అర్థాంగి

నాన్న నాలుగో తరగతిలో ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. బాల్యవివాహం! ఆపెళ్ళికి పెద్దకూడా ఆయన అన్నగారే. ఆయన పిల్లని చూపిస్తే నచ్చేసింది అన్నాడంట. ముహూర్తం, వేదిక అన్నీ ఆపెద్దే నిర్ణయించేశాడు. సమిధలు తెచ్చేసి, హోమం వేసి మొత్తానికి అందరికళ్ళూగప్పి అగ్నిసాక్షిగా మొదటిభార్యను చేతిలోకి తీస్కున్నాడు. నాతిచరామి అన్నపదాన్ని జీవితాంతం మర్చిపోకుండా పాటించాడు. పెళ్ళికి ముందే అమ్మకి కూడా పెద్దభార్య సంగతి తెలుసనుకుంటా.(గ్యారంటీ ఇవ్వలేను.) కానీ సర్దుకుపోయింది.

పెదమ్మ అమ్మలాగా సాదాసీదా కాదు. బాగా కాస్ట్లీ. మెయింటినెన్స్ ఖర్చు భీభత్సంగా ఉండేది. ఆవిషయంలో మాత్రం అమ్మకి ఆవిడకి తగవుపడేది. కానీ పట్టపురాణిహోదాలో ఆవిడమాటే చెల్లుబాటయ్యేది. ఇల్లంతా చెత్తపడెస్తే పాపం అమ్మ రోజుకు మూడునాలుగుసార్లు శుభ్రం చేసేది. అయినా చెత్త ఏదోఒకమూల ఉండాల్సిందే. బయటకూడా నాన్నపేరు చెబితే ఆపెద్దమ్మే గుర్తొస్తుంది అందరికీ. నాన్న ఎక్కడికివెళ్తే అక్కడికి వేలుపట్టుకుని వెళ్తూనే ఉండేది. అది మావలకి, తాతకి, మిగతాబంధువులకి కొంచెం బాధనిపించినా నాన్నంటే భయంవల్ల, భయం అటే అలాంటిలాంటి భయంకాదు. టెర్రర్..టెర్రిఫిగ్గా భయపడేవాళ్ళు. కొడుకైనందున నేను భయపడ్డా అర్థముందికానీ ఆయనకోపానికి వాళ్ళమ్మ కూడా భయపడేది. నీఇష్టం నాయనా అంటూ వెళ్ళిపోయేది. తర్వాత మదర్ సెంటిమెంట్లు గట్రా మామూలేననుకో! నేను బజారుకెళ్తే నారాయణశెట్టికూడా ఆవిడ గురించే అడిగేవాడు.ఆయనకు ఆవిడ తెలుసుగానీ ఎప్పుడూ మాట్లాడిందిలేదు.
ఏమాటకామాటే చెప్పుకోవాలేగానీ కొన్నివిషయాల్లో ఆయన్ని అందరికన్నా ఎక్కువే అర్థం చేసుకుంది. సగటు మనిషిలా నాన్నకూడా ఆస్తిక-నాస్తికవాదాల మద్యన ఊగిసలాడే ఆలోచనల్లనే తనమొహానికికూడా కాషాయం- ఎరుపుమద్యన ఒకరకమైన షేడ్లో మేకప్ చేసుకునేది. చీకట్లో ఆయనవెళ్ళేప్పుడు దారిచూపించేంత కాకపోయినా ఎదురొచ్చేవాళ్ళు నాన్నని గుద్దకుండా కాపాడేది. మనసుబాలేకున్నా,మరీ ఆనందంగా ఉన్నా నాన్నెప్పుడూ తనతోనే పంచుకుంటాడని కొంచెంబలుపు చూపించేది. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ అనుబంధం బాగాపెరిగిపోయింది. ఆయనరక్తంలోకి చేరి చివరికి గుండెల్లో గూడుకట్టుకుంది.
చివరికి నాన్నతోబాటే సతీసహగమనం చేసింది. తనుమెట్టినింటికి వస్తూవస్తూ మంధరలాంటి దాసీని తీసుకొచ్చింది. అదిప్పుడు సన్యాసుల్లో కలిసిపోయి దేవుడిదగ్గర దీపం, అగరొతులు వెలిగిస్తూ జీవితాన్ని సాగదీస్తోంది. అమ్మకి మాత్రం అప్పుడప్పుడూ చిన్నభయం. నేనూ ఎవరినైనా పెళ్ళి చేస్కున్నానేమోనని. నేను అమ్మకొడుకునని తనకి తెలుసనుకో.

17 comments:

  1. ఏమిటి సిగరెట్టా :)

    ReplyDelete
  2. @శ్రావ్య:హ్మ్.అదే. ప్రస్తుతానికి అగ్గిపెట్టె దేవుడిగదిలో సెటిలయ్యింది :)

    ReplyDelete
  3. సిగరెట్టే లా వుంది . :)

    ReplyDelete
  4. ఈ కొత్త కధేమిటి అని భయపడ్డా..భలే తికమక పెట్టావ్..
    క్రింద వ్యాఖ్యలు చూస్తే అర్ధం అయ్యింది ఈ మట్టి బుర్రకి...:)

    ReplyDelete
  5. baavundi ... naaku ardam kaaledu :( until i saw the comments.

    ReplyDelete
  6. చాలా బాగా వ్రాసారు
    కామెంట్స్ చదివినా కూడా అర్ధం కాలేదు,
    సిగరెట్టు అని కావ్య గారు ఎలా ఉహించగలిగారు?
    నా రాజ , ఏమి చమక్కులే

    ReplyDelete
  7. renDu saarlu chadivi kaamenTlu chadivitae gaanee ardham kaalaedu. nijamgaa bhalae chamakku:-)

    ReplyDelete
  8. టపా బాగా వ్రాశావు... కానీ ఎందుకో చాలా బాధ గావుంది....!! నా బాధ వివరం నీకు తెలుసు అనుకుంటా....!!! -Siva Kumar.K

    ReplyDelete
  9. @ మాలాకుమార్, నాగ, హరేకృష్ణ, తృష్ణక్క, కిరణ్, బె.రౌ., వేణు శ్రీకాంత్, సనైటా, తిరు : :) ;) :-)) ;-), :*)

    @శివన్న: :(

    ReplyDelete
  10. వావ్.. చాలా బాగా రాశారు.. ఇంతకీ మీకింకా పెళ్లికాలేదని అమ్మగారితో పాటు మమ్మల్నీ నమ్మమంటారు? అంతేనా? :-) :-)

    ReplyDelete
  11. @గీతా: :)
    @మురళి: నమ్మమనేగా టపారాసింది. నమ్మి ఊరకుంటే సరిపోదండోయ్. ఎవరైనా మాటకలపడానికొస్తే నాపేరుప్రస్తావిద్దురు

    ReplyDelete