మొదటిభాగం మోతీజిల్1
ఏడోతరగతిలో మదర్‌థెరిస్సా అనేపాఠం ఉండేది. ఆపాఠం, అందులో మోతీజీల్ గురించిన ప్రశ్న కామన్ పరీక్షల్లో చాలాఇంపార్టెంట్. సుకుమార్ క్వశ్చన్ బాంకులోనూ, రాఘవేంద్రగోల్డెన్ గైడులోనూ చాలాముఖ్యం అని రాసున్నారు. అన్నట్టు ఇంకోవిషయం- రాఘవేంద్ర గైడు బీ.ఏ. చదివిన దర్శకేంద్రుడిదే అనుకునేవాడిని. అప్పట్లోనే మేజర్ చంద్రకాంత్ రిలీజయి ఆఅభిప్రాయానికి బాగాబలం చేకూర్చింది.
ఇక అసలు విషయానికొస్తే, మోతీజిల్ అనేది కలకత్తాలోని మురికివాడ. ఆగ్నస్ థెరిసాగా సేవలు మొదలుపెట్టింది అక్కడినుంచే. ముందురోజు మోతీజిల్ గురించి చెప్పి నాకొక బలవంతుడైన పహిల్వాన్ కారక్టరు, ఇంకోడికి కుష్టురోగిపాత్ర, మరొకడు థెరిసాపాత్ర. అదీసీన్. తర్వాతరోజు ముఖ్యమైన ప్రశ్నకావడంతో వచ్చీరావడంతోనే పాఠంలోకి వెళ్ళిపోయాడు.
కొంతసేపాగి "మోతీజిల్ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరెవరికి సమాథానాలు వచ్చో చేతులెత్తండి." అన్నాడు. నాకు ఎడమకన్ను కొట్టుకుంది. ఇదేదో రాబోయేకీడుకి ఇది పైలట్ అనుకొని చెయ్యెత్తకుండా గుట్టుగా కూర్చున్నా. అందరూ చేతులెత్తారు. అందులోంచి రాజేష్ గాడిని లేపాడు. చెప్పరా అన్నాడు.
వాడు వెంటనే చేతులుకట్టేసుకుని బిర్రబిగుసుకుని నిలబడ్డాడు. " మోతీజిల్ కలకత్తాలోని ఒకమురికివాడ. అక్కడిప్రజలు ఎంతో అపరిశుభ్రంగా ఉండేవారు. (నాకర్థం అయిపోయింది ఇది రాఘవేంద్రలోది. సుకుమార్లొ అయితే మొదటిలైను వేరేగా ఉంటుంది.) అక్కడ సామాజిక పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉండేవి. (అయ్యోరుకి బీపీ జుయ్య్ మంటూ పెరిగిపోయింది.)
"చీ! ఆపు." వాడి పిర్రమీద బెత్తంతో ఒక్కటిచ్చాడు. కట్టేసుకున్న చేతుల్లోంచి ఒకదాన్ని తీసి 'ఉస్సూ..ఆబ్బా..' అంటూ తడుముకుంటూ నిలబడ్డాడు.ఎక్కడినుంచి పుట్టుకొస్తార్రా.
"అప్పజెప్పే బుద్దులూ మీరూనూ. అడక్కతిన్నా సిగ్గన్నాలేక. ఇలా అప్పజెప్పుకుంటూపోతే రేపు బస్టాండులో టాయిలెట్లు కడుక్కోనుతప్ప దేనికీపనికిరారు. 'కాకికి రెండుకాళ్ళుండును' అన్నదికూడా గైడుచూసే నేర్చుకుంటారా. రేపుపెళ్ళాయ్యాక ఆఫీసునుంచి వచ్చి "ఓసీభార్యామణీ! నేను కార్యాలయమునుమ్చి వచ్చుచుండగా మార్గమద్యమున శునకములు వెంటబడినవి. వాటిని తప్పించుకొనుటకు పురవీథులన్నింటినీ సంచరించి గృహమునకు చేరేసరికే ఈసమయమైనది. నాకు కొద్దిగా జలముతెమ్ము." అన్నావనుకో నీపెళ్లాం జలముకాదు చీపరకట్ట ఎత్తుకొస్తాది..." ఇలాసాగిపోతూ ఉంది.
