రాష్ట్ర పర్యటన

శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య గారి రాష్ట్ర పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. గతనెల 25న వారణాసి నుంచి రైలుమార్గం ద్వారా రాష్ట్రంలోకి సిర్పూరు-కాగజ్‌నగర్ వద్ద ప్రవేశించారు. పర్యటనలో భాగంగా పలువురు అధికారులు, నాయకులు కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రొటోకాల్ సమస్యల కారణంగా వీలుపడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను అనుమతించలేదు. 27న స్వగ్రామానికి చెరుకొన్న ఆయన మొదటిమూడు మూడు రోజులు వ్యక్తిగత పనులతో బిజీగా గడిపారు. ఆపనుల వత్తిడి కారణంగా మూడురోజుల్లో 5కిలోలు పెరిగారు( అంటె అన్నంలో తల్లిప్రేమ కొంచెం ఎక్కువైంది అన్నమాట.)

నెల్లూరులో స్నేహితుని పెళ్లికి వెళ్లి పూర్వాశ్రమపు హితులను కలిశారు. తరువాత ఇంటికివెళ్లి 2రోజులు మళ్లీ తల్లిప్రేమను నింపుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని అభిమానులను కలిశారు. 5వతేదీ వరకు జిల్లాలోని వివిధప్రాంతాలను దర్శించి, సింహపురి బండికి భాగ్యనగరానికి చేరుకొన్నారు. నగరపర్యటన వివరాలు ఆయన మాటల్లోనే.

6వ తేదీ ఉదయం 8కి హైదరాబాదుకు చేరుకొన్నా. నేను చెన్నై బెంగుళూరు, డిల్లీ, మంగుళూరు, వారణాసి, కాన్‌పూరు, తిరుచ్చి, ఎర్నాకులం మొదలైన ఊర్లన్నీ తిరిగానుగానె ఈ ఊరితో నాకున్నది బీరకాయ పీచు చుట్టరికం. మొదటిసారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కి( అప్పట్లో ఒక్కచోటే జరిగేది.) 2000 డిసంబరులో వచ్చాను. తరువాత 2003లో జే.ఎన్.టీ.యు. లో ఒక పేపరు ప్రెజెంట్ చెయ్యటానికి వచ్చాను. రెండుసార్లు ఉదయం నారాయణాద్రి దిగి సాయంత్రం చార్మినార్కి తిరుగుప్రయాణం. నాకు తెలిసింది సికిందరాబదు స్టేషను, కూకట్‌పల్లి, మాసాబ్‌టాంక్. మూడొసారి 2008 మేలో జిందాల్ వాడు ఇంటర్వ్యూకి పిలిచాడు. ఈసారైనా సిటీచూద్దాం అంటే వాడుకూడ ఏంజీరోడ్డులో పెట్టాడు. ప్రాజెక్ట్ సమర్పణ అనే బృహత్కార్యాన్ని పూర్తిచేయాల్సి రావటంతో కనీసం స్నేహితుల్నైనా కలవకుండానే వేళ్లిపోవాల్సి వచ్చింది. అలా హైదరాబాదు అనేది నాకు ఒక ఎండమావిలా తయారైంది. ఎవరైనా ఏవిషయంపైన ఐనా మాట్లాడుతూ ఉంటే వాళ్లలోకి ఎంచక్కా దూరిపోయి నోటికొచ్చింది వాగేసే నేను అనబడే నేను ఒక్క హైదరాబాదు గురించి మాత్రం ఫక్తుశ్రోతలా మారిపోతాను. నాకు హైదరాబాదు తెలుసు. నేను విన్న టాంకుబండు, సెక్రటేరియట్, ఖైరతాబాద్, మాదాపూర్, కూకట్‌పల్లి, మైత్రీవనం( స్నేహపుతోట), తార్నాక, మొదలైన ప్రాంతాలతో నాకునేనుగా ఒక భాగ్యనగరాన్ని కట్టుకొన్నా. ఎప్పుడు హైదరాబాదు పేరు విన్నా మనసు నానగరంలోకి వెళ్ళి చక్కర్లుకొట్టి ఒక అరగంట తరువాత తిరిగివచ్చేది. మొత్తానికి పవనుగాడి పెళ్ళిపుణ్యమా అని 3రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్కొన్నా.

