అది 2007 సంవత్సరం జూలై. రెండో సెమిస్టరు తర్వాత చెయ్యాల్సిన సమ్మర్ ఇంటర్న్ షిప్ పూర్తిచేసి ఒకవారం ఇంటిదగ్గర ఉండి తిరిగి హాస్టలు చేరా. గోవింద్‌గాడు వచ్చి "ప్లేస్‌మెంట్ ఎక్సామ్ రిజల్ట్ వందిరిచి. నీయుం,శశికళాఉం టాపర్స్. ఒరు ఆయిరం మట్టుం పోదుం" అని సొల్లి వెళ్ల్లాడు. ఆడబ్బు చలానా కట్టి ఆరశీదు ప్లేస్‌మెంట్‌సెల్‌లో ఇచ్చి వ్చచ్చేశాం.
"మొదటి కంపెనీ టీసీఎస్ బావా" అని విభాగాడు. "సర్లేరా నేనెలాగు వాటికి కూర్చోనుగా.ఎల్ అండ్ టీ . ఎప్పుడు." అని అడిగా. "కొంచెం టైమ్ పడుతుంది" అని చెప్పాడు. సాయంత్రంవచ్చి" బావా! అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ఇంతవరకూ అగర్వాలు పుస్తకం అట్టకూడా చూడలేదు. అసలు ఆప్టి, రీజనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం." అన్నాడు. ఇంతలో హరిగాడు వచ్చి "దాని తర్వాత సీ.టీ.ఎస్ వెంటనే ఐ.బీ.ఎమ్." అన్నాడు. మళ్లీవిభాగాడు " ఒకసారి చూద్దాం బావా. నేను కూడా ప్రిపేర్ కాలేదు" అన్నాడు. వాడుకూడా ఇంటర్న్ షిప్ కోసం డిల్లీ వెళ్ళొచ్చాడు. వాళ్లక్లాస్‌కి రెప్ కావడంతో ముందుగావచ్చి ప్లేస్‌మెంట్ చూస్కోవాల్సి వచ్చింది. సర్లేరా చూద్దాం అన్నాను.
రాత్రి పడుకునే ముందు ఆలోచనలు..." నాకు అసలు
సాఫ్ట్వేర్ అంటేనే పడదు. ఎందుకో నామైండ్‌సెట్‌కి కుదరదు అనిపించింది. కొన్ని అలా ఫిక్స్ ఐపోతా. తర్వాత నన్నుమార్చాలంటే కష్టమే. 2000 డిసంబరు 08 కౌన్సిలింగ్‌లో సివిల్ సీటు వచ్చినప్పుడే అనుకున్నా ఇక జీవితానికి నేను సివిల్ ఇంజనీరుని అని. మానాన్న ఐతే ఎంసెట్ అప్లికేషన్ నింపేరోజే అన్నాడు నువ్వు సివిల్. అంతేరా అది నిర్ణయం ఐపోయింది అని. అమ్మకి మాత్రం నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు అవ్వాలి అని. ఇంట్లో త్రాసు ఎప్పుడూ నాన్నపక్కే తూగుతుంది. నాకు ఉద్యోగం వచ్చి ఆమాట ఇంట్లోచెప్తే. ఈమాట రెండునెలల క్రితం అయ్యుంటే బావుండేది. కానీ ఈరోజు పరిస్థితివేరే. నాకు ఒక ఉద్యోగం వచ్చింది అని చెప్తే ఇంట్లో ఎగిరిగంతేసేయ్యరు. కానీ ఈమాట అమ్మకి కొంత ఊరట." మొత్తానికి దానికి కూర్చుందాం అని నిర్ణయించుకుని విభాగాడికి చెప్పా.