ఎప్పుడైనా సారుచేతిలో దెబ్బలు తప్పిపోతే ఆనందంగా ఉంటుంది. అది లౌకికానందం. అదేదెబ్బలు మనఫ్రెండెవడైనా తింటే అప్పుడుకలిగే ఆనందం ఉందే అదే అలౌకికానందం. ఆక్షణంలో నేననుభవిస్తున్నది అదే. "హమ్మయ్య! నేనుచెయ్యెత్తలేదు అనుకున్నా." ఇలా ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి నాపక్క తిరిగి నువ్వుచెప్పరా అన్నాడు. చెయ్యెత్తలేదన్న సంగతి నాకు తెలుసుగానీ ఆయనకి తెలీదు. ఇప్పుడావిషయాన్ని చర్చిస్తే ఏమవుతుందో నాకేకాదు మీకూ తెలుసు. పరిస్థితిని అర్థం చేసుకుని జవాబెలా చెప్పాలి అని ఆలోచించే దానికి ఓఅరనిముషం పట్టింది.
చేతులుకట్టుకున్నా. " మోతీజిల్ అనే వీథి కలకత్తాలో ఉంది. అక్కడంతా పేదోళ్ళు. తినేదానికి మంచిఅన్నం దొరకదు.." ఇలా చెప్పుకుంటూపోతున్నా. ఆయననాకు దగ్గరగా వస్తున్నాడు. సగంబుర్ర మోతీజిల్ గురించి, మిగతాసగంబుర్ర ఇప్పుడు ఏదేవుణ్ణి వేడుకోవాలి? అయ్యప్పస్వామి? సీజన్‌కాదు. రాముడు? మొన్నఓసారి అడ్డుపడ్డాడు. శివుడు? వీరభద్రుడు?అమ్మో. విష్ణువు? గజేంద్రమోక్షంరాదే. సుబ్రహ్మణ్యస్వామి? నాపేరులో సగమే ఆయనది. కానీ సారుది మొత్తంపేరు అదే. కాబట్టి పెద్దగా సపోర్ట్ ఇవ్వడేమో? ఇలా సాగుతుంది మల్టీటాస్కింగ్. నెమ్మదిగా పక్కకొచ్చేశాడు. బెత్తంకూడా అవసరంలేదు చెయ్యెత్తాడంటే చెంప పేళ్‌మని పేలిపోతుంది. నెమ్మదిగా చెయ్యెత్తి భుజంపైన వేశాడు. ఎంతచెప్పానో? ఎంవదిలేశానో? తెలీదు. ఆయనపక్క తిరిగిచూశా. కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు. హమ్మయ్య అనుకుని ఎలాగోలా పూర్తిచేశా.
అలా నాపక్క చూసి పేళ్‌మని ఓచెంపపై పీకాడు. "నీకు జవాబు తెలిసినా ఇందాక చెయ్యెందుకు ఎత్తలేదు?" అప్పుడర్థమైంది నాకు ఎడమకన్ను ఎందుకు కొట్టుకుందో. కూర్చో అని ఓఅరుపు అరిచి మొదలుపెట్టాడు.
