శుభవార్త 2

మొదటిభాగం

ఆరోజు మద్యాహ్నం ఎందుకో అనుమానం వచ్చి ఆన్‌లైన్ ఫారం తెరిచాను. ఇప్పుడుకాదు రెండురోజులాగు అనింది. ఎందుకో బాగాఇంటెరెస్టింగ్ అనిపించి రెండురోజులాగాక తెరిచా.
వెబ్‌సైట్లో బాగాతరచి చూశాక ఇప్పటిదాకా అభ్యర్థులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలకు పరిష్కారం దొరికింది. అవీ
  1. నోటిఫికేషన్ ఒకటాబులో పొందుపరిచారు. ఇది పాతవెబ్‌సైటులోకూడా ఉండేదే. అందులోనే మరొకవిభాగంలో నింపేందుకు సంబంధించిన సూచనలు, నియమాలు పెట్టారు. అభర్థి అవసరమైనంతమేర ముద్రించుకోవచ్చు. సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూర్తిగా చదవాలంటే విసుగొచ్చేంత ఉంటుంది. బహుశా సిలబస్ కన్నా ముందుగా నోటిఫికేషన్ అర్థంచేసుకోవాలేమో. అందులో అభ్యర్థి తనఆప్షనల్‌కు సంబంధించినంత వరకుమాత్రమే ముద్రిమ్చుకోవచ్చు.
  2. మరొక టాబులో- రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలున్నాయి. రిజిస్ట్రేషన్ రెండుస్థాయిల్లో ఉంటుంది.
    1. మొదటిది- ఇక్కద నొక్కగానే గడువుదాటని నోటిఫికేషన్లన్నీ కనిపిస్తాయి. అందులో మనకు కావల్సినదాన్ని చూసి అక్కడ క్లిక్ చెయ్యాలి. దీనవల్ల సాంప్రదాయక ఫారంలో ఘోషణనింపే పని పూర్తయినట్టె. క్లిక్ చేసినవెంటనే డేటాబేస్‌నుంచి ఆనోటిఫికేషన్ సంబంధించిన అంశాలను తీసుకుంటుంది.
    2. 'కంటిన్యూ' నొక్కాలి.
    3. ఆతర్వాత దరఖాస్తు నింపవలసిన పేజీ తెరుచుకుంటుంది.అక్కడ అభ్యర్థి తనవక్తిగత వివరాలు నింపాలి.
    4. అటుపై వయసుసంబంధించిన సడలింపులు, పరీక్షాకేంద్రం వివరాలు నింపాలి. ( యూపీఎస్సీ నిబంధనలనుసరించి అనేకవర్గాలకు వయసు సడలింపులు ఉన్నాయి. ఆవివరాలు నోటిఫికేషన్లో తెలియజేస్తారు.)
    5. తర్వాత ఆప్షనల్స్ ఎంచుకోవాలి.
    6. ఇప్పుడు, ఇప్పటిదాకా నింపిన వివరాలను చూపెడుతూ ఒకపేజీ ప్రత్యక్షం అవుతుంది. ఏవైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కింద ఘోషణలో వివరాలు నింపినచోట ఒకవర్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని నింఫి, షరతులకు ఒప్పుకుంటే మొదటిదశ పూర్తయ్యినట్లే.
    7. అప్పుడు లభించిన రిజిస్ట్రేషన్ ఐడీని నోట్‌చేసుకోవాలి.
  3. రెండవదశ- మొదటిదశలో లభించిన రిజిస్ట్రేషన్ ఐడీ, జన్మదినవివరాలు నింపితే రెండవదశలోకి వెళ్తాం.
    1. ఇక్కడ ఫీజుకు సంబంధించిన వివరాలు ఉంటాయి.మొదటిదశలో మీకు ఫీజుమినహాయింపు సూచించినట్లైతే ఇక్కడ ఈపేజీ బైపాస్ అవుతుంది. మొదటిదశలో ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, స్త్రీలు వీటిలో ఏదినింపినా ఫీజుమినహాయింపు ఆటొమేటిగ్గా లభిస్తుంది.
    2. ఫీజు మూడురకాలుగా చెల్లించవచ్చు.
      1. మొదటిది-ఇక్కడ వచ్చే పీడీఎఫ్ పేస్లిప్‌ను బాంకులో జమచేసి, వివరాలునింపి దాన్ని పోస్టుద్వారా పంపడం.
      2. రెండవది- వీసాలేదా మాస్టర్‌కార్డు ద్వారా నింపడం
      3. ఆన్‌లైన్ అకౌంట్ ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ ఆన్‌లైన్ ద్వారా నింపడం. ప్రస్తుతానికి మూడు విథానాల్లోనూ కేవలం ఎస్బీఐ ఖాతాదారులకే అవకాశం కల్పించారు. సింహభాగం వాళ్ళే ఉన్నందువల్ల అనుకుంటా. భవిష్యత్తులో మరిన్ని కలిపే అవకాశం ఉంది.
    3. అటుపై, అభ్యర్థి తన పాస్‌పోరర్ట్ సైజు ఫోటోను, సంతకాన్ని స్కాన్ చేసి .png ఫార్మాట్లో 140X110 pixel (not exceeding 40kB) తమవద్ద ఉంచుకుని, వాటిని అప్‌లోడ్ చెయ్యాలి.
  4. అంతటితో మీదరఖాస్తు నింపినట్లే+పంపినట్లే. నిజమే.పంపడం కూడా అయిపోయింది. అటుపై దరఖాస్తు పూర్తిపేజీ ప్రత్యక్షం అవుతుంది. అక్కడి వివరాలు సరిచూసుకుని ఒకప్రింటుతీసి మీదగ్గర పెట్టుకుంటే చాలు. ప్రస్తుతానికి పంపాల్సిన అవసరంలేదు.
  5. అక్నాలెడ్జిమెంట్ మీరు వ్యక్తిగతవివరాలలో నింపిన మైల్‌ఐడీకి వస్తుంది.
ఒక్కసారి సాంప్రదాయకపద్దతిని పోల్చిచూస్తే ఎన్నోసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
  1. అప్లికేషన్లు ఆన్‌లైన్లో ఉంటాయి. ఊరూరావాడవాడల్లో ఇంటర్నెట్‌కేఫ్‌లుంటున్న ఈరోజుల్లో మారుమూల గ్రామంలోని అభ్యర్థికి జిల్లాకేంద్రంలోని పోస్టాఫీసుకన్నా ఇదేదగ్గర.
  2. అప్లికేషన్లు అయిపోయాయి అన్నసమస్యలేదు. స్టాంపులకోసం ఝంఝాటంలేదు.
  3. నింపేప్పుడు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారైనా ఉంది. 
  4. దరఖాస్తును పొస్టుచెయ్యడం, గడువుకుముందే చేరిందోలేదో అన్న భయం ఉండదు.
  5. అక్నాలెడ్జిమెంట్ కొన్నిక్షణాల్లో వస్తుంది.
  6. ఖర్చు చూద్దాం-
    1. సాంప్రదాయకపద్దతిలో-  జిల్లాకేంద్రానికి చార్జీలు 50/- నుంచి 100/- (RTC ఈమద్యలో కన్నెర్ర చెయ్యకుంటే) + అప్లికేషను మామూలుగా అయితే 20/- గిరాకీ ఎక్కువగా ఉంటే 200/-+ జనరల్ అభ్యర్థులకు స్టాంప్ 100/-+ పోస్టలు చార్జీలు 30/-= 100/- నుంచి 380/-
    2. ఆన్‌లైన్‌లో- ఇంటర్నెట్టు సెంటరుకి 20/- + ఫీజు జనరల్ అభ్యర్థులకు 50/- + స్కానింగ్ (ఫోటో+ సంతకం) 15/- (కావాలంటే సెల్‌ఫోన్లోంచే తీసుకోవచ్చు) +  ప్రింటు (మనకోసమే) 3/- = 23/- నుంచి 88/-
ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మార్చి 3 వరకు సమయం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ అప్లికేషన్ నింపేందుకు ఫిబ్రవరి22 11:59 pm వరకే అనుమతించారు.