ఇద్దరం కలిసి ప్లేస్‌మెంట్ వెబ్‌పేజ్‌లో రిజిస్టర్ చేస్కుని వచ్చాం. హరిగాడిని అడిగితే "లేదుబావా" అన్నాడు. సరే ఆరోజుకైనా త్వరగా లేవాలిగా. ఏడుకల్లా లేచి, స్నానం- సంద్యలు పూర్తిచేస్కుని ఫార్మల్ తొడుక్కుంటుంటే ఎవడొ మనల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్. తిరిగి చూస్తే అరుణ్ గాడు. ముసిముసి నవ్వులు. "ఇప్పం నాన్ ఒ
రు సీరియస్ కారెక్టర్. ఎణ్ కిట్టా కామెడీ వేండా తంబీ" అన్నా. అయినా మారలేదు. సరే ఒక పదినిముషాలు కామెడీలు వేసి తిరిగి సీరియస్‌గా మెస్‌కి వెళ్తే అక్కడా సేమ్‌సీన్. అరగంట కామెడీ తర్వాత మళ్లీ సీరియస్.
ఇప్పుడు బార్న్‌హాల్‌లో పీపీటీ ఏస్తున్నారు అంటే జెమినీ సర్కస్ చూసే ప్రేక్షకుల్లా వెళ్తున్నారు జనాలు. కూర్చునేవాళ్లు, కూర్చోనివాళ్లు అన్నతేడా లేదు. బల్క్ కంపెనీ, అందునా టీసీఎస్. వీటన్నిటి మించి సీజన్ ఓపెనింగ్. అక్కడి నుంచి ప్లేస్‌మెంట్‌సెల్‌కెళ్లి మానంబరు తీస్కుని నోటీస్‌బోర్డ్‌లో చూస్తే నాకు పదకొండుకనుకుంటాఆన్‌లైన్ ఎక్జాం. సరేనని బుహారిలో చాయ్ తాగి అలా నలుగుర్నీ కెలికి (ఒక్కోడు అగర్వాల్ పుస్తకాన్ని తెగరుబ్బి- తెగతాగినారు.) వచ్చి కూలబడ్డా.
పరీక్షరాసి భోజనానికి వెళ్తే ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క హావభావం. కొంతమంది స్థితప్రజ్ఞులు( మేకపోతులు), ఇంకొంతమంది నిగర్వులు( కనిపిచ్చినోడినల్లా ఈప్రశ్నకేమి జవాబు ఆప్రశ్నకేమి జవాబు అని తినేస్తున్నారు), మరికొంతమంది భోళాశంకరులు( నాపరీక్ష బాల్చీ తన్నేసింది అని ఏడుస్తున్నారు). ఇక ఎగ్జిట్‌పోల్ ని
వేదికలు, గతేడాది గణాంకాలతో కుస్తీపట్టేవాళ్లు. మిగతాకాంపస్సుల్లో అనుభవాలను ప్రసారంచేసేవాళ్లు. అబ్బో జాతర.
మొత్తానికి ఫలితాలు వచ్చాయి. మద్యాహ్నం గుంపుచర్చలు. దానికి వెళ్లొచ్చి, విభాగాడితోబాటు కొంచెంసేపు జననాడిని , జ్యూసు కడుపులో పోస్కుని ఫలితాలు కోసం వెళ్తుంటే సేఫ్టీగాడు ఎదురొచ్చి " నువ్వు క్లియర్ అయ్యిపోయావు బావా. విభాగాడిపేరు నాకు గుర్తులేదు." నీయబ్బా అనీట్టుకుంటూ పరిగెత్తాం. హమ్మయ్య వాడిపేరు కూడా ఉంది. ఇక ఇంటికి ఒకకాల్ చేసి విషయం చెప్తే ఊహించినట్లే "హ్మ్. సరేరా."
సాయంత్రం బనానాలీఫ్‌లో హరి, కొండి, రాకీతో విందు. ఇక మనసు ఊరుకోదుగా. అప్పటికే స్టైపండు పండింది. అమ్మకి ఒకచీర తీస్కుని పదకొండుకి బస్సెక్కేశా. ఐదుకి కోయంబేడు ఎనిమిదిన్నరకి ఇంట్లో." అలా నాజీవితానికి మొదటిఉద్యోగం వచ్చింది. ఇక మూడొసెంలో పూర్తిగా ఉద్యోగం అన్న ఆలోచనేలేదు.
మమ్మల్నిచూసి హరికూడా మనసు మార్చుకుని సీటీఎస్‌కి కూర్చున్నాడు. ఉద్యోగం వచ్చిన తరువా
త వాళ్లనాన్నకి ఫోన్‌చేసి "నాన్నా! నాకు ఉద్యోగం వచ్చింది. నీచిన్నకొడుకు గురించి నువ్వుదిగులుపడాల్సిన అవసరంలేదు. ఇక ఎవరొచ్చి ప్రశ్నించినా నీదగ్గర జవాబుంది." నేను జీవితంలో మర్చిపోలేని మాటలివి.
