ఒకప్రశ్న

" అధ్యక్షా!" ఈమాట ఎవరు అన్నా వెంటనే గుర్తొచ్చే పేరది. కాకపోతే ఇప్పటిదాకా సరదాగా ఇకపై కొంతబరువుగా. శాసనసభలో స్పీకర్‌కి కొంతసమయం పడుతుంది సర్దుకొనేందుకు. ఇకపై తాము విమర్శలను సంధించాల్సిన వ్యక్తి వేరొకరు అంటే విపక్షనాయకులకీ ఈఇబ్బంది తప్పదనుకొంటా. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సంగతి సరేసరి. మీడియాకి కొద్దిగా మినహాయింపు.

నిన్న మద్యాహ్నం వరకు తెలియదునాకు. 3పైన అమ్మఫోన్ చేసి హెలికాప్టర్ దారితప్పిందనిచెప్పింది. అదేమీకాదులేమా అనిచెప్పాను. దారితప్పితే సమాచారం ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా నియంత్రిస్తారు వివరించేసరికే ఆమె కొంచెం కుదుటపడింది. అంతలో ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి కొంచెం వివరంగా చెప్పాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిచూస్తే ఇంకా గాలింపు అన్నారు. ఎదో అలజడి మనసులో.మళ్ళీ అమ్మఫోను. ఆయనభార్య గుర్తొస్తే మాత్రం అయనకేమీ కాకూడదు అనికొరుకుంటోంది మనసు. చాలా మంచావిడ. తానునమ్మిన దేవుడిని ఎప్పుడూ మరవలేదు. అంత పెద్దింటికోడలైనా, భర్త ముఖ్యమంత్రైనా ఎప్పుడూ అహంభావం చూడలేదు ఆమెకళ్లలో. రాత్రంతా ఫోన్లు. అధికారులకి కునుకులేదు. మీడియా వేడివేడి వ్యాపారాలతో బిజీ. నాయకులు వంతులేస్కొని శోకాలు( గ్లిజరిన్ లేకుండా). ఎవరి లెక్కలు వాళ్లవి. సీటుకోసం రాత్రి ఎన్ని సిట్టింగులు జరిగాయో? ఒక కాళరాత్రి అలా దొల్లుకొంటూ పోయింది.

సూర్యుడితోగూడ మనసుల్లో ఆశ చిగురించింది. ఎమైనా తెలిసిందా అని నిద్రకళ్లతోనే టీవీలముందు. ఒక్క ప్రకటన ఆశలన్నింటినీ చిదిమేసింది. ఎక్కడో మనసులో వెలితి, ఏదోకోల్పోయామన్న బాధ, గుండెబరువు ఎంతో తెలిసొచ్చిన క్షణాలు. విన్న తరువాతకూడా కళ్లుమూస్కొంటే సాక్షాత్కారం అవుతున్న చిరునవ్వు. మొత్తం ఐదుమంది అన్నారు. ఇద్దరు పైలెట్లు. వాళ్లు శిక్షణాసమయంలోనే వీటికి సిద్ధపడతారు. సెక్యూరిటీ ఆఫీసరు ఒకరు. ఈయన వృత్తికూడా అలాంటిదే. వై. ఎస్. తన ఫాక్షనిస్ట్ అనుభవాలతో మనసు సిద్ధపడిపోయి ఉంటుంది. ఇక మిగిలింది సుబ్రహ్మణ్యం. పాపం ఆయన ఊహించనిది. ఒక కార్యదర్శిగా ముఖ్యమంత్రితోకూడా హెలికాప్టరు ఎక్కుతున్నాం అనేది హోదాగా ఊహించుకొనే వృత్తి.

ఇంతలో మళ్లీ మొదలయ్యాయి వీధినాటకాలు. మీడియా నాలుగు సినిమా పాటలతో, ఎస్సెమ్మెస్‌లతో శవం మీద చిల్లర ఏరుకుంటుంది. నాయకులు శోకాలు ఢిల్లీకి వినిపించాయి. సీటుకావలనేవారు గుట్టుగా బేరాలు. మనకు అంతలేదులే అనుకొనేవాళ్లు "జగన్" (కనీసం మంత్రిపదవైనా దక్కుతుందని.) ఆమాద్మీ మాత్రం తమ నాయకుడిని తలుస్తూ కళ్ళొత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పైన వచ్చిన విమర్శలేవీ గుర్తులేవు, తానేపార్టీయోకూడా మరిచాడు, మొన్న ఓటు ఎవరికివేశాడొ ఆలోచించాల్సిన అవసరం లేదనుకొన్నాడు.

