాఖర్మకాలి. ఒరేయ్ నాయనా నన్ను బయటకి తెప్పించావంటే మాఫ్రెమ్డుతో చెప్పి నీకు కాల్‌సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తా. నీకదే కరక్టు. ముందు నన్నుబయటకులాగేపని చూడరా."
"సార్ మీరు బాచెలర్ హాస్టల్లో ఉంటారుకదా? రవివాళ్ళ ఎదురు బిల్డింగేకదా? మీరునాకు తెలుసుసార్."
"నీకు టెంకాయకొడతా. తలుపుతీసే పని చూడరారోయ్."
"సార్ నాదగ్గర తాళం తెరుచుకోవట్లేదుసార్. వేరేదారేదైనా చూడాలి."
"హ్మ్. టైంస్."
***
బయటినుంచి బిపిన్ "చైతన్యా. భయపడకు. తెరుస్తున్నాం. తాళం వచ్చింది."
"భయంకాదు సార్. విరక్తి పుడుతుంది. ఆతాళం పనిచెయ్యదట."
"అవును. నీకెలా తెలిసింది.
"ఇప్పుడే ఫోన్‌చేసి చెప్పాడూ ఆపరేటర్ గాడు"
"సరేలే వేరేదారేదైనా ఉందేమో చూస్తున్నాం."
"నాకుతెలిసి ఒకటేదారిసార్. పైన కప్పు ఇరగొట్టుకుని తీగెపట్టుకుని పాకుతూ రావడమే."
" అంతలేదులేగానీ నోర్మూసుక్కూర్చో. నీతెలివి ఉపయోగించకు (డోంట్ యూస్ యువర్ ఓన్ బ్రెయిన్)
ఓపని చెయ్యి. మేము బయట తలుపుల్ని లాగుతాం. లోపల తలుపుల్ని నువ్వు తెరువు. అదొక్కటే దారనిపిస్తుంది"
"అలానేసార్."
గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక
బయటికొచ్చి చూస్తే చంద్రయాన్ చేసొచ్చిన వ్యోమగామిని చూసేందుకొచ్చినట్టు గుంపుగా జనాలు.
"మంచినీళ్ళు తీసుకో. ఏమైనా భయపడ్డావా."
"లేదుసార్. ఏముంది పదినిముషాల్లో ఎలాగోలా తెరుస్తారుగదా."
"అతను పెద్దగా భయపడ్లేదట. అక్ఖర్లేదులే."
చూస్తే గ్లాసులో ఏదో తీసుకొచ్చిన సర్వరు వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
"నువ్వుమరీ భయపడుంటావేమోనని సారు ఆపిల్‌జ్యూస్ తెమ్మనాడు. నువ్వు పకపకా నవ్వుతూఉండే సరికే పంపించేశాడు. హిహిహి."
ఇక పరామర్శలు.
"అవునూ లోపల ఏబటను నొక్కావు?"
"ఆగిపోయిందని ఎలా తెలిసింది?"
"భయమెయ్యలేదా?"
"ఎంతసేపున్నావు లోపల?" (నేనేమైనా యూరీగగారిన్నా? ఎంతసేపు అంతరిక్షంలో ఉన్నానో నోట్ చేసుకోను.)
" రోజూ తిరిగేదేగదా. ఒక్కసారిగా ఆగిపోతే ఎలా అనిపిమ్చింది?"
" అన్నట్టు నీపేరు చైతన్యనా? ఇంతకాలం నీపేరు తెలీదు." (నీఎంకమ్మారేయ్.)
" మొన్న మనద్దిరం కలిసే లిఫ్ట్లో వెళ్ళాం గుర్తుందా?"
"మొత్తానికి ఈదెబ్బతో జనాలు గుట్టుగా మెట్లపై ఎక్కిదిగుతారు. కొంతమందికి పొట్టలైనా తగ్గుతాయ్."
ఇంతలో అసలీ లిఫ్టును రిపేరుచేసి ఎన్నాళ్లయింది? ఎప్పడినుంచి వాడుతున్నారు? గతంలో వచ్చిన సమస్యలు? ఇలాఇలా వాదోపవాదాలు మొదలయ్యాయి. అవి రాయకూడదు అధికార రహస్యాలు.

ఇప్పటిదాకా ఏది జరుగుతుందని భయపడ్డానో అది జరిగిపోయింది.మావానరగుంపు వచ్చేసింది. ఇక మ్యూట్ కొట్టేసి గుట్టుగా కూర్చున్నా. ఇలాంటప్పుడు మౌనమే ఉత్తమం అని అనుభవం నేర్పిన పాఠం. పైన మీకు వివరించిన యధార్థ సంఘటనలకి మసాలాదట్టించి, మంటపుట్టించి పండగ జేస్కున్నారు పింజారీకుంకలు.

7 comments:

 1. :)
  Same kind of experience for me in Arihant Towers, while going down from 12th floor, it got stuck at 5th floor. Luckily, Alarm button worked!!

  ReplyDelete
 2. అది ఖచ్చితం గా ఒక తెలుగు వాడి మీద జరిగిన దాడిగా గుర్తిస్తూ వెంటనే నీకు ఆ రోజు ఇవ్వబోయిన అపిల్ జూస్(అదే జూస్ సుమా) మళ్ళా ఇవ్వాలని డిమాండ్ చేసేస్తా......:))

  ReplyDelete
 3. ha..ha..ha.. very good narration..

  ReplyDelete
 4. ఒకసారి నేనూ మా లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను...చేతిలో సెల్ ఉండబట్టి రింగ్ ఇస్తే మా వారు వచ్చి నే బయటకు వచ్చే ప్రయత్నాలు చేసారు...ఆ రోజు సెల్ చేతిలో లేకపోయుంటే అనుకున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది...


  ఆ "తిట్లు" లేకుండా పోస్ట్ రాసే ప్రయత్నం చేయవచ్చేమో...abusing is not humour..

  ReplyDelete
 5. చైతన్య గారు ,నిజం గా భయం వేయలేదా ? నాకైతే చదువుతుంటే నే గుండె దడ దడ లాడి పోయింది . హూం

  ReplyDelete
 6. @గణేష్: నాకంత అదృష్తంకూడాలేదు బాసు
  @శివన్న: నీమాటగా చెప్తే ఆజూస్ ఎప్పుడొ నాకొలీగ్ గాడు కాజేశాడని చెప్పారు.
  @మురళి: మీకు నానేరేషన్ కనిపిచ్చిందిగానీ ఫ్రస్ట్రేషన్ కనిపిమ్చినట్టు లేదు.
  @తృష్ణ: మేఘసందేశం విన్నంతలోనే మీవారు "తృష్ణా..." అంటూ "సిరికింజెప్పడు.." అన్నట్టొచ్చేశారా.
  ఇకపై రాయనులేండి.
  @మాలాకుమార్: భయంకాదు గానీండి కొద్దిగా విసుగేసింది. పనిమీద వెళ్తుంటె ఎవిటీ తలనొప్పి అని. ఎలాగూ పదిపదిహేను నిముషాల్లో తెరుస్తారుగా.

  ReplyDelete