సుడికొద్దీ

రోజూలాగానే ఆవులిస్తూ ఫైలు తిరగేస్తున్నా. పక్కకి తిరిగి సూత్తే రవన్న కూడా సేం సీన్.
అబ్బా ఈజీవితం శానా బోర్ గురూ అనుకొంటూ ఉంటే ట్రింగ్.. ట్రింగ్ .. ఇంటర్‌కాం మోగింది.
ఇటైపు చైతన్య అటైపు ఎవురూ.
నేను చైతుగాడి బాసు గాడిని.దెబ్బకి వదిలింది నిద్ర
"ఆర్యులకు సుప్రభాతం మీకు ఏరకంగా సేవలు "అందించగలను ( అంటె నెను ఉండెది సాకేతిక సేవల విభాగం)
"ఎంటనే ఉన్నఫళంగా నారూంకి వొచ్చేయ్."
"వాకే సారు" అంటూ మూడో ఫ్లోరునుంచి ఉరికా.
లిఫ్ట్ వేరేకాడ ఉంది దీన్ని నమ్ముకుంటే కుదరదు అని ఒక 50 కెలోరీలు ఉపయోగించి రెండతస్తులు దిగా. నడుస్తున్నానే గానీ మనసులో కొంచెం టెన్షన్. మామూలేకదా. అసలే ఆ మృతికా పరీక్షల వాడు లేటు చేస్తున్నాడు అడిగితే ఆకశం పక్క దిగ్గులు చూస్తాడు. ఇంకో రెండు పనులు మొదలవబోతున్నై. వేటి గురించి అడుగుతాడొ. మనదగ్గర సమాచారం ఉందో లేదో?
బాసు కేబిన్ ముందు కొంచెం చొక్కా సర్దుకొని లోపలికి వెళ్ళా.
లోన ఫాక్స్ మిషనుకాడ మూర్తి, ముందు కుర్చీలో బిపిన్, పక్కన శ్రీవాస్తవ అందరిపక్కా చూశా ఏమైనా హింటు ఇస్తారేమోనని. ప్చ్ లభంలేదు.
నేను ఒకకుర్చీలో కూర్చోబోతుండగా "ఆగు" అన్నాడు.
గుండెఝల్లుమంది. ముందు ఆయన చెబితేతప్ప కూర్చునే వాడిని కాదు. కానీ ఆయన నువ్వురావటంతోనే కూర్చో ఆతరువాతే ఏవిషయం ఐనా మాట్లాడు అన్నాడు చాలాసార్లు. పూటకి పదిసార్లు తిరిగేవాళ్లు మీరు వచ్చిన ప్రతిసారీ లాంచనాలంటే కుదరదు అన్నాడు. ఇప్పుడేమో ఇలా. ఏవిటొ ఈబాసులు. ఎప్పటికీ అర్ధంకారు. కవులంతా ఆడవాళ్లను గూర్చి అంటారు కానీ ఎవరైనా ఆఫీసులో పనిసేత్తెగా తెలిసేది వీళ్లని అర్ధం చేస్కోవటం ఎంతకష్టమో?
లేచి వెనక ఆబీరువామీద ఉండే కవరుతీస్కో అన్నాడు.
దానిదగ్గరకు పోతుంటే కొంచేం శుభశకునాలే కలిగాయి.
కవరుతీసి సూతే అందులోలడ్డు, జిలేబీ, మిక్సరుపొట్లాం, మైసూరుపాకు మొదలైనవి.
నా ఆత్రంగమనించాడొ ఏమో.. అన్నీకాదు కొంచేం పక్కవాళ్లకుకూడా ఉంచు అన్నాడు.
సరే అందాం అంటే అప్పటికే నోరు బిజీ.తలని అడ్డానికి రెండుసార్లు ఆడించి అది తప్పుడు సంకేతమని నాలుగుసార్లు నిలువుకు ఆడించా.అబ్బా ఎంతమంచిబాసో.
పుణ్యంకొద్దీ పురుషుడు.. దానంకొద్దీ బిడ్డలు
సుడికొద్దీ బాసులు.
దీన్ని సదివినోల్లు ఓసారి మీబాసులసేతకూడా సదివించండి. భూమ్మీద ఇంకా ఇలాంటోళ్లు ఈకలికాలం ఉన్నారని తెలుస్తాది. మీబాసుకు తెలుగురాక పొతే తెంగ్లీష్లోనో హింగ్లీషులోనో అనువదించండి.

17 comments:

 1. ప్రమోషన్ కొట్టేసినట్టున్నారు.. అభినందనలు.. అవునూ..ఇది నెల్లూరు యాసా?

  ReplyDelete
 2. మీ టపా మా బాసుకు చూపించాననుకోండి..ఏమంటాడో తెలుసా! "ఓస్..అంతే కదా! ఈ మాత్రం దానికి నాకు దీన్ని చూపించటమెందుకు?" అని బెల్ కొట్టి బాయ్ ని పిలిచి "మన ఫ్రిజ్ లో నెలకిందట క్లయింట్ వస్తే కొన్న స్వీట్లు మిగిలాయి కదా! అందులో రకానికొక స్వీటు కవర్ లో పెట్టి ఆ బీరువా మీద పెట్టు..శేఖర్ కి కావాలంట" అని అంటాడు. ఏం చేస్తాం..మీరన్నట్టు వట్రసుడి కొద్దీ బాసులు..