రాజరెడ్డివాళ్ల అబ్బాయి, డాక్టరు రాజయ్య, ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వై. ఎస్., ప్రతిపక్షనాయకుడు వై. ఎస్., ముఖ్యమంత్రి ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి వీటిని ఉత్సాహంగా పలికిన నాలుక ఇప్పుడు ఆపేరు ముందు వేరొకటి పెట్టాలి అంటే తడబడుతోంది. ఆమహాతల్లి ని బొట్టులేకుండా చూడాలంటే ఆఊరోళ్లకి ఎంత ఇబ్బందో?
ఎక్కడైనా అల్లర్లు లెస్తాయేమో (ఎవరైనా లేపుతారేమో.) అధికారుల్లో అలజడి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలను అదుపులో ఉంచిన యంత్రాగం నిజంగా అభినందనీయులు. ఎదైనా తప్పుజరిగితేనే వీళ్లు గుర్తొస్తారు మనకు. ఇలా చక్కబెట్టినప్పుడు ఎవరూ పట్టించుకోరు.

ఆఊరికోసం (ఈరోజుల్లో కనీసం సొంత ఊరి గురించి ఆలోచించేవాళ్లు ఎంత మంది.), దానిబాగు కోసం ఎన్నికలలు కన్నాడో. ఆయనకి మునుపు ఆప్రాంతాన్ని పట్టించుకొన్న నాధుడేలేడు. ఇక భవిష్యత్తుకూడా అంతేనేమో.
పార్టీవిషయానికి వస్తే, నేనుగెలిపిస్తా అని పలకగల్గిన ఖలేజా ఎవరికి ఉంది? 2014లో రాహుల్ ప్రధాని అవ్వాలంటే ఆంధ్ర ఎంతముఖ్యమో తెలిసిందే. మరి అప్పటికి ఎవరిపై ఆధారపడాలి? మొన్న ఎలక్షన్లలో వై.ఎస్.ని చూసి ఎంతమంది ఓటేశారు? సోనియాని, రాహుల్‌ని చూసి ఎంతమంది ఓటెశారు?

ప్రభుత్వంవిషయంలో పరిస్థితి ఇంకా దారుణం. అంతపెద్ద ప్రణాళికలు, ప్రాజెక్టులు, పధకాలు నిర్వహించాలంటే మాటలుకాదు. అన్నింటికంటే ప్రధానమైంది ప్రాజెక్టుల్లో అవినీతి. ఇప్పటిదాకా ఇచ్చిన మామూళ్లు చెల్లవు. దందాలు మళ్లీ మొదటికి వస్తాయి. చాలవరకు ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం అదే. ఒకరొచ్చి మొదలు పెడతారు. పర్సంటేజీలు లెక్కేసుకొని పంచేసుకొంటారు. ఇంతలో ప్రభుత్వం మారటం. మళ్లీ బేతాళుడు చెట్టెక్కడం. ఇదంతా సర్దాలి, ఆరోపణల్ని కోర్టుల్లో, శాసనసభలో ఎదుర్కోవాలి. ఇంతదాకా కుక్కిన పేనుల్లా ఉన్న అసమ్మతి ఇక బుసలుకొడుతుంది. అధిష్టానం దగ్గర మాటనెగ్గించుకోగల పట్టు ఎవరిదగ్గర ఉంది?

కాలం తనపంధా కొనసాగిస్తుంది. తనదైన శైలిలో జవాబు చెప్తుంది. ఇప్పుడుమాత్రం తనమౌనరూపాన్ని నిశిరాత్రిలాగా భరించి, రేపటిసూర్యుడికోసం ఎదురుచూడాలి. ఐతే కుటుంబపెద్దగా ఆయనలేమిని అందరికంటే ఎక్కువ అనుభవించేది భార్యాబిడ్డలే. ఆకాలందగ్గర జవాబు దొరకనిప్రశ్న వాళ్లదగ్గర ఒకటి ఉంది.