" భాష అనేది రెండురకాలు. ఒకటి మాట్లాడేభాష. ఇంకోటి రాసేభాష. నేను జవాబు అడిగినప్పుడు మీకేమి తెలుసోదాన్ని మీకొచ్చినమాటల్లోనే చెప్పాలి. రాసేభాషవేరే. ఎందుకంటే దాన్నిచదివేవాడూ నీకెదురుగా ఉండడు. అతనికి నువ్వు తెలిసుండొచ్చు. తెలియకపోవచ్చు. నువ్వుచెప్పలనుకున్న విషయంలో ఏమాత్రం గందరగోళం ఉన్నా చాలాఇబ్బందులొస్తాయి. మాట్లాడేటప్పుడు ప్రశ్న అర్థంకాకపోతే మరొకసారి అడగొచ్చు. రాసేప్పుడు ఆవకాశం ఉండదు. ఏమాత్రం తప్పుగా అర్థంచేసుకున్నా పరీక్షల్లో అయితే మార్కులుపోతాయి. బయటైతే ఇంకాచాలా ఇబ్బందులొస్తాయి. ఎప్పుడు ఏభాషను ఉపయోగించాలో తెలుసుకొని మసలాలి."
ఆతర్వాత చాలాసార్లు ఆయనమాట నిజమేమనిపించింది. బ్లాగు మొదలెట్టాక ఆమాటలు నిత్యసత్యం అన్న సంగతి తెలిసొచ్చింది. చాలాసార్లు ముందు కొంతరాయడం ఆపై ఇలారాస్తే మీరు వేరేరకంగా అర్థంచేసుకుంటే అనుకొని మార్చడం. చాలాసార్లు ఇక్కడ చోటుచేసుకున్న వివాదాలకు మూలం అదే అనుకుంటా. ఇప్పటిదాకా **లేఖలు రాసే అవసరం రాలేదుకాబట్టి సరిపోయింది. ఆఅవసరం పడితే? అమ్మో. తలుచుకుంటేనే భయమేస్తుంది.
పక్కన జారుడుబద్దపైన ఎలచ్చన్లు నిర్వహిస్తున్నాం. పాఠకులు మీవిలువైన ఓటుహక్కును 'వావ్'పైన గుద్ది ఆనందింపచెయ్య ప్రార్థన
మోతీజిల్ 1
మాఊరిలో మొత్తం ఏడుగుళ్ళు ఆరు బళ్ళు ఉన్నాయి. గుళ్ళలో నాలుగు వైష్ణవం, రెండు అమ్మవార్లు మరియు ఒకటి శివాలయం. బళ్ళలో ఐదు ప్రాథమిక( మూడు పరిషత్, రెండు ఎయిడెడ్), ఒక ప్రాథమికోన్నత మరియు ఒక ఉన్నతపాఠశాల. గుళ్ళు, మిగతా బళ్ల సంగతి తర్వాత మాట్లాడుకుందాం (సవివరంగా). ఉన్నతపాఠశాల విషయానికొస్తే అది 1932 లో ప్రారంభించారు. దానిపేరు SALCEF HighSchool (సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కా హైస్కూలు). దానికాపేరు ఎందుకొచ్చింది అన్న సంగతికూడా మళ్ళీమాట్లాడుకుందాం. దీనిపేరు ఈమద్యన మార్చారు. NBKRSALCEF High School (నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కాహైస్కూలు). అసలాపేరు ఎందుకుమారిందన్నదికూడా ఇప్పుడూ చెప్పేంత చిన్నదికాదు. కాబట్టి అదికూడా మళ్ళీనే. అదృష్టం బావుండి ఆరోతరగతిలో రాగింగ్ లేదుకాబట్టి సరిపోయిందికానీ లేకుంటే జూనియర్లను ఒక్కోడు నూటెమిదిసార్లు స్కూలుపేరు రాసుకురాండ్రా అని సీనియర్లు చెప్పారనుకో ఇకఅంతే బడిబాట మూసుకుపోతుంది.