నాలుగోసెం మొదలైంది. నేను కోర్‌కంపెనీలకు కూర్చుంటా ఆంటే కొన్ని శక్తులు అడ్డుపడాయ్. నిజానికి ఇవే నన్నుగతంలో ప్రభావితం చేశాయ్.ఇప్పుడూ వాటిగురించి అనవసరం. అప్పటికే అన్ని ముఖ్యమైనవి అయిపోయాయి. ఇక మిగిలింది రెండు మూడు. వీళ్ళు ఉన్నవన్నీ వృధాచేసి ఇప్పుడు నాపుట్టి ముంచేశారు. ఇక ఆఫ్‌కాంపస్‌కి వెళ్లాలి అని డిసైడ్ అయ్యా. అందరూ వద్దుబావా రిస్క్.నిజమే కానీ తప్పదు.
ఇక ప్రతిబుధవారం హిందూలో ఆపర్చునిటీస్, నౌకరీ, మాన్‌స్టర్. మొదట జిందాల్. విజయవంతంగా నింగికెగసి భూకక్ష్యకి చేరింది. తర్వాత చూస్తే పీఎస్.యూల్లో వర్క్ ప్రొఫైల్, పాకేజీ బావుంది. చర్చిస్తే అ
న్నింటికన్నా అవే ఉత్తమమైనది. ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు ఎక్కువ వాటిలోనే ఉంటారు అని తెలిసింది. మొదటిది హెచ్‌పీసీఎల్. డుమ్మాకొట్టింది. తర్వాత ఎన్‌టీపీసీ. విజయం. కానీ నాకు ఇష్టమైనది బీ.హెచ్.ఈ.ఎల్. నాన్న చాలాసార్లు అనేవాడు.కానీ కుదర్లేదు.
ఇంతలో విభాగాడు ఫోను. బావా ఎల్ అండ్ టీవాడు నిన్ను- నన్ను పిలుస్తున్నాడు. వాకే అదికూడా విజయం. దాంట్లోనే ఉండిపోదాం అనుకున్నా. ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ ల నుంచి పిలుపు. కానీ అంతగా పట్టించుకోలేదు. ఇంతలో కొన్నిఅంశాలు ప్రభావితం చేశాయి. ఇక పీ.ఎస్.యూకి వెళ్లాలి అనిమనసు. ఎలా అనుకున్న సమయంలో ఇంటికి పోస్టు అందులో ఎన్.టీ.పీ.సీ నుంచి లేఖ. వెళ్లి కంపెనీలో చెప్పేశా. మావాడు ఇంటర్వ్యూ అవ్వకముం
దే ఎందుకు చెప్పావు అని నస. కానీ ఖచ్చితంగా వస్తుందని నాకనిపిచ్చేసింది. ఎక్కడిదో ఆధైర్యం తెలియదు.
పీజేఎన్ పిలిచి దాని రిజల్టువచ్చేదాకా నీకు పని అప్పగించలేమ్ అన్నాడు. సరే అని వచ్చేశా. ఇంటికి వేళ్లలేదు. ఫలితాలు రావల్సిన దానికన్నా ఒకవారం ఆలస్యం ఐంది. కొద్దిగా దిగులు. తిరువళ్ళూరు వెళ్లి చాలా ఏళ్లైంది అని గిరిగాడితో చెప్పి అక్కడికి బయల్దేరా. వాడూవస్తా అన్నాడు. మద్యలో వెంకటెసూ.ముగ్గురం కలిసి వెళ్లి వీరరాఘవస్వామి దర్శనం చేస్కుని మల్లిగాడి రూంకి వెళ్లాం. పిల్లిలాగా చప్పుడు చెయ్యకుండా నెట్ ఓపన్ చేసి చూశా. ఏను
గెక్కి మెరీనాబీచ్ వరకు ఊరేగా. వెంటనే అమ్మకి, అశోక్‌కి ఫోన్. దాంతో ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ. పట్టించుకోలేదు.