14 comments:

  1. బాగరాసావు సోదరా!! కొన్ని నష్టాలని పూడ్చలేం. ఎవరి వ్యూ వారికి ఉంటుంది -
    ఇంతలో మళ్లీ మొదలయ్యాయి వీధినాటకాలు. మీడియా నాలుగు సినిమా పాటలతో, ఎస్సెమ్మెస్‌లతో శవం మీద చిల్లర ఏరుకుంటుంది. నాయకులు శోకాలు ఢిల్లీకి వినిపించాయి. సీటుకావలనేవారు గుట్టుగా బేరాలు.
    ఇదే ప్రపంచం.

    ReplyDelete
  2. "అన్నింటికంటే ప్రధానమైంది ప్రాజెక్టుల్లో అవినీతి. ఇప్పటిదాకా ఇచ్చిన మామూళ్లు చెల్లవు. దందాలు మళ్లీ మొదటికి వస్తాయి. " well said ఆరకంగా ప్రాజెక్ట్త్లు లేట్ అవుతం మాత్రం జరగబొయేదే. ఆ ప్రాజెక్ట్లు కంట్రాక్ట్ లు తెచ్చుకోని (నానా ప్రలోభాలు పెట్టి), , ఆ తర్వాత ఎవరి వాటా వాళ్లకు వాళ్లు వాళ్లు సంతృప్తి పడేలా పర్సెంటేజీలు ఇచ్చిన కంట్రాక్టర్స్ పరిస్థితి ఆలోచిస్తే భాదగానే ఉంది.

    ReplyDelete
  3. "కుటుంబపెద్దగా ఆయనలేమిని అందరికంటే ఎక్కువ అనుభవించేది భార్యాబిడ్డలే..." మిగతా విషయాలెలా ఉన్నా ఇది నిజం!
    నిన్నంతా మనసు మనసులో లేదు..అయ్యో ఎక్కడ చిక్కుకుపోయారో అని..బాగా రాసారు చైతన్యా..

    ReplyDelete
  4. guys do not be hipocrats..The most corrupted and criminal died...I am Happy, waiting for the more the deaths of other corrupted politicians.

    People say YSR has coreage, I agree... but it is not right to show the courege for corruption.

    Kukka chaavu chachhadu..veellandai saakishiga

    1)To make chenna reddy out of CM seat, he made war between Hindu and Muslims in old city killing many innocent.

    2)Looting thousands of crores people money.

    3)killing several anti-congress people.

    4)Playing with hinduisum and Tirumula..

    ReplyDelete
  5. చైతూ ఒక్కసారి మళ్ళా ఆలోచించు నువ్వు చెప్పింది 100% నిజమేనా...!!!చచ్చిన వారి గురించి చెడ్డగా మాట్లాడటం మన సంస్కృతి కాకపోవచ్చు.... కానీ !! ఆమహాతల్లి ని బొట్టులేకుండా చూడాలంటే ఆఊరోళ్లకి ఎంత ఇబ్బందో? అన్నావు నిజమై వుండి వుండ వచ్చు....ఎంత మంది కి బొట్టు మిగల్చకుండా చేసాడో తెలుసుకదా? వెంకన్న కి ఏడుకొండలు అవసరం లేదు ... వేలాంకిణి కి అరుకొందలిద్దాం... వెంకన్నకి ఒకటి చాలులే అన్నాడు...Converted christians కి SC,ST హోదా అంట....సెజ్ లు అంట.. అన్నీ తుగ్లక్ చేష్టలే.... వాడు పోయి ప్రభువుని ప్రార్థిస్తే తొలకర్లంట... మిగతా పార్టీ power లోకి వస్తారని వరుణుడి పరారంట... ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభలోనే తిట్టడాలు.......సోనియమ్మ మూతి నాకుడు బేరాలు. నియంత మాదిరి భారత దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్స్ బినామీ లతో సొంతవారికి ధారాదత్తం......నిజమైన Fractionist...మరి నువ్విలా... నిజమే నీ బ్లాగ్ లో నీ అభిప్రాయాలు...నీ ఇష్టం కానీ నువ్వు కూడా ఇలాగే...