ఆబడి ప్రారంభించి ఇప్పటికి దాదాపు డెబ్బైఎనిమిదేళ్ళు. ఇన్నేళ్ళ ఆస్కూలు చరిత్రలో ఎన్నో ఉత్తన్నపతనాలు, ఎందరో హెడ్మాస్తర్లు, డ్రిల్ మాస్టర్లు,పిల్లల్లో కొందరు బాలమేథావులు, మరెందరో గజినీలు. ఒకానొక రోజుల్లో స్కూలుబలం వందకుపైన పంతుళ్లు పదహారొందలమంది పిల్లలు. చెప్పాగా చరిత్రచాలా పెద్దది అని. ఒకటపాలో సరిపోయేదికాదు.
ఒకపేరుంది. ఆస్కూల్లో చదివినవాళ్లకి, పనిచేసినవాళ్ళకి ఆపేరుచెప్పడంతోనే అప్రయత్నంగా చిరునవ్వు ప్రత్యక్షమయ్యి ఆపై వాళ్లవాళ్ల అనుభవాలననుసరించి మిగిలిన హావభావాలు వ్యక్తమవుతాయి. ఆపేరు పీ.వీ. సుబ్రహ్మణ్యం. ఆస్కూల్లో దాదాపు ముప్పైమూడేళ్ళు పనిచేసిన తెలుగుపండితుడు. తెలుగుపండితుడు అనడంతోనే ఆహార్యాన్ని ఊహించేసుకోకండి ఆయన బ్రహ్మానందంలాకాక సుందరకాండలో వెంకటేష్‌బాబులా పాంటుషర్టు వేసుకునేవాడు. సుందరకాండ పేరువిని అనవసరమైనవి ఊహించుకోకండి. కళ్ళుపోతాయ్.
ఆయనకి మంగళవారం భయంకరమైన సెంటిమెంట్. అంటే ఏముఖ్యమైనపనైనా మంగళవారం మొదలుపెడతారన్నమాట. అలా ఆయన ఉద్యోగజీవితాన్ని కూడా మంగళవారమే మొదలుపెట్టాడు.ఆయనకి ఐతే మంగళవారం సెంటిమెంటు అచ్చొచ్చింది, కానీ అందరికీకాదుగా. దానిఫలితం అప్పటిదాకా ఉమ్మడిగా బాలబాలికల్తో కళకళలాడిన బడి ఆవరణం ఒక్కసారిగా ఎడారిగా మారిపోయింది. అంటే అర్థం అయ్యిందిగా. ఆయనచేరిన రోజే అమ్మాయిలకు విడిగా హైస్కూలు మొదలుపెట్టారు. హైస్కూలుజీవితంపై ఎన్నోఆశలతో చేరినవాళ్ళకి శరాఘాతంగా మారిందీ పరిణామం. ఇక ఆరోజునుంచి సుబ్రహ్మణ్యంగారి ఆగ్రహానుగ్రహాలకు హెడ్మాష్టరునుంచి ఆరోతరగతి పిల్లాడిదాకా ఉక్కిరిబిక్కిరవడం నిర్విఘ్నంగా ముప్పైమూడేళ్లపాటు జరిగింది.
నేను చిన్నబడిలో ఉన్నప్పుడే ఆయన తెలుసు. తాతదగ్గరికి పంచాంగంకోసం వచ్చేవాడు. జయచంద్ అని నాఫ్రెండొకడు ఆయన దగ్గరికి నవోదయకోచింగ్ కోసంవెళ్ళేవాడు. వాళ్ళనాన్నకి ఆసారంటే బాగాగురి. అదీగాక ఆయనకి ఇంకొక అలవాటుంది. సాయంత్రం బడి వదిలాక అన్నోళ్ళంతా ఆయనతోపాటు గుంపుగా వచ్చేవాళ్ళు. స్కూలునుంచి ఇంటిదాకా ఈపిల్లగాంగుతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వచ్చేవాడు.అది నాకు కొంచెంవింతగా తోచేది.
