నమోహిందు మాతానమోహిందు మాతా సుజాత నమో జగన్మాత
మాతా నమోహిందుమాత సుజాత నమో జగన్మాత

విపుల హిమాదృలే వేణీభరముగ
గంగాయమునలే కంఠ హారముగ
ఘనగోదావరి కఠిసూత్రముగా
కనులకు పండువ ఘటించుమాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత

గోలుకొండనీ రత్నకోశమట
కోహినూరు నీజడలో పువ్వట
తాజమహలు నీ దివ్యభవనమట
ఆహాహా నీభాగ్యమే మాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత


ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం. రాసిన మహానుభావుడి పేరు తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది. ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు, దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.

5 comments:

 1. నమో జగన్మాతా

  ReplyDelete
 2. భరతమాతా మీకు ప్రణామములమ్మా...జైహింద్!!!

  ReplyDelete
 3. Timely Remembrance..... Good work....

  ReplyDelete
 4. చిన్నప్పుడు మాకు కూడా మ్యూజిక్ క్లాస్లో నేర్పించారు.ఇంకా గుర్తు ఉంది ఈ పాట నాకు.

  ReplyDelete