    ReplyDelete
  6. Who the heck are you anonymous? Talking like a bitch. Aren’t you a big hypocrite? You are not even having guts to show your identity and you jut out from a hole to jeer on a “Praja Neta”? Come out and comment with your identity …

    ReplyDelete
  7. Respected Bhaskara Rami Reddy... I guess you know this is the WEB-LOG of others..More over this is not a forum to debate/argue.......I am one of the followers...I logged my views.... As well you can log your own.. If the owner of the blog doesn't like/want any of the posts;he has the right to delete those posts...I don't know which anonymous you are feferringto.. but this is Siva Kumar(Posted in telugu Script)...If some one is posting anonymously it doesn't mean that the guy has no guts or getting scared of others...... There could be possibility of technical issues as well......

    ReplyDelete
  8. @ భాస్కర్ రామరాజు: ఇలాంటి ప్రపంచంలోనే బతకాలన్నా మనం.
    @ అజ్ఞాత1: ఇది ఎవరికీ పట్టని సమస్య. ప్రభుత్వానికి ప్రాజెక్టుకట్టి తమగొప్పతనాన్ని నిరూపించుకోవాలి. ప్రజలకి నీళ్లొచ్చి అంతా సుఖపడిపోవాలి. కానీ రిస్కుని తీస్కొనేది నిజంగా కాంట్రాక్టారే. కానీ అతను మాత్రం అందరి దృష్టిలో వ్యాపారి. ఏం ప్రజలంతా నీళ్లుకావాలి అనుకొనేవాళ్లైతే ఆప్రాజెక్టు కట్టేప్పుడు పనిచెయ్యొచ్చుగా? ఇది అడిగేవాడు ఉండడు. ఎవడు మాత్రం తనజేబులోని డబ్బుపెట్టి దివాలాతీసెయ్యాలి అనుకొంటాడు.
    @ భాస్కర రామి రెడ్డి, తృష్ణ : ధన్యవాదాలు.
    @ అజ్ఞత2: నేను దేశం గొప్పనాయకుడిని కోల్పోయింది అని రాశానా. లేక ఆయన మరోమహాత్ముడు అన్నానా? ఇప్పుడు జరిగిన దుర్ఘటన వివిధ వర్గాలపై ఎలా ప్రభావం చూపుతుందో నాకుతోచిన కోణాల్లో విశ్లేషించాను. హిందూవ్యతిరేకి అన్నది సమాజంలో అన్నివర్గాలకు ఆయనపై ఉన్న అభిప్రాయం. కానీ ఆయన నమ్మిన మతధర్మాన్ని పోయేదాకా వదల్లేదు. మిగతా నాయకులు నిజంగా అంతగొప్ప హిందువులైతే వాళ్లంతా ఎమిచేస్తున్నట్టు? మతమార్పిడులు బాబుహయాంలో జరుగలేదా? ఆయన తిరుమలలో కూల్చిన వెయ్యికాళ్ల మంటపం సంగతేవిటి? ఇప్పుడూ ఇవన్నీ అలోచించే సమయం కాదు.

    ReplyDelete
  9. చావు పరిష్కారం కాదు. అదేపరిష్కారం అనుకొంటే ప్రజాస్వామ్యానికి అర్ధంలేదు. తిరిగి మద్యయుగంలోకి వెళ్ళిపోదాం. పైగా ఇప్పుడు జరిగింది క్లిష్టసమయంలో. ఈసంఘటన మరోముప్పై ఏళ్ల తరువాత జరిగినా కుటుంబసభ్యులకు లోటే.అది ఎవరూ పూరించలేనిది. పార్టీ విషయానికి వస్తే నెంబరు2 ఎవరు అని ఆలోచించాల్సిన అవసరంలేదు అనుకొన్న సమయంలో జరిగింది. ఇది రానున్న కొన్నేళ్లలో విపరీతమైన ప్రభావం చూపుతుంది. రాజకీయ సమతాస్థితి దెబ్బతినవచ్చు. బాబుకు ప్రత్యామ్నాయం? ఇది మళ్లీవిపరీత పోకడలకు దారితీయవచ్చు. ఇక ప్రజల విషయానికి వస్తే ఎన్నికలు అయిన కొన్నినెలలకే జరగడం ద్వారా తలెత్తే పరిస్థితుల భారం మోసేది ప్రజలే.

