మేరునగ తప్పిదం - 2. హిందీ చీనీ భాయీ భాయీ

చైనీయులు టిబెట్ మీద నెమ్మదిగా పట్టు సంపాదించడం మొదలుపెట్టారు. 9 సెప్టెంబర్ 1951, చైనా బలగాలు టిబెట్ రాజధాని ల్హాసాలోకి ప్రవేశించాయి. వాళ్ళు చెయ్యాలనుకున్న పనులన్నీ దలైలామా చేత చెయ్యించుకున్నారు. రాజకీయక్షేత్రంలో  నెమ్మదిగా మార్పులు చెయ్యడం మెదలుపెట్టారు. సైనికావసరాలకు అనుగుణంగా రోడ్లు, విమానాశ్రయాలు, సమచార వ్యవస్థలను మెరుగుపరుచుకున్నారు. వాటన్నింటినీ సైనికావసారలకు సరిపోయేంత సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో భాగంగా వారు తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు కొంతభాగం భారత భూభాగమైన అక్సాయ్ చిన్ గుండా వెళ్ళాల్సి రావడంతో దాన్ని ఆక్రమించుకున్నారు. 

ఇటువైపు భారత్ పరిస్థితి పూర్తిగా తలకిందులుగా ఉంది. సైనిక సామర్థ్యం సంగతి దేవుడెరుగు కనీసం రహదారి నిర్మించారన్న సమాచారంకూడా భారత ప్రభుత్వానికి అందలేదు. తీరా విషయం తెలిశాక కొన్ని బృందాలను పంపితే వాటిని చైనా నిర్బంధించినా అడిగే నాథుడే కరువయ్యాడు. దీని గురించి పార్లమెంటుకు ఎందుకు సమాచారమివ్వలేదు అని అడుగిన ప్రశ్నకు జవాబిస్తూ నెహ్రూ " దానిగురించే చర్చించే సందర్భం రాలేదు." అని చెప్పాడు.

1953కల్లా టిబెట్లోని అన్ని ముఖ్యమైన పట్టణాల్లో చైనాప్రభుత్వం తన సైనికావసారలకనుగుణంగా మౌలికవసతులను నెలకొల్పింది. 1954లో
మెక్‌మహాన్‌రేఖ వెంబడి ఒక రహదారి, దాన్ని దేశంలోని మిగతాప్రాంతాలకు కలుపుతూ మరికొన్నిదార్లను పూర్తి చేసింది. వందలకొద్దీ యువటిబెటన్లను చైనాకు తీసుకెళ్ళి కఠోరశిక్శణను ఇప్పించి వార్ని టిబెట్లోని ముఖ్యమైన శాఖల్లో నియమించింది. వారంతా శిక్షణపూర్తయ్యేసరికే కరడుగట్టిన కమ్యూనిష్టులుగా మార్చేసింది. భారత్ నుంచి సహాయం అలానే మిగతావ్యవహారలన్నీ చక్కబెట్టుకునేందుకు సమయం కావాలి కాబట్టి సరిహద్దు  వ్యవహారాలను కదిలించలేదు. వ్యూహాత్మకంగా హిందీ చీనీ భాయీ భాయీ అనే పల్లవి అందుకుంది. ఇద్దరి మద్యనా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం, పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వగైరాలతో కాలం వెళ్ళబుచ్చారు.

ఆసమయంలో 
భారత్‌కు ఒకవైపు కాశ్మీర్ అంశం పీటముడి వేసుకుని గింజుకుంటోంది. మరోవైపు నెహ్రూ తన మానసపుత్రిక అయిన పంచవర్షప్రణాళికను ప్రకటించి దాన్ని అమలుపరచడంలో నిమగ్నమయ్యాడు. దేశమంతా దీనిమీద ఎన్నోఆశలు పెట్టుకుని ఫలితాలను బేరీజు వేసుకుంటోంది. టిబెట్ లో వర్తకవాణిజ్యాలు, ఇతర సంబంధాల మీద చైనా భారత్ లు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని పీఠికలో పొందుపరిచిన ఐదు సూత్రాలు పంచశీల సూత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. అవి 1. పరస్పర గౌరవం 2. ఒకరి మీద మరొకరు దాడి చెయ్యకుండటం. 3. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకుండటం. 4. సమలాభం 5. స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటం




ఈ ఒప్పందం ద్వారా చైనాకు జరిగిన మేలులో పదోవంతు కూడా మనకు దక్కలేదు. చైనీయులు మాటిచ్చిన సత్ప్రవర్తనకు ప్రతిగా మనం 
టిబెట్‌ను పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నాం. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా ఒప్పుకున్నందుకు సమానమైనదేదీ భారత్ అడగలేదు. దీనివల్ల బ్రిటీష్ వాళ్ళ ద్వారా మనకు సంక్రమించిన టిబెట్ వ్యవహారలపై అధికారం, అక్కడి సమాచార వ్యవస్థ, సైనిక కార్యకలాపాల వంటి కీలకమైన హక్కులు చైనాకు తేరగా ధారపోశాం. ఈ ఒప్పందాన్ని సమర్థించుకుంటూ నెహ్రూ తన ప్రకటనలో చైనా పట్ల తనకున్న నమ్మకాన్ని ప్రస్పుటంగా తెలియజేశాడు. ఈచర్యల ద్వారా చైనా భారత్ల మద్య సంబంధాలు బలపడతాయని ప్రగాడంగా విశ్వసించాడు. నెహ్రూ బతికున్నంత వరకూ చైనాతో యుధ్దంరాదు అన్న నినాదం దేశమంతా బయలుదేరింది. అన్నిప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వ విధానాల్లోనూ, ప్రజల మాటతీరులోనూ ఈవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. రెండు దేశాల మద్యన సంబంధాలు ఒకవ్యక్తి చుట్టూ తిరిగితే ఎంత ప్రమాదకరమో బహుశా భారతీయులకు అప్పుడు తెలిసుండకపోవచ్చు. నెహ్రూ మరణాన్ని జయించిన వాడేమీ కాదు. ఒక దార్శనికునిగా, రాజనీతిజ్ఞునిగా ఆయన శక్తియుక్తుల మీద ఎంతనమ్మకమున్నా దేశభవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాల్లో పార్లమెంటు, కేబినెట్ వారివారి అస్థిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ ఆయన బతికుండగానే యుధ్దం వచ్చింది. "చరిత్రలో ఎన్నడూ భారత్ చైనాల మద్య యుద్దం రాలేదు. ఇకపై రాబోదు" అని ప్రకటించడం ద్వారా చైనా అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్‌ను వ్యూహాత్మకంగా వాడుకుంది. అలీన దేశాల నాయకునిగా, శాంతికాముక దేశంగా భారత్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న మంచిపేరును చైనా తన అవసరాలకనుగుణంగా ఉపయోగించుకుంది.

భారత్ చేసిన మరొక వ్యూహాత్మక తప్పిదం- పంచశీల సమయంలో టిబెట్- 
భారత్‌ల మద్య సరిహద్దును చర్చించకపోవడం. అసలు టిబెట్ ఎక్కడ వరకు ఉందో చెప్పకుండానే టిబెట్‌ను చైనాకు ఇవ్వడం ఘోరమైన తప్పిదం. చైనా 1954లో భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు చౌ ఎన్ లై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా సరిహద్దు ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పడం ద్వారా హెచ్చరించినా భారత్ బుర్రకి ఎక్కలేదు. తర్వాత నెహ్రూను చైనా ప్రభుత్వం ఆహ్వానించి రాజలాంచనాలతో సత్కరించింది. నెహ్రూ పూర్తిగా సంతుష్టుడయ్యి డిల్లీ తిరిగొచ్చాక చైనాతో యుధ్ధంరాదు అని చెప్పడంతో చైనా తనవ్యూహాన్ని పక్కాగా అమలు పరచినట్టయ్యింది.

1952లో జనరల్ కుశ్వంత్
సింగ్‌ను దేశ ఉత్తర సరిహద్దుల పరిస్థితిపైనా, చైనాతో మనకున్న ముప్పుపైనా నివేదికను ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆయన సమర్పించిన సుదీర్ఘ నివేదిక అటకెక్కింది. ఆయన సూచించినవేవీ అవసరంలేదని కాబినెట్ ఏకగ్రీవంగా తేల్చేసింది. కానీ ఆతర్వాత కనీసం రోడ్లు, సమాచార వ్యవస్థ, ఇంటిలిజెన్స్ వంటివి కూడా అభివృద్ధి చెయ్యకపోవడం ఘోరతప్పిదం.

దేశవిభజన తదనంతర పరిస్థితులు, పాక్ అమెరికా పంచన చేరటం ద్వారా మారిన సమీకరణాలు, అంతర్యుద్ధం ఇత్యాది కారణాల వల్ల భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా పాకిస్థాన్ పక్కనుంచి ఉన్న ప్రమాదాన్ని చూసుకుంటూ చైనాసమస్యను చిన్నచూపు చూసాయి. అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనికసహాయం అందటం ద్వారా పాకిస్థాన్ రక్షణ శక్తి ఇబ్బడిముబ్బడీగా పెరిగే ప్రమాదం పొంచుకొచ్చింది. భారత్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసినా అమెరికా మాటివ్వడంతో మరోసారి మనదేశభద్రతను మరొకరి చేతుల్లో పెట్టి వాళ్ళనోటిమాటతో తిరిగొచ్చాం.
అయితే 1965లో యుధ్ధం వచ్చినప్పుడు పాకిస్థాన్ అమెరికా సమకూర్చిన ఆయుధాలతో దాడి చేస్తుంటే అమెరికా కట్టడి చెయ్యకపోవడం గమనార్హం.

మారిన సమీకరణాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు రష్యా 
భారత్‌కు సహాయం చేస్తానని ముందుకొచ్చినా నెహ్రూ దాన్ని నిరాకరించడం ద్వారా అలీన విధానానికి మనసా వాచా కర్మణా తానెంత కట్టుబడి ఉన్నాడో చెప్పడం భారతీయుల మనసుల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ ఆయన మీద అపారమైన గౌరవభావం పెంపొందేలా చేసింది.