రైలు దిగిన వెంటనే మావాడికి ఫోనె చేస్తే రేతిఫైల్(ఈపదం అర్ధం కావడానికి అరగంట పట్టింది. అదికూడా బోర్డుచూసిన తరువాత.) బస్టాండుకి వచ్చి కాచిగూడ రమ్మన్నాడు. అక్కడ హోటల్ మంజీరలో రూము. స్నానంచేసి కోఠిమీదుగా దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి పెళ్ళికొడుకు బట్టల్లోని పవన్ గాడిని కనీసం పలకరించకుండా ముందు భోజనం బంతుల్లో కూలబడ్డా. తరువాతవాడే వచ్చి అందరినీ వాళ్ల ఇంట్లో పరిచయం చేశాడు. అక్కడినుంచి పంజాగుట్టలో గిఫ్టు ఒకటికొనుక్కొని తిరిగి కాచీగూడ వెళ్ళిపోయాం. రాత్రి 1వరకు పెళ్ళిచూసి మావాడిని అంకుల్‌నిచేసి వచ్చేశాం.

ఉదయం హరిగాడిని అడిగితే హబ్సీగూడా వెళ్తున్నా అన్నాడు. వాడితోగూడా ఉస్మానియా మీదుగా హబ్సిగూడకి చేరి నేను నాచారంపక్క ఒకచుట్టువేశాను. తిరిగివచ్చేసరికే వాడుకూడా పనిముగించుకొని నాతోకలిశాడు. సాయంత్రం అమీర్‌పేట్ బిగ్ మూవీస్‌లో అడవికి తికెట్లు తీశాను అని మా శనిగాడు ఫోన్ చేశాడు. నగరంలో మొదటిసినిమా వాడిది ఎందుకు తీశావురా అంటె అవే చవగ్గా దొరికాయిరా అన్నాడు. సినిమాచూసి( దాన్ని సినిమా అన్నందుకు క్షమించాలి. 100 టికెట్‌లో 70రూపాయలు నిషాకే అనుకోవచ్చు.) అక్కడే రాజధాని భోజనం కానిచ్చి మూసాపేట్ మీదుగా కూకట్‌పల్లికి వెళ్లా.

ఉదయానేలేచి తిరిగి రూంకి వచ్చి ఖాళీచేసి బంజారాహిల్స్ లో ఇంకో ఫ్రెండ్‌ని వెళ్లా. వాడేదో పరీక్ష ఉంది అంటే నేను జీవీకే1లో స్నేహితుడా చూసొచ్చా. (పర్లేదు. కామెడీఎ ఉంది. నానిఒగాడితో హీరోయిన్ బానే పోటీపడింది. పెద్దగా లాజిక్కులు తీయకుండా కేవలం ఎంజాయ్ మాత్రమె చెయ్యాల్సిన సినిమా.) వాడింకా రాలేదు అంటే రూంలోనే ఓయ్ కూడ కవర్ చేశా. ఇంతలో ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి స్నేహపుతోటకి రారా అంటే అక్కడికివెళ్ళి అలానాల్గు వీధులు తిరిగి అందాల్ని వీక్షించి రీలోడ్ అయ్యాను. అక్కడే రాత్రికి నాగపూర్‌బస్సుకి టికెట్ తీస్కొని తిరిగి రూంకెళ్ళి ఫ్రెండ్స్ తో ఓగంట హస్కేసి బాగ్ సర్దుకోని 10కి బయల్దేరా. ఒకటి మాత్రం నిజం. నేను ఇప్పటిదాకా చూసిన అన్ని సిటీల్లోకి హైదరాబాదే బెస్ట్. చెన్నైలో అరగంటకే విసుగొచ్చేది. బెంగుళూరులో మొదటివారం పర్లేదుకానీ తరువాత చాలా స్లోగా ఉంటుంది లైఫ్. బద్దకం చాలా పెరుగుతుంది. ఇక డిల్లీ విషయానికి వస్తే మనంకొంచెం తక్కువమాట్లాడుకొందాం. నోయిడా పర్లేదు. మిగతా ఊర్లూ అంతే. కానీ ఇక్కడ ఎంతతిరుగుతున్నా శరీరం చురుగ్గానే గానే ఉంది. అన్నింటికీ మించి బస్సుబోర్డులు తెలుగులో ఉంటాయి కాబట్టి ఆసుఖమేవేరు.

అలా రాష్ట్రపర్యటన ముగించి 9వతేదీ ఉదయం నాగపూరు చేరుకొని, అక్కడ రాబోతున్న కొత్తప్రాజెక్టులో పనిచేస్తున్న తన మాజీ రూంమేట్‌ని కలిసి వెరైటీచౌరస్తాలో సాయంత్రంవరకు గడిపి, అక్కడినుంచి జబల్‌పూర్‌కి బస్సులో చేరుకొన్నారు. అక్కడున్న పాతస్నేహితులను ఇద్దరిని కలిసి రాత్రికి శక్తిపుంజ్‌కి తిరిగి నివాసానికి చేరుకొన్నారు.
ఇంత తిరిగిన పనికిమాలిన వాడికి కోతికొమ్మచ్చి కొనేందుకు తీరికలేదు. క్షమించగలరు.