విభాగాడినుంచి ఫోను. బావా ఈనెల 29 స్నాతకోత్సవం. అందరం కలుద్దాం. దానికోసం బయల్దేరుతుంటే అప్పుడే ఇంటినుంచి అమ్మఫోన్. ఒక శుభవార్త. పాపని చూసెళ్లిన వాళ్లు అమ్మాయి నచ్చింది అన్నారు.
అం
దరం కలిసి ఎగ్మూరులో రైలెక్కాలి. మనకు చేజింగ్ లేకపోతే మనసొప్పుకోదుగా. అందుకే మద్యలో అక్కడా ఇక్కడా పెత్తనాలు చేసి వచ్చేసరికే టైమ్ అయిపోయింది. ఇక అక్కడికి వెళ్తే కష్టం అని గిండీనుంచి నేరుగా తాంబరం చేరాను. ఎవ్వరూ భోజనంచెయ్యలేదంటే రైలొచ్చేసరికే టిఫిన్లు కట్టిచ్చిపెట్టా. తెల్లవారేసరికే కాంపస్‌లో.

బార్న్‌హాల్‌లో ఫంక్షను. గౌను, ఇతర సరంజామా తీస్కుని అక్కడికి వెళ్లాం. అందరికీ అక్కడే ప్రకటించా. వెలగాల్సిన బల్బులు వె
లిగాయి. మాడాల్సిన బల్బులు మాడి చెత్తబుట్టలో పడ్డాయి.చివరికి నాపాకేజే క్లా
సులో టాప్ అందులో కోర్.
సెప్టెంబరు తొమ్మిది వైద్యపరీక్షలు. ముందు నోయిడాలో పవరు మానేజ్‌మెంట్ ఇన్స్టిట్యూ
ట్లో నమోదుచేస్కొని అక్కడి నుంచి బదర్‌పూరు ప్లాంట్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు. ఈప్రామ్తం నాకు ముందుగానే తెలుసు. ఆమద్యలో ఒక కంపెనీ చెప్పటం మర్చిపోయా. ఎయిర్ ఫ్లూయిడ్ అని ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చా. కాకపోతే మొద
ట సంవత్సరం జీతం చాలాతక్కువ అనేసరికే నేను రెండొసంవత్సరంలోనే చేరుతాలే అనిచెప్పి వచ్చేశా. అదీగాక ఎల్ అండ్ టీ వాళ్ల డిల్లీ ఆఫీసు ఇక్కడే ఉంది. ఇక పద్నాలుగో తేదీ సర్టిఫికేట్ల తనిఖీ.
16 సెప్టంబరు 2008 మామిడిపూడి సుబ్రహ్మణ్య చైతన్య నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లి
మిటెడ్ ( భారత ప్రభుత్వ రంగ సంస్థ) అనే నవరత్నలో కార్యనిర్వాహక శిక్షితుడుగా (ఎక్జిక్యూటివ్ ట్రైనీ) చేరాడు. నిన్నటికి ఒక
సంవత్సరం.
ఎన్నోకొత్త విషయాలు నచ్చేవి (గుర్తుంచుకొని ఆచరిద్దాం అనుకొనేవి)- నచ్చనివి (అప్పుడే మర్చిపోయేందుకు యత్నించినవి), ఎంతోమంది కొత్తమనుషులు నచ్చినవాళ్లు (ఫోను నంబరు అడిగి తీస్కున్నా)- నచ్చని
వాళ్లు( కనిపిస్తే ఒకనవ్వు), కొత్తప్రదేశాలు నచ్చినవి - నచ్చనివి, కొత్తపద్ధతులు నచ్చినవి (సరేచూద్దాం అనుకున్నా) - నచ్చనివి(వదిలేద్దామ్ అనుకున్నా) కొత్తకొత్తవి ఇంకెన్నో . మొత్తానికి కొత్తగా నాకునేను. ఇంటీకివెళ్తే చుట్టాల్లో కొత్తనేను. ఫోన్ చేస్తే స్నేహితులకి కొత్తనేను.
--
M.S.Chaithanya
101082
ET08 Civil
NTPC Singrauli
Shaktinagar
Sonabhadra UP 231222