    7 comments:

    1. 'గుర్తుకొస్తున్నాయి...' పాడించేశారు కదా..
      ఇంజినీరింగ్ సర్విస్ సాధించ బోతున్నందుకు ముందుగా మీకు నా మనః పూర్వక అభినందనలు.. మీరు సాధించగలరని నాకు గట్టి నమ్మకం.. ఎందుకు చెబుతున్నానో అనైనా అనుకుని సివిల్స్ విషయం మరొక్కసారి ఆలోచించండి.. Wish you all the very best..

      ReplyDelete
    2. manchi samachaam andinchaaru....
      All the best!

      Murli anna maate naa maata...miru Civils rayalsinde....Krishna

      ReplyDelete
    3. @మురళి: నేనెక్కడ నింపానండీ? కొలీగ్‌వాళ్ళ అమ్మాయికి నింపించానంతే. సివిల్స్ గడువుదాటిపోయిందండీ.
      @ అజ్ఞాత కృష్ణుడు: రాయాల్సిందే అంటే ఏమంటామండీ

      ReplyDelete
    4. "సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూర్తిగా చదవాలంటే విసుగొచ్చేంత ఉంటుంది."

      ....:)....so nice of you to be very honest..:)

      (don't mind ..just kidding)

      ReplyDelete
    5. Pch.. You disappointed me a lot. Of course, it is purely your personal issue. For Civils, you have to begin preparation at least a year in advance. Once again, I am wishing you all the best..

      ReplyDelete
    6. చాలా బాగుంది. ఈ టపాను ఇలాగే వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ వెలువడేదాకా భద్రంగా దాచిపెట్టి, ఇప్పటిలాగా ఆలస్యంగా కాకుండా, నోటిఫికేషన్ వెలువడగానే వేసెయ్యి. అఫ్‌కోర్స్, కూసింత మార్పులు చేసి. అప్పటికి ఆన్‌లైన్ చాలామందికి అలవాటవుతుందిగా అందుకని. అప్పుడు శుభవార్త అని కాకుండా మరో టైటిలెట్టు. :))) ఇంకా ఎవర్ గ్రీన్‌ టపాగా ప్రతీ సంవత్సరం వేయొచ్చు. :)))

      ReplyDelete
    7. అయ్యో !మురళి గారిని ఎందుకు డిసప్పాయింట్ చేస్తారు ?మీ ఫేస్ లో కలెక్టర్ కళ ఉందేమో !అందుకే అంత ఇదిగ మిమ్మల్ని అడుగుతున్నరేమో !ఒక రాయి విసిరి చుడండి (99శాతం కృషి ,1శాతం లక్ అనుకోండి). సివిల్స్ అప్లికేషనుగురించి చాల చక్కగా వివరించేరు ,తెలియని వాళ్ళకి బాగా ఉపయోగ పడుతుంది .మీరు IES తో పాటు IAS సాధించాలని ఆశిస్తు.....all the best.

      ReplyDelete