  ప్రమోషన్ కొట్టేసినందుకు మీకు అభినందనలు.

  ReplyDelete
 3. కయితకం ఎక్కడా లేదుగా, ప్రమోషన్ వచ్చిందని ఎలా తెల్సిపోయింది అందరికీ?
  ఏమైనా స్పీట్లు హాట్లూ!! అభినందనమందారాలు జిలేబీలూ...అన్నట్టు బారణాసిలో జిలేబీ మస్తు గురూ!!

  ReplyDelete
 4. అలొ అలొ అలో...ఇంతకీ ప్రమోషన్ వివరాలు చెప్పనేలేదు..?అభినందనలు.

  ReplyDelete
 5. అభినందనలు!

  ReplyDelete
 6. అబయా...ప్రమోషన్ ఒచ్చిందా? నా జిలేబి యాడబయా..?

  నీ బ్లాగు బాగుందబయా!

  ReplyDelete
 7. @ మురళి: ఒక యాసంటూ ఏమీలేదండి. అన్నీ కలిశాయి. ఒక ప్యూర్ నెల్లూర్ టపా పెడతాలేనో. ప్రతి టపాలోనూ మీరు జనాల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ఇంతకుముందు పెళ్లిగురించి ఇప్పుడు ప్రమోషను. ఎమైనా బావుందాండీ.
  @ శ్రావ్య,తృష్ణ, సనైటా: థాంక్స్
  @ శేఖర్ పెద్దగోపు: ప్రమోషను అన్నమాట ఎక్కడైనా ఉందా?
  @ భాస్కర్ రామరాజు: ప్రమోషన్లు కాదన్నా. బాయిలరు ఓవరాలింగ్ మొదలుపెడుతూ పూజచెస్తే అక్కడ ఇచ్చారట. అవిమాకూ పెట్టాడు. ఇక్కడ స్వీట్లు ఎక్కువ తింటారు. బావుంటాయి.
  @ శ్రీ : మీ కాలాస్త్రి ఓతూరి చూశాగానీ మిస్స్ అయ్యింది. ఎక్కడుందబ్బా అనుకొంటే ఈరోజు తగిలారు. మనం మనం దగ్గిరోళ్లమే. మాది వాకాడు.

  ReplyDelete
 8. ఓ...వాకాడా?
  నేను విద్యానగర్ లో బీ.టెక్ చేసా.తూపిళిపాళెం 2 సార్లు వెళ్ళాను. వాకాడులో మా స్నేహితుడు రాయవరపు కోటేశ్వరరావు ఉండేవాడు.మీకు తెలుసా? ఇతనూ విద్యానగర్ లో చదివాడు.

  ReplyDelete
 9. @శ్రీ: మీరు ఇంకా దగ్గిర. కాళాస్త్రి అన్నప్పుడే అనుకొన్నా మాఊర్లోనే చదువుంటారేమోనని. నేనుకూడ ఐ.ఎస్.టీనే. 2000-04 బాచ్ సివిల్. మీరు ఏ బాచ్. తూపిలిపాళెం ఇంతకుముందు 2,3 నెలలకోసారి వెళ్లేవాడిని. ఇప్పుడుమాత్రం ఇంటికి వెళ్ళినప్పుడే.

  ReplyDelete
 10. నేను జనాన్ని మిస్లీడ్ చేస్తున్నానా? యెంత అన్యాయంగా మాట్లాడుతున్నారు చైతన్య గారూ.. మీరేమీ చెప్పకపోతే మేమేం చెయ్యాలి చెప్పండి? మాకు తోచినట్టు ఊహించుకోడం కూడా తప్పేనా? మనలో మనమాట.. అందరూ నా నోరు మంచిది అంటారు.. నేనేమన్నా అంటే అది జరుగుతుందిట.. కాబట్టి.....

  ReplyDelete
 11. @ Murali : మురళీ గారు, నేను చెన్నై నుంచి బయటకి రావాలని అనండి :)

  ReplyDelete
 12. ఇంతకీ మీకు ప్రమోషన్ వచ్చినట్టా..రానట్టా??
  మరి మీ బాసు మిఠాయి ఎందుకిచ్చినట్టు??
  మీరెందుకు తిన్నట్టు..??

  ReplyDelete
 13. @ మురళి: ఐతే వాకే. నిజమేనండొయ్. నేను వర్షం గురించి రాసినప్పుడే చెప్పానుగా. మీనోరు మాంచిది.
  @ గణేష్: నువ్వు వాతలు పెట్టాల్సింది నేను రాసిన వాటిమీద. ఇక్కడ పెట్టిన వాతలపై కాదు.
  @ స్వాతి: బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు. బాసు మిఠాయి ఎందుకు ఇచ్చాడొ భాస్కరన్నకి చెప్పను పైన ఒకసారి చూడండి. ఇక నేనెందుకు తిన్నాను అంటారా? ఇచ్చేవాళ్లు ఎందుకు ఇస్తున్నారో అలోచించాలిగానీ తినేవాణ్ణి నాకు ఎందుకు.

  ReplyDelete
 14. ఓ...మీరు కూడా ఐ.ఎస్.టీ నా?

  నేను 90-94 బాచ్.

  ReplyDelete
 15. @శ్రీ: అంటె మీరు నాకంటే 10యేళ్లు ముందు

  ReplyDelete