"వస్తూన్నా ఉండరా."
---------
"ఎక్కడ ఎక్కడ"
"నీ ఎదురుగానేరా"
"నువ్వుకాదహే. పొట్లాలు."
వాడి బాగ్‌లోంచి బట్టలు బయటికి దొర్లబోసి
అడుగున ఉన్న నగిషీలు చెక్కిన చెక్కపెట్టె
దానికొక తాటికాయంత తాళం
తాళంవేసి గొళ్ళెం మరిచారు.
తెరిస్తే
ఆపక్కనే పిల్ట్రీ భాండం.
"తాత దగ్గరున్న పిల్ట్రీ పంపుతున్నా. కొత్తది తెచ్చేందుకు టైమ్ దొరకలేదు" అని చెప్పిందిరా అమ్మ.
"సుసంపన్నమైన బహువిధమైన మాతాత వారసత్వ సంపద నాకు గర్వకారణం." అని చెప్పేసి దాన్ని చేతిలోకి తీసుకుంటే కెవ్వ్
కిందకలక్టరు కన్నా పైన చిల్లులగిన్నె ఒక మిల్లీమీతరు పెద్దది.
పళ్లుబిగబట్టి గట్టిగా ఒత్తితే క్లెమోర్‌మైన్‌లా ఎగిరింది.
"పైగిన్నెని గట్టిగా ఒత్తము. దాన్ని నీపై ఉంచనిస్తే చాలు" అని కిందదాంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తెల్లజెండా ఎగరేశా.
"ఇంతకీ పొయ్యెక్కడరా నీయబ్బా? పాలు, డికాక్షను కాచేదెలా?"
"పద పక్కీదిలోనే యుటెన్సిల్‌షాపుంది."
"కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, అగ్గిపెట్టె.." అనుకుంటూ అన్నీ పట్టుకొచ్చాం.
ఇక నే రాయనక్ఖర్లేదు. కింద దృశ్యమాలిక.
ఇదంతా చేసేసి అలిసిపోయింది నేననుకుంటే డికాక్షన్‌లో వేలేశారన్నమాటే.
మనకు పాకశాస్త్రంలో ప్రావీణ్యం గురించి అన్నప్రాశనరోజే చెప్పాగదా.
పైనకనిపించేది అశోక్ అని మనబాల్యమిత్రుడు.
అలావాడు కాఫీకాస్తుంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో
"స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం..."
"ఆనాటి ఆస్నేహమానందగీతం.."
"సింగారాలపైరుల్లోనా బంగారాలే.."
"చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో.."
ఇలాటివి పెట్టాను. మద్యలో "ముస్తాఫా ముస్తాఫా " అందామంటే అందులో వినీత్, అబ్బాస్‌లకి వచ్చిన సమస్యలు మాఇద్దరి మద్యనా రాలేదు కాబట్టి విరమించుకున్నా.
ఇలా కాఫీగ్లాసు పక్కనెట్టుకుని టపాలకి వ్యాఖ్యలు రాసుకుంటూ ఈజీవితం సాగిపోతే...
మొత్తానికి చలిపులిపంజా దెబ్బకి మనకొక పెయిన్‌కిల్లర్ దొరికింది.
కాఫీ గురించి నాకు (నాకుమాత్రమే తెలిసిన నిజాలు)
హంస పాలు-నీళ్లు కలిపి ఇస్తే పాలు తాగి నీల్లని వదిలేస్తుంది. అదే కాఫీ ఇస్తే?
డికాక్షను తాగి పాలు వదిలేస్తుంది.
కురుక్షేత్రంమద్యలో కృష్ణుడు గొంతుబొంగురుబోయేలా అరిచీ అరిచీ గీతను చెప్పినా అర్జునుడూ, కపిరాజు తప్ప ఇంకెవ్వరూ వినలేదు. ఎందుకని?
అదేసమయానికి ద్వారకనుంచి పాలెత్తుకొచ్చి కాఫీ కాయటం మొదలెట్టారు యాదవులు. గీత కావాలంటే ఘంటసాల కాసెట్టుకొని ఎన్నిసార్లయినా వినొచ్చులే అని అటెల్లి పోయారంతా. అర్జునుడు పాపం నీల్‌డౌన్ పొజిషన్‌లో ఉండేసరికే తప్పించుకోలేక పోయాడు. కపిరాజు మాత్రం ఝెండాకి అటుపక్క దాపెట్టేశాడు. అంతా విష్ణుమాయ.
ఎన్నితలలు కొట్టినా ఉపయోగం లేకపోతే అప్పుడు విభీషణుడు వచ్చి" రామా! మాయన్న పెద్దపిల్ట్రీ పొట్టలో పెట్టుకోనున్నాడు దాన్ని గురిచూసికొట్టు." అన్నాడట.
ఇదేంది... అబయో....మనకు (మాత్రమే) తెలిసిన ముచ్చట అందరికీ చెపితే ఎట్ల....కుంభకర్ణుని లేపింది ఈ కాపీ వాసనే...తోక స్వామి(నా కొడుకు అట్లే అంటాడు మరి)అదేనబ్బా హనుమంతయ్య కొండనెత్తుకొచ్చింది సంజీవని కోసం కాదు....కపీశ్వరులకు వూపు రావాల్ని కాపీ (మా చెన్నై లొ అట్లగే పిలుస్తారు మల్ల)గింజలు ఎరుకొనేకి వెళ అవ్వుద్దని కొండెత్తుకొచ్చింది అని ,భీముడు వంట వాడి గా మారింది ఈ కాపీ కొసమే అని చెప్పడం మరచినట్లున్నవ్... చూడబోతే .. "కాపీయణం"
ReplyDeleteరాసేట్లున్నావ్.... మొత్తానికి కేక పెట్టించావ్ ...!! పాపం అశొక్ !!
భళే గా రాశారు...కాఫి తీసుకుని తాగుదామా అన్న౦తా సుపర్ గా ఉ౦ది చూడటానికి.
ReplyDeleteమొత్తానికి మీ కాఫీ బాధలు ఇలా తీరిపోయినయ్యన్నమాట.
ReplyDeleteబాగుందండీ కాఫీ...
ReplyDeleteAdurs bava
ReplyDelete@ శివన్న: కాఫీయణం కేకో...కేక
ReplyDelete@ సుభద్ర: ధన్యవాదాలు
@ సునీత: ఇక తీరినట్టే.
@ మురళి: మీకూ ఓకప్పు కాదుకాదు అర్థశేరుగ్లాసు
@ అజ్ఞాత: ఎవడువాడు? ఎచటివాడు? నన్ను బావా అనిపిలిచినోడు. నువ్వు నాత్రిచీ ఫ్రెండువేనా?
ఈ కాఫీని చూస్తుంటే కాఫీ మానేసిన నాకె తాగేయాలనిపిస్తోంది...:)
ReplyDelete"ఇలా కాఫీగ్లాసు పక్కనెట్టుకుని టపాలకి వ్యాఖ్యలు రాసుకుంటూ ఈజీవితం సాగిపోతే..."
ReplyDeleteఆహా నిజంగా ఎంత బాగుంటుంది :)
చాలా బాగుందండీ మీ కాఫీయణం
ఆహా!! మరి నాకో
ReplyDelete