ఐదోతరగతిదాకా ఆయన తెలుసు కానీ, ఆయనగురించి తెలిసిందిమాత్రం ఆరులో చేరాకే. బాగాచదివేవాళ్ళు, అంటే పరిక్షల్లోబాగా మార్కులొచ్చేవాళ్ళు కాదు పాఠాన్ని చదవరా అంటే పుస్తకం చేతులోపెట్టుకుని గట్టిగా క్లాసంతా వినిపించేలా చదివేవాళ్ళు, అంటె ఆయనకి ఇష్టం. బాగారాసేవాళ్ళు అంటేమాత్రం ప్రాణం. ఆయన పాఠం చెప్పే విథానం ఎలా అంటే- ఒకడు పాఠాన్ని చదువుతూ ఉండాలి, అప్పుడు చదువుతున్న భాగంలో ఎన్నిపాత్రలుంటాయో అంతమంది నిలబడి అంటే అదొకనాటకంలా అన్నమాట, ఒకడు ముఖ్యమైన పదాల్ని బోర్డుపైన రాయాలి. ఆరో తరగతిలో మాత్రం బోర్డుపైన ఆయనే రాస్తాడు, మిగతాక్లాసుల్లో కొన్నిఆయన-మరికొన్ని పిల్లలు. నోట్సివ్వటం వంటివి ఎప్పుడూ ఉండదు ఒక్క పదోతరగతికి తప్ప. పిరిడుగంట కొట్టేవరకు నిలబడే ఉండాలి వీళ్ళంతా. ఇక్కడ సమస్య నిలబడడంకాదు. ఆయనకి బీపీ కొంచెం అంటే కొంచెమే ఎక్కువ. ఆక్షణంలో అతిసమీపంలోని విద్యార్థి వీపుపై కింగ్‌ఫిషర్ విమానం హారను కొట్టేలా అల్గరిథం ఒకటి ఉంటుంది. ఆప్రోగ్రాం పూర్తిగా ఆటొమేటేడ్.
ఆరోతరగతిలో మనపైన మాంచీ ఇదన్నమాట. దాదాపూ రోజూ చదివేపని నాదే. అప్పట్లో జగ్గయ్య అని పిలిచేవాళ్ళు నన్ను. ఇదిబాగానే ఉండేదికానీ అప్పుడప్పుడు వేరేవాళ్ళు చదివేటప్పుడు ఏదోఒకపాత్ర అందులోనూ ఎక్కువగా హీరోయిన్ పాత్ర ఇచ్చేవాడు. కొద్దికొద్దిగా ఊహతెలిసొచ్చే వయసులో ఆడపాత్రకి నిలబడాలి అంటె తెగసిగ్గుగా ఉండేది. మనకంటే తెల్లగా ఉండే అశొగ్గాడు క్లాసులోకి వచ్చింది దసరా తర్వాత. ఆతర్వాత నాకీభారం తగ్గింది.
ఆఇమేజీతో ఆసంవత్సరం అంతా గండపెండేరాలు, గజారోహణలు అబ్బో. ఇక ఏడొతరగతికొచ్చే సరికే బోర్డుపైన రాయాలి. అక్కడే మరి తేడావచ్చేది. నాబ్రహ్మరాత గురించి విడిగా ఓటపా పెడతా. నాకుతెలిసీ ఈవిషయంలో బ్లాగ్మిత్రులలో కొంతమంది తోడున్నారు నెమలికన్ను మురళిగారు, సునీతగారు వగైరా వగైరా. మొదటిరోజు ఓంప్రదంగా ఆయనే రాశారు. హమ్మయ్య తొలిరోజుగండం గడిచింది అనుకున్నా. మొత్తానికి మొదటి రెండుమూడువారాలు అలానే బిక్కుబిక్కుమంటూ గడిపా. మొత్తానికి ఆపిలుపు వచ్చింది. "తనతండ్రియైన వాయుదేవునకు సూర్యచంద్రబ్రహ్మాదిదేవులకు ...వందనములిడే పూర్వాభిముఖుడై.." అని సుందరకాండ చదువుకుని, సర్వమతప్రార్థనలు జరిపుకొని చాక్‌పీసు పట్టుకున్నా. తీరా రాసేసమయానికి ఇటివ్వు అని ఆయనే రాశాడు. "హమ్మయ్య! దేవుడున్నాడు. ఇంట్లో మనంపెట్టే నైవేద్యాలు,అమ్మమ్మ వారంవారంవండే గుగ్గిళ్ళు తిని ఇలాంటి సమయాల్లో మహిమలు చూపిస్తాడు." అనుకొని వచ్చికూర్చున్నా.బహుశా సార్ల దగ్గర దెబ్బలుతినే సమయంలోనే చాలామంది విపరీతమైన ఆస్తికులుగానో, కరడుకట్టిన నాస్తికులుగానో మారుతారనుకుంటా.
