భలేమంచి చౌకబేరము

అమ్మలారా! అయ్యలారా! భూమికవతల ఉన్న క్రౌంచద్వీపవాసులారా!
మీద్వీపంలో(ద్వీపకల్పంలో) మాశాసనసభలో గవర్నరుసందేశానికి ధన్యవాదాలు తెలిపినట్లు బంధుమిత్రులకి ధన్యవాదాలు తెలిపే జాతర మాగొప్పగా జరగతాదంట. ఆపక్కరోజునే కాళసుక్రోరం వస్తాదంట. ఆరోజు నాబోటి ఉత్తమజాతి మానవులకి వాయనాలు గట్రా ఏర్పాటుచేస్తే చానాపుణ్యమని మొన్నమద్దెన స్కాందపురాణం చదవతాఉంటే తెలిసింది. ఈవాయనాన్ని బ్రహ్మచారులకి, అందులోనూ బ్రహ్మచారిబ్లాగర్లకి, మళ్లీవాళ్లలో ఏనదిపేరునో బ్లాగుకి పెట్టుకున్నవారికి వాయనాలిస్తే ఎఫెక్టు ఇన్‌స్టెంటంట. ఇంతపెద్దరహస్యాన్ని ఓపెన్చేసేస్తే అంతా నాకువాయనాలిచ్చి స్వర్గానికి గ్రీన్‌కార్డ్ తీసుకుంటారని ఈకత వినాయకచవితికతలో, సత్తెనారాయణసామివ్రతంకతలో చెప్పలేదంట.

కాబట్టి మీకంతా చెప్పొచ్చేదేందంటే-
మీరంతా పిల్లాజెల్లాతో కలిసి రాత్రంతా జాగారంచేసి, తెల్లవారుఝామున వైకుంఠఏకాదశిరోజు ద్వారదర్శనం భక్తుల్లాగా వాల్‌మార్ట్ వాకిట్లో నిలబడి హరినామస్మరణగావిస్తూ, వీలైతే తలుపుతీయనన్న జయవిజయుల్ని ఉరిమిచూసి (ఈపని మనలేడీస్‌కి అప్పగించండి.) చేతికిచిక్కిందంతా జవురుకొచ్చేయండి.

ఆతర్వాత మీమీబుట్టల్ని నావాకిట్లోపెడితే పుణ్యం ట్రక్కుల్లో లభిస్తాది. అంతేకాదు లచ్చిందేవి మీసాలరీ అకౌంట్లని, డీమాట్లని ప్రయారిటీ ఆర్డర్లో ముందుకునెడుతుంది. గ్రహాలు అనుకూలించిన క్షణంలో వరదగోదారిలా పోటెత్తిస్తాది. సరస్పద్దేవి మీబ్లాగుల్లో కామెంట్లు విచ్చలవిడిగా కురిపిస్తాది. భలేమంచి చౌకబేరము..ఇది సమయము మించిన దొరకదు ఎన్నారై బ్లాగర్లార...

5 comments:

  1. సోదరా: "Thanksgiving" కి వచ్చిన తిప్పలా ఇవి. నాకు తత్త్వం మొత్తం బోధపడలా. నీకు తెలుసుగా ట్యూబ్ లైట్ అని.

    ReplyDelete
  2. ఏందో నెల్లూరబ్యా.. ఇన్ని మెలికలతో జెప్పినవు. నడిమిట్ల పురాణాల్ని తీసుకొచ్చిన్నావ్. అర్ధమయిందిలే.. మీరు ట్యూబ్ లైట్ కాదు అని సేప్పుకోవాడినికేగా ఈ తపన :). అట్లే అబయా, ఎవరక్కడ.. త్వరగా తీసుకురండి..

    ReplyDelete
  3. @ గణేష్: ప్రజల్లో క్రీడాస్పూర్తి బొత్తిగా నల్లపూసైపోయింది. వయసులో ఉన్నావబ్బయ్యా ఏమైనా కొనుక్కొచ్చి ఇమ్మంటావా అనడిగేవాళ్ళె కరువైపోయారు ఆదేశంలో :)
    @ రాజేష్ జి: పురాణాలంటే ఏదో ఇన్నాటిని అలాగుర్తొచ్చినోటిని కలిపి ఏసేసినా నబ్బయ్యా. నువ్వుకూడా ట్యూబ్లైటు కాదులే :) తీసుకురమ్మనందుకు టాంక్స్

    ReplyDelete
  4. స్వర్ణ ముఖి కూడా ఇన్ని మెలికలు తిరగదుగా :D

    ReplyDelete
  5. ఈమద్యన అడ్డదిడ్డంగా మాట్టాడ్డం బాగా అలవాటయ్యింది

    ReplyDelete