    ReplyDelete
  10. @ అజ్ఞాత(ఆంగ్లం): 1. పాతబస్తీ అల్లర్ల విషయంలో హస్తం ఉన్న నేతలువేరే. కానీ వై. ఎస్. పేరు మీడియాలో ఎక్కువగా వినిపించేశారు అన్నది నా అభిప్రాయం.
    2. ఎవరు దోచుకోలేదు. పనికి ఆహారం పధకంలొ 30వేలకోట్ల సంగతేంటి. ప్రాజెక్టుల్లో ఎన్నికోట్లు తిన్నా మనకు చూసేందుకు కొంత ప్రగతి కనిపిస్తుంది. మరి ఆకరువు డబ్బులు ఎవరి కడుపు నింపింది?
    3. చావును నేను సమర్ధించను అని ముందే చెప్పాను.
    4. దీనికి కూడా ఇప్పుడు జరిగింది పరిష్కారంకాదు.

    ReplyDelete
  11. Sivakumar gaaru,(Telugu scrpt anonymous): I said there is a way to express your views, no one object. My english comment was for english script anonymous. Since your comment appeared as Anonymous, there was no way to identify you from the other.


    ఇక అసలు విషయం .. లమ్డీ కొడుకు, కుక్క చావు.. ఏరకం సంస్కారం? ఇది వేరే వాళ్ళ కామెంట్ కాబట్టి వదిలేద్దాం. మీ కామెంట్

    >>ఎంత మంది కి బొట్టు మిగల్చకుండా చేసాడో తెలుసుకదా?

    **మీ దగ్గర అలా ఎవరన్నా వాపోయారా?

    >>వెంకన్న కి ఏడుకొండలు అవసరం లేదు ... వేలాంకిణి కి అరుకొందలిద్దాం... వెంకన్నకి ఒకటి చాలులే అన్నాడు...Converted christians కి SC,ST హోదా అంట....సెజ్ లు అంట.. అన్నీ తుగ్లక్ చేష్టలే....

    ***హిందూ ముసుగులో గుడులు / గుడిలో లింగాన్ని మ్రింగినా పరవాలేదు కదా? లేకా క్రిష్టియన్ గా వుండి అమ్మాయిల తార్చినా ok కదా? ఓ క్రిష్టియన్ అని తెగ గుంజుకుంటున్నారు, క్రిష్టియన్ అనేవాడు ఎవడన్నా ఎప్పుడైనా గుడికి వెళ్ళటం మీరు చూశారా?

    >>వాడు పోయి ప్రభువుని ప్రార్థిస్తే తొలకర్లంట...

    **ఇది ఏరకం సంస్కారం? మీకు నమ్మకం లేకపోవచ్చు , ఒక్కసారి పల్లెలకెళ్ళి చూడండి. డు నాట్ మిక్స్ సైన్స్ విత్ బిలీఫ్.
    >> ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభలోనే తిట్టడాలు...

    ** అసలు సభలో సమస్యలు చర్చించడం నాకు తెలిసాక చూడలేదు.

    >>సోనియమ్మ మూతి నాకుడు బేరాలు
    ** ఏం బాబుగారు నాకలేకపోతున్నారని దిగులా?

    >> నియంత మాదిరి భారత దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్స్ బినామీ లతో సొంతవారికి ధారాదత్తం..

    ** If can, go and get one.
    >> నిజమైన Factionist...

    ** నువ్వు నీ ప్రక్కనింటివాడికి కూడా Factionist గా కనిపిస్తావో లేదో ఓసారి కనుక్కో

    ReplyDelete
  12. >>guys do not be hipocrats
    వావ్!! నువ్వనుకున్నట్టు అనుకోకపోతే హిపోక్రాట్లేనా?

    ReplyDelete
  13. కాలం గొప్ప న్యాయ నిర్నేత కనుకే ఇలాంటి చావులు జరుగుతాయి మనం ఎమి చేయలేము కదా...............

    నీ బాధ చూడలేక ..ఆ మహా"తల్లి" బొట్టు పెట్టుకుని బైబిలు చేతపెట్టుకుని ప్రచారం చేస్తోందిలే...బాధపడకు నాయనా...ఆ ఇటలీ లో పుట్టి మన దేశం లో మెట్టిన మరో మహాతల్లి బుద్ధి లేక ఈ హిందు సమాజన్ని ఎదిరించలేక బొట్టు తీసెసుకుని బోడి గా బ్రతుకుతూ ఉంది ఆమే తో పోల్చుకుంటే ఈ మహా "తల్లి" గొప్ప క్రైస్తవురాలు కదా క్రీస్తు మురిసి పోతాడు(బి ఎ రోం ఇన్ రోం)...

    ReplyDelete