ఇలా ఎన్నిరోజులు సాగితాయి. ఒకటారెండా? ఒకసంవత్సరం. అంటే సుమారు రెండొందలపని దినాలు. అందులో నూటయాభై తెలుగుపిరియడ్లు. ఒకానొక సమయంలో చిక్కిపోయా. మనరాత చూసి కళ్ళుతిరిగిపోయాయి. మీకొక అనుమానం రావొచ్చు. ఆరోతరగతిలోనే చేతిరాత చూసుంటాడుగా అని?
నిజానికి ఆరోతరగతి ఆయన క్లాసుకాదు.మాకు ఆరోతరగతిలో తెలుగుకు సారులేడు. టైంటేబుల్లో లెక్కలమేడం మాకు తెలుగుకూడా చెప్పాలి. కానీ ఆమెకి క్లాసులెక్కువవడంతో కర్టసీమీద ఈయనే తీసుకునేవాడూ. పరీక్షలుమాత్రం ఆవిడే చూసుకునేది. లెక్కల్లో నాపైనఉన్న అభిప్రాయం తెలుగులో చేతిరాతను కప్పేసింది. అలా మొదటిసారి బోర్డుపైన 'నా'రాతని చూసి ఆయన బీపీ శిఖరానికెళ్ళి "శృతిశిఖర సంచారా.." అనిపాడింది. ఇక్కడా దైవం మనపక్షానే. ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం, ఆదెబ్బలుతిని మరొకడు నాస్తికుడుగా మారిపోవడం క్షణకాలంలో జరిగిపోయాయి.
ఈహఠాత్పరిణామానికి ఆయనహృదయం ముక్కలైంది. నమ్మబుద్ధిగాక నానోట్సునడిగాడు. చూశాడు. బోర్డుపైన రాతే కొద్దిగా నయం అనుకున్నాడు. ఒక్కసారిగా నాప్రతిష్టకి గ్రహణం పట్టింది. నేను చదివేప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంటుందిగానీ ఎక్కడైనా రాయాల్సొచ్చినప్పుడు మాత్రం ప్రాథమికహక్కులు పూర్తిగా కాలరాచబడేవి. సైనికచర్యలు చేపట్టేవారు.
కొంతకాలానికి కొట్టడం ఆయన బాగాతగ్గించేశాడు. "ఈమద్యన అయ్యోరు పెద్దగా కొట్టట్లేదన్నా" అని ఎనిమిదోతర్గతివాళ్ళతో అంటే దానికి వాళ్ళు- "మాకూ అలానే అనిపించిందిరా. ఆయనేం తగ్గించలేదు. మనమే అలవాటుపడిపోయాం అని తర్వాత అర్థం అయ్యింది." అని సెలవిచ్చారు. అదీ అనుభవం అంటే. ఎంతైనా సీనియర్లు సీనియర్లే. మనకి తట్టనిసూక్ష్మాలు వాళ్ళు పట్టేస్తారు.
మోతీజిల్ 2

Subscribe to:
Posts (Atom)