అన్నప్రాశన

పుట్టినప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మల దగ్గర. దాదాపూ ఎనిమిదో తరగతి దాకా అమ్మమ్మ దగ్గరే. ముందే చెప్పాకదా అమ్మమ్మ ఇల్లు- తాత బడి అని. ఇక ఊర్లోనే పిన్ని, అత్త, చిన్నమామ మొదలైన స్టాండ్‌బై ఆప్షన్లు. ఎప్పుడైనా అమ్మ ఊర్లో లేదంటె, ఎప్పుడో ఎలక్షను డ్యూటీమీద తప్ప ఆమె ఊరిని వదలదు, ఇన్ని ఇళ్లమద్య పెద్దగా లోటు తెలిసేదికాదు.

ఆమెచేతి ముద్దతింటూ అలాఅలా పెరిగి పెద్దైపోయా. మొదటిసారి ఇంటరు చదివేసి అల్లూరి సీతారామరాజులాగా దేశాకాలమాన పరిస్థితులు తెలుసుకుందామని నెల్లూరులో హాస్టల్లో చేరా. అక్కడ సత్రంభోజనం మఠంనిద్ర. మళ్లీ ఇంజనీరింగుకి ఊళ్లోనే. ఉదయాన్నే అన్నంబాక్సు పట్టుకుని జరుగుమల్లి-కొత్తపాళెం బస్సెక్కితే సాయంత్రం కాఫీకి కర్రీస్ మల్లాం. తరువాత కాన్‌పూర్లో, త్రిచీలో ఇంటరుకి డిటో. అక్కడి నుంచి పురుషుడను అని నిరూపించుకునేందుకు నోయిడా మీదుగా వారణాసిలో ఉద్యోగం. ఎక్కడికి వెళ్లినా మనకు తోడు నలుడు భీముడు వాళ్ల ఆర్కుట్ కమ్యూనిటీలోంచి ఎవరో ఒకడిని పంపుతూనే ఉన్నారు.


అసలు ఈకథ అంతా ఎందుకు అంటే... ఇన్ని సౌకర్యాల మద్య మనకు కాపసాశ్త్రంలో( దాని స్పెల్లింగుకూడా సరిగా రాదు) అదీ పారిస్థితి. వంటలో నాకొచ్చిందల్లా అమ్మ ఎప్పుడైన కుక్కర్‌లో అన్నీ పడేసి, వైయిట్ పెట్టి "ఒరెయ్ మూడు విజిల్లు సరేనా " అంటే కరక్టుగా లెక్కపెట్టి ఆపెయ్యటం.

వండడంలో కే.జీ దాటక పోయినా తినడంలో మాత్రం పీ.జీ. ఎవరు ఏది వండినా తప్పులెంచకుండా గిన్నెని ఖాళీచేసి కడుపునింపెయ్యగం. ఈవిషయంలో మామ్మకి నేనొక గుడ్‌బోయ్.

ఇక బ్లాగు లోకంలోకి వచ్చేసరికే నలభీములు, సునీతగారు ఎట్సెట్రా ఒక్కొక్క వంటా వర్ణిస్తుంటే చదివి కడుపునింపుకుంటున్నాను. ఈమద్య తృష్ణగారు కూడా పొయ్యిరాజేశారు. ఇంతలో మొన్న పాప ఆన్‌లైన్‌లో చిన్న షాకు. "అన్నా! (అదెప్పుడూ అలా పిలవదు. అలా ఊహించుకుంటుంటా. అందుకే ఆ ఆశ్చర్యార్ధకం.) నేనుకూడా బ్లాగు మొదలెట్టా. స్రవంతివటిల్లు అని."

అప్పుడనిపించింది ఇక్కడ ఏదో లెక్కతప్పుతోంది అని. తినేవాళ్లంతా వంటగాళ్లు కానక్ఖర్లేదు. కానీ వండేవాళ్ల్లంతా తినేవాళ్లే. అంటే తినేవాళ్లు యూనివర్సల్ సెట్ అయితే వండేవాళ్లు అందులో ఒక సబ్‌సెట్. వండేవాళ్లు ఎక్కువై తినేవాళ్లు తగ్గితే సమతుల్యం దెబ్బతింటుంది అందుకే ఈరోజు నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఒక్కొక్క పదార్ధాన్ని ఎలా తినాలో రాయాలని డిసైడ్ అయిపోయా.
ఈరోజు అన్నప్రాశన( కాబట్టి ఆవకాయను పెట్టట్లేదు.)

