ఎందుకిలా? !!!

తీరికలేనంతగా బిజీనా? అంటే కాదు. మనసేమైనా బాలేదా? అంటే అలాంటివి ఎలా ఉంటాయో మనకస్సలు టచ్‌లేదు. పోనీ ఏమైనా ఇబ్బందులా? అంటే ఉన్నవన్నీ మామూలే. కొన్నిసమస్యలు నెలలుగా మరికొన్ని ఏళ్ళకేళ్ళు అలానే పడున్నాయి. అస్సలు ఎందుకిలా?!!! అంటే సమాధానంలేదు.

ఎమైందో తెలీదు. ఈమద్య బ్లాగులో టపాలు పెట్టేసంగతి దేవుడెరుగు కనీసం దాన్ని తెరిచి చూసేందుకు రెండుమూడురోజులు పడుతుంది. అలాగని మోజు తగ్గిందా? అంటే నాబ్లాగు నాకెప్పుడూ గొప్పే. రాయడానికి విషయాలు లేవా? అంటే ఇప్పటికిప్పుడు ఓరెండు సెకన్లు కళ్ళు మూసుకుంటే డజనుకు తక్కువలేవు. అయినా ఎందుకిలా?!!! అంటే పిచ్చిచూపులతో దిక్కులుచూస్తూ నిలబడతా.

చివరిటపా పాడుతాతీయగా మీద రాశాను. రాసి రెండునెలలైంది. అదిరాశాక ఓనెలపాటు బాగా బిజీగా ఉన్నాను. ఆసమయంలో రాయటం కష్టమే. ఆతర్వాత ఇంటికెళ్ళా. బాగా రిలాక్సయ్యి తిరిగొచ్చా. ఆతర్వాత రాయడానికి తగినంత తీరుబడి చాలినన్ని విషయాలు ఉన్నాయి. అయినా ఎందుకో కీబోర్డు కదలట్లేదు.

నాబ్లాగులో రాసే సంగతి దేవుడెరుగు. నేను రెగ్యులర్గా చదివేది ఓ ఆరేడు బ్లాగులు. మిగతావి ఫ్రెండెవడైనా లింకుచూడు బాబూ అని పంపితే చూస్తా. వాటిల్లోనూ వ్యాఖ్యలు రాసి రెండుమూడునెలలవుతుంది. ఎప్పుడైనా బ్లాగుచూడాలని బాగా అనిపిస్తే పాతటపాలని ఓసారితిరగేసి "శభాష్ బిడ్డా!" అనుకుని మూసేస్తున్నా కానీ ఇంకోటిరాద్దాం అన్న ధ్యాసేలేకుండా పోయింది. ఎప్పుడొ రాసిన టపాని ఒకదాన్ని మళ్ళీచదివి మనసుని రిఫ్రెష్ చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. జవహర్లాల్ అన్నట్టు "నేను గతంలో రాసినదేదైనా కొంతకాలం తర్వాత చదివితే అది నేను రాసిందిగాకాక నాలాంటి భావలున్న మరోవ్యక్తి నాతో తనఆలోచనలను పంచుకుంటున్నట్టుంటుంది.". ప్రతిఒక్కబ్లాగరు ఆమాటకొస్తే ప్రతిఒక్కమనిషీ ఏదోఒకసందర్భంలో తనకుతాను చేసుకున్నే సింహావలోకనం ద్వారా ఎంతోకొంత ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కొన్నిసందర్భాల్లో పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉంటాడు.
మద్యలో గూగులమ్మ ఇంకోకిటికీ తెరిచింది. 'బజ్' అని పిలకాయలంతా అక్కడె కాపుకాస్తున్నారు. టీ20 వచ్చి వన్‌డేలని మింగేసినట్టు, ముమైత్ వచ్చి సిల్క్‌ని మరిపిమ్చినట్టు ఈబజ్జొచ్చి బ్లాగుల్ని బజ్జోపెట్టింది. ఆరువాక్యాల్లో చెప్పేదాన్ని అరవాక్యంతో తెగ్గొడితే ఆతర్వాత కామెంట్లు ఆంజనేయుడి తోకే. ఈమోజు బాగానే దెబ్బకొట్టినట్టుంది. కూడలిలో ట్రాఫిక్ బాగా తగ్గింది.

కానీ ఎంతకాలం పాతటపాలతో, బజ్జులతో గడుపుతాం? అందుకనే మీతో నాకు నెలకొన్న నిశ్శబ్ధాన్ని ఎలాగోలా ఛేదించి మళ్ళీరాయటం మొదలుపెట్టాలని ధృడంగా నిర్ణయించుకున్నా. మనం రాయకపోతే ఎవడికి నష్టం? కానీ రాస్తేనేగా నాకు తృప్తి. ఇకరాద్దామంటే ఇదే మంచివిషయం అని నాబాధను మీతో వెళ్ళగక్కుకొన్నా. ఇకపై తరచుగా మీఅందరినీ గోకేందుకు యత్నిస్తా.

8 comments:

 1. నా ఈపు రెడీ.... ;)

  ReplyDelete
 2. మరి కానీయండి :)

  ReplyDelete
 3. @నాగ్: మరీ అంత తొందరపడకు. గోకి చాలారోజులయ్యే సరికే గోళ్ళు ఒనిడా వాడిలా తయారయ్యయి :)
  @ హరేకృష్ణ: అట్టాగే. అక్కడకూడా అప్‌డేట్లలో టపాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడూ అంటే కనీసం వారాంతాలు ఇటొచ్చిపోతుంటే చాలు.
  @ పద్మార్పిత: తప్పకుండా. ఇక వెయిటింగ్ రానీకుండా చూస్తా.
  @శ్రావ్య: కానిచ్చేస్తా

  ReplyDelete
 4. దీనికి బజ్ కారణమొక్కటే కాదేమో?? ఏమో.. "చరణ కింకిణీలు ఘల్లు ఘల్లు" మంటున్నాయేమో... నీ గుండెలో???--Siva Kumar.K

  ReplyDelete
 5. మనం రాయకపోతే ఎవడికి నష్టం? కానీ రాస్తేనేగా నాకు తృప్తి. :)
  yes. u r right.

  ReplyDelete