7 comments:

 1. ఏందీ కిన్డెలా? అహా!! తెలవక అడుగుతా! కిన్డెలా అంటా!! దిల్ఖుశ్ అదే అదే దిల్షుక్నగర్ కాణ్ణుంచి పన్జాగుట్టకి గిఫ్ట్ కొన్టానికి బొయ్యి అదో కోఠీ మీనగా, ఆణ్ణుండి పెళ్ళికిబొయ్యి, ఆణ్ణుండి అమీర్పేటబొయ్యి, అన్నీ ఒక్కరోఝులోనే!! కలగానీ కన్నావేటి సిన్నా?? దిల్ఖుష్ నగర్ కాణ్ణుంచి కోటిమీనగా పన్జాగుట్ట పోవాల్నంటె కనీసం కం సే కం దో దిన్ రెండ్రోజులు పట్టుద్ది. నువ్వు, అబ్బే!! ఏదో అదే అదే హైదరాబాద్ సూత్తన్నానోచ్ అనే ట్రాన్స్లో ఉండి సరిగ్గా గమనించినట్టులేవు. ఏంపర్లేదు..తగ్గిపోద్ది.
  భాస్కర్ రామరాజు

  ReplyDelete
 2. హైదరాబాద్ లో మీరే వాహనంలో ప్రయాణించారో తెలుసుకోవాలని నాక్కూడా కుతూహలంగా ఉందండి.. 'రాజధాని' భోజనం మావాళ్ళెవరికీ నచ్చదు కానీ, నాకెందుకో నచ్చుతుంది.. 'స్నేహితుడా..' చూడొద్దని ఓ స్నేహితుడు వార్నింగ్ ఇచ్చాడు.. మీరేమో రికమెండ్ చేస్తున్నారు.. మీరింకా సొంతూరు చూసిన నిషా నుంచి బయటపడలేదేమో అని అనుమానంగా ఉంది నాకు... అన్నట్టు మీరు సెట్టింగ్స్ మార్చనంటే ఒకటి అడుగుతా.. మీ ఫ్రెండ్ ని అంకుల్ చేశారు సరే.. మరి :-) :-) :-)

  ReplyDelete
 3. ఆహా! చాలా రోజుల తరువాత వచ్చావు మిత్రమా :)
  నాకు హైదరాబాద్ భోజనం నచ్చదు.
  మనవాళ్ళు స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారు.
  ఏమో నేను చెన్నై కి అలవాటు పడిపోయానేమో ):-?
  కంఫోర్ట్ జోన్ లోనుంచి బయటకు వచ్చి చూడాలి.

  ReplyDelete
 4. @ అజ్ఞాతరాజు: మరిమీరు సెప్పేది ఏంటి కిండెలుకాదా? ఓతూరి ఇటువైపు అంటే వారణాసిపక్క రా అన్నోయ్ అసలు ట్రాఫిక్కు అంటే ఏవిటో తెలుస్తుంది. ఈసందుల్లో బండినడిపి ఆరోడ్లు సూత్తుంటే లండను మహానగరంలా ఉన్నాయి నాకు.
  @ మురళి: స్నేహితుడా గురించి చెప్పానుగా..కేవలం ఎంజాయ్ చెయ్యాలి. లాజిక్కులు తీయకూడదు. ప్రస్తుతానికి ఇంతకంటే సినిమాలేవీ కనిపించలేదు నాకు. 'నిషా' ఎక్కింది మాఊర్లోకాదండీ. అడవిలోనే. ఇంకాచాలా మందిని అంకుళ్లను చెయ్యాలి. ప్రస్తుతానికి ఇదేనా ఆశయం, కర్తవ్యం.
  @ గణేష్: ఏంటి నాయనా నీకు మద్రాసు భోజనం నచ్చిందా? ఎవడైనా చేతబడి బాణామతి లాంటివి నీపైన ప్రయోగించాడేమో కనుక్కో. బెజవాడలో పుట్టి కారం నచ్చదు అంటావా? ఆయ్.

  ReplyDelete
 5. సాఫ్టువేరు పుణ్యమాని 24 ఏళ్ల వయసులోనే అన్ని రోగాలు మీద పడ్డాయి మహాప్రభో.
  సో కారం తినకూడదు. ఇంకా హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ.
  ఇంతకూ ముందు నేను నీ లాగే అనుకునేవాణ్ణి.
  తరువాత అర్థం అయ్యింది "దూరపు కొండలు నునుపు అని".

  ReplyDelete
 6. పర్యటన కబుర్లు బాగున్నాయి.మరి నా తూ.గో.జీ.ప్రయాణపు కబుర్లు కూడా చదవవలెను!!

  ReplyDelete
 7. @తృష్ణ : మీరు వెంటనే వ్రాయవలెను

  ReplyDelete