  1. ముందు వేడివేడిగా ఆవిర్లువచ్చేప్పుడు(ఉఫూ ఉఫూ మంటూ ఊదుకుంటూ అయినా) అన్నాన్ని ప్లేటులో వేసుకోండి.
  2. కొద్దిగా వెన్నముద్దనిగానీ నెయ్యిని గానీ దాంట్లో వెయ్యండి. ఆవేడికే కరిగి అంతా కలిసిపోవాలి.
  3. ఇప్పుడు కొద్దిగా ఉప్పువెయ్యండి.అన్నం మరీ ముద్దగాకుండా పొడిపొడిగా కలపండి.
  4. వేడితగ్గి గోరువెచ్చగా అయినప్పుడు ముద్దలు చేస్కుని ప్లేటులో పెట్టుకోండి.
ఇప్పుడు అమ్మ లేదా అమ్మామ్మ లేదా నానమ్మ దగ్గర కూర్చోండి.
ఇప్పుడు మనకి ముద్దలు కలిపే ఓపిక వాళ్లకి ఉండదు కాబట్టే ఆరెడీమేడ్ ముద్దల సెట్టింగ్ అన్నమాట.
ఒక్కక్కొక్కటీ తీసుకుంటూ ఇది అమ్మముద్ద, ఇది నాన్నముద్ద, ఇది స్వర్ణముఖిముద్ద, ఇది నెమలికన్నుముద్ద అలాఅలా ఖాళీచేసేయ్యండి.
ఇంతకీ అమ్మావాళ్లను ఎందుకు పిలవమన్నట్టు అంటే పూర్తయ్యిన తరువాత కొంగుతో మూతి తుడుచుకోవాలిగా.
ఇప్పుడు అసలు డ్యూటీ.
పరుపుమీద ఎల్లకిలా పడుకుని పైన గిరగిరా తిరుగుతున్న తెల్లటి క్రాంప్టన్& గ్రీవ్స్ ఫాన్ వంకచూస్తూ నిద్దర్లోకి జారుకోవడం.

18 comments:

  1. iraga deesnav anna.....

    ReplyDelete
  2. అంటే నలభీమ ముద్దలేదన్నమాటేగా. నే అలిగాపో

    ReplyDelete
  3. "పిన్ని, అత్త, చిన్నమామ మొదలైన స్టాండ్‌బై ఆప్షన్లు. "
    హ హ హ. ఆ వొక్క వాక్యానికి నీ నోట్లా పాయసం పొయ్యొచ్చు :)

    ReplyDelete
  4. >>ఈరోజు నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఒక్కొక్క పదార్ధాన్ని ఎలా తినాలో రాయాలని డిసైడ్ అయిపోయా...
    Great concept. సరికొత్త అలోచన. ఇంతవరకూ ఎవ్వరూ అంటుకోని సబ్జెక్ట్. అలానే రాసెయ్యండి వెనక్కి తిరిగి చూడకుండా.

    ReplyDelete
  5. * నా ముద్ద కూడా లేదు..నేనూ అలిగా..:( :(

    ** "ఎల్లకిలా" కాదమ్మా "వెల్లకిలా"

    *** "ఎవరు ఏది వండినా తప్పులెంచకుండా గిన్నెని ఖాళీచేసి కడుపునింపెయటం"
    ఈ వాక్యం బాగా నచ్చింది నాకు.నీకు మంచి వంట చేసే భార్యా ప్రాప్తిరస్తూ..!!

    ReplyDelete
  6. 'ప్రాసన' కాదా?

    ReplyDelete
  7. చిన్న మిస్టీకు.. ఖాళీ కంచం లో అన్నం పెట్టుకోకూడదుట.. బామ్మ డీటీఎస్ లో అరిచేది, మాకు మేముగా కంచాల్లో పెట్టుకుని తినే రోజుల్లో.. అందువల్ల చేత శాస్త్రానికైనా ముందు కొంచం ఆవకాయ వేసుకోవాల్సిందే :-) బాగుందండీ టపా.. అన్నట్టు ఓ సరదా సంగతి.. ఇప్పటికీ ఎప్పుడు హోటల్ కి వెళ్లి వడ తింటున్నా.. స్పూన్ తో దాన్ని చిదమడం లో ఆ వడ ఓ లాంగు జంపు జంపి ఏ వెనుక కూర్చున్న ప్లేట్లోనో ఉరుకుతుందేమో అని కొంచం భయపడుతూ ఉంటాను.. మీ సిలబస్ లో వడ తినడం కూడా చేరిస్తే ఆ ప్రకారం ముందుకు పోవచ్చు...
    @అబ్రకదబ్ర: నాకు తెలిసి 'అన్నప్రాశన' అనే వాడతారండీ..