ఈరకంగా 1950-55 మద్యకాలంలో చైనా గుట్టుగా తనసామర్థ్యాన్ని పెంచుకుంటూ 
భారత్‌కు జోలపాడి నిద్రపుచ్చింది.

5 comments:

  1. "...రెండు దేశాల మద్యన సంబంధాలు ఒకవ్యక్తి చుట్టూ తిరిగితే ఎంత ప్రమాదకరమో..."

    Golden Words.

    "...బహుశా భారతీయులకు అప్పుడు తెలిసుండకపోవచ్చు..."

    Many knew but to no avail. Entire nation was obsessed and hypnotised with Nehruvian thought.

    British people have shown what should be done with a leader drunk with success by defeating Churchil immediately after WW2.

    Similarly in 1952 (first ever elections in India) Nehru should have been defeated and had it happened, country would have been saved from sycophancy forever. Of course, unfortunately this is in hindsight that too there is no unanimity.

    Sometimes, I just wonder had there not been Nobel Peace Prize whether all these things would have happened.

    ReplyDelete
  2. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయాక నెహ్రూ చాలా విషయాల్లో స్వేచ్చని కోల్పోయాడనిపిస్తుంది. ప్రాశ్చాత్యప్రపంచం ఆయన్ని చాలా తెలివిగా ఇరికించిందనిపిస్తుంది నాకు.

    ReplyDelete


  3. ' సోషలిస్టు ' చైనా మీద భ్రమలు,శాంతికాముకత్వం ,రక్షణావసరాలపై శ్రద్ధ లేకపోవడం వలన నెహ్రూ తప్పుచేసాడు.ఐతే నవభారత నిర్మాణానికి మంచి పునాదులు వెయడం వలన క్షమించవచ్చును.గతచరిత్ర నుంచి ఇప్పటికైనా పాఠం నేర్చుకొని మనదేశ రక్షణ వ్యవస్థను బాగా గట్టిపరచడమే ముఖ్య కర్తవ్యం.

    ReplyDelete
  4. @సుబ్రహ్మణ్య ఛైతన్య

    వాళ్ళెవరో నెహ్రూని ట్రాప్ చేశారనే కంటె, కీర్తి కండూతి నెహ్రూని తానొక
    శాంతి దూతనని, పావురాలు ఎగరేస్తే శాంతి వస్తుందని తనని తాను
    నమ్మబలుక్కునేట్టుగా చేసింది. మనిషి పరిస్థితి చూసి అద్భుతంగా
    అంచనాకట్టగల పాశ్చాత్య దేశాల నాయకులు, ఆ పైన అప్పటి చైనా ప్రధాని చౌ-ఎన్-లై, నెహ్రూని కీలుబొమ్మని చేసి ఆడుకున్నారు. అనాటి చేతకాని వ్యవహార శైలి ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాము, మరింకెంత కాలం అనుభవించాలో తెలియకుండా ఉన్నది.

    ReplyDelete
  5. @కమనీయం

    ఎంత చదువురాని నిరక్షరాశ్యుణ్ణి ప్రధాని చేసినా, అప్పడు జరిగిన తప్పిదాలు చేసి ఉందేవాడు కాదని నేను ఘంటాపధంగా చెప్పగలను. మామూలుగా ఆలోచించగల మనుష్యులు చేసే తప్పిదాలు కాదు అవి, ఆపైన ఒక దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి చెయ్యవలసిన పనులు అసలే కావు. కీర్తి కోసం కాగిపోతున్న మనిషి చేసిన పనులవ్వి. ఆ పంచవర్ష ప్రణాళికలూ, ఆ అభివృధ్ధి అంటారా, రాజీగ్ గాంధీ కంప్యూటర్లు మన దేశానికి ఎంత తెచ్చాడో, మీరనే అభివృధ్ధీ నెహ్రూ వల్ల అంతే జరిగింది. అప్పట్లో శంకర్స్ వీక్లీలో ఈ పంచవర్ష ప్రణాళికల మీద అద్భుతమైన కార్టూన్ వేశారు. ఓక మూడు సింహాల గుర్తును పరంజాలతో పైకి కట్టి, నెహ్రూ నిచ్చనేసుకుని స్తంభాన్ని కిందకు కట్టటానికి మూడు ఇటికలు అంటిస్తూ ఉంటె నాలుగు పడిపోతూ ఉంటాయి.

    దేశ ప్రజలు కష్టపడ్డారు పంటలు బాగా పండాయి కొంతవరకూ అభివృధ్ధి సాధించుకున్నాము. ఆయనగారు చెయ్యగూడని పనులు చేసి దేశానికి రెండుపక్కలా రెండు కుంపట్లను పెట్టి ఎల్ల కాలం మన కష్టార్జితం అంతాకూడా దేశ రక్షణకే ఖర్చు పెట్టుకోవాల్సిన గతి పట్టించి పొయ్యాడు. ఇంతా చేసి పాపం ఆ శాంతి బహుమతన్నా ఆయనకు రాకపోయె.

    ReplyDelete