    ReplyDelete
  8. @ అజ్ఞాత: పేరు రాయొచ్చుకదా? ధన్యవాదములు
    @ భాస్కర్ రామరాజు : నాకంటే ముందు నీకే పెట్టాకదన్న. 'నాన్నముద్ద ' ఇది రాసిన తరువాతే ఆరకంగా రాయాలని తట్టింది.
    @ కొత్త పాళీ: మీరెక్కడుంటారో చెప్పండి. విదేశాల్లో అయితే ఇక్కడకు వచ్చేప్పుడు ఒకటపా పెడితే పాయసంకోసం వచ్చేందుకు రెడీ.
    @ సునీత: ధన్యవాదాలు
    @ తృష్ణ: సారీ. ఇప్పుడు థాంక్స్.
    @ అబ్రకదబ్ర: దీని గురించి చిన్న చర్స జరిగింది ఇద్దరి ముగ్గురితో. చివరికి అలహాబదు బెంచ్ ధర్మాసనం 2-1 తేడాతో ప్రాశనవైపే వొగ్గింది.
    @ మురళి: మా అమ్మమ్మకూడా అలానే చెప్పేదండీ.

    ReplyDelete
  9. ఉత్త అన్నం కంచంలో ఎందుకుపెట్టకూడదూ?
    అంటే!!
    సాధారణంగా పితృకార్యాలప్పుడు అలా చేస్తారు కాబట్టి.

    ReplyDelete
  10. ఏమిటి ఉత్త వెన్న & ఉప్పుతో అన్నమా? ఎప్పుడు వినలేదు కనలేదు ఈ కాంబినేషను :(

    ReplyDelete
  11. @ శ్రావ్య: కనకపోయినా వినకపోయినా ఒకసారి తినిచూడండి.

    ReplyDelete
  12. మా వాడు ఉత్త అన్నం నెయ్యి అదేమిటిరా అంటే డాటలు చెప్పాడంటున్నాడు మరి :)

    ReplyDelete
  13. (వేడి వేడి ) అన్నం + నెయ్యి + ఉప్పు.. సూపర్ కాంబినేషన్.

    ReplyDelete
  14. చైతూ పాత నిమ్మకాఊరగాయ మరచినట్లున్నావ్... అన్నం + నెయ్యి + ఉప్పు + పాత నిమ్మకాఊరగాయ(ఉప్పు ఊరగాయ)..కేక combination..అయినా వెరే టపా లో పెట్టాలనుకున్నావేమో కదా?? Any how a very nice Write-up !!!

    ReplyDelete
  15. కొంగుతో మూతి తుడుచు కోవటము అలవాటైతే కష్టమే ! కనీసం మీరు భోజనం చేసేటప్పుడైనా చీర కట్టుకోవాలని మీ కాబోయే ఆవిడకి కండీషన్ పెట్టాలి మరి. ఇప్పటికే ఆవిడ వస్తే చెప్పలేననుకో !
    బాగుంది .

    ReplyDelete
  16. @ రాజేంద్ర కుమార్ దేవరపల్లి: అర్ధం కాలేదండీ
    @ శివన్న: కరక్టుగా గెస్ చేశావన్నా. ఇది తరవాత సిలబస్
    @ మాలాకుమార్: ధన్యవాదాలు

    ReplyDelete
  17. "మా వాడు ఉత్త అన్నం నెయ్యి అదేమిటిరా అంటే డాటలు చెప్పాడంటున్నాడు మరి :)
    "ఇందులో అర్థం కాక పొయేదానికి ఏముంది.. వాళ్ళ అబ్బాయి చిన్నవాడై వుంటాడు... వాడికి ఈ combination ఇష్టం... వద్దంటె.. డాక్టర్ చెప్పాడంటాడు..... అంతే....Am I right Rajendra Garu?

    ReplyDelete
  18. మీలాంటి సంసారులకు ఈపదజాలం అర్ధం అవుతుంది కానీ నాబోటి బెమ్మచారుల పరిస్థితి?